<cesDoc id="tel-w-science-agriculture-garden4a" lang="tel">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>tel-w-science-agriculture-garden4a.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-13</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>గార్డెనింగ్(పెరటి తోటలు)</h.title>
<h.author>విశాల వేణుగోపాల్</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - Book</publisher>
<pubDate>1992</pubDate>
</imprint>
<idno type="CIIL code">garden4a</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page 60.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-13</date></creation>
<langUsage>Telugu</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fact"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>సల్ఫర్:</p>

<p> మిథియోనిన్ సిస్టన్ అనే అమైనో ఆమ్లాలలో సల్ఫర్ ఒక అంతర్భాగం.
#అన్ని
ప్రోటీన్్లలోను ముఖ్యంగా చర్మం, వెంట్రుకలలోని `కెరాటిన్' లోను,
ఇన్్సులిన్ లోను సల్ఫర్ ఉంటుంది. శరీరంలో కొన్ని ముఖ్యమైన ఎంజైమ్్లు,
హార్మోనులలో కూడ సల్ఫర్ ఉంటుంది. శరీరానికి కావలసిన సల్ఫర్ మనం తినే
#ఆహార
పదార్థాలలో ఉన్న మిథియొనిన్, సిస్టన్్ల నుంచి ఎక్కువగా లభిస్తుంది.
#పాలు, మాంసం
223-
చేపలు, గుడ్లు, మొదలైన జంతు సంబంధమైన పదార్థాలలో, నువ్వులు, మెంతులలో
అవిశలాంటి ఆకు కూరలలో సల్ఫర్ ఉన్న అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఇవి సల్ఫర్ ఉన్న ఆహార పదార్థాలుగా చెప్పుకొనవచ్చు.
మెగ్నీషియమ్:
 కాల్షియమ్, ఫాస్పరస్ తరువాత శరీరంలో ఎక్కువగా ఉండే లోహ పదార్థం
మెగ్నీషియం. ఒక మనిషి శరీరంలో ఇది 20 నుంచి 28 గ్రావరకు ఉంటుంది.
దీనిలో సుమారు 60 శాతం ఎముకలలో, 26 శాతం కండరాలలో, మిగిలినది మెత్తటి
కణాలలో, శరీర ద్రవాలలో ఉంటుంది. మెగ్నీషియమ్ ప్రోటీన్ శోషణ లో
ముఖ్యంగా అవసరమైన పదార్థం. ఇది కండర సంకోచానికి, నరాల ప్రకోపనానికి
కావలసిన ఖనిజ లవణం. చాల ఎంజైమ్్లకు ఇది సహకారకము
గా పని చేస్తుంది. ఆహారంలో మెగ్నీషియం శరీరావసరాలకు కావలసిన
మోతాదు కంటే ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పిక్కలు, పప్పుదినుసులు
ధాన్యం, ఆకు కూరలు, కోకో, చాకలేట్ మొదలైన వాటిలో ఉంటుంది.
కాబట్టి సాధారణంగా మెగ్నీషియం లోపం సంభవించదు. కాని ఇది లోపిస్తే
#ధనుర్వాతం
వస్తుంది. కాల్షియం, ప్రోటీన్్లు, D విటమిన్ మరియు ఆల్కహాల్ ఆహారంలో
ఎక్కువగా తీసుకున్నపుడు శరీరంలో మెగ్నీషియం అవసరం కూడ ఎక్కువ అవుతుంది.
క్వాషియార్్కర్, డయాబెటిస్, మూత్ర పిండాల వ్యాధి ఉన్న వారిలో మెగ్నీషియమ్
లోపం సంభవించే అవకాశాలున్నాయి.
కాపర్:
 ఒక మనిషి శరీరంలో సుమారు 80 నుంచి 120 మి.గ్రా కాపర్ ఉంటుంది.
మెదడు, కాలేయం, గుండె, మూత్ర పిండాలలో ఎక్కువ, కండరాలు,
ఎముకలలో తక్కువ కాపర్ ఉంటుంది. హిమోగ్లోబిన్ తయారు చేయడానికి
కాపర్ ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. రోజు తినే ఆహారంలో కాపర్ లోపం
224-
సంభవించదు. ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కాలేయం, మూత్ర పిండాలు,
అయిస్టర్్లు ఎండిన పండ్లు, గుల్లచేప, మాంసం, పిక్కలు,
పప్పుదినుసులు, చాకలేట్ మొదలైనవి. కాపర్ పెద్దల ఆహారంలో 2 నుంచి 3
#మి.గ్రా
వరకు ఉండాలి. చిన్న పిల్లలకు శరీర బరువును బట్టి కిలో గ్రాముకు 0.08
#మి.గ్రా
కాపర్ ఆహారంలో సరఫరా చెయ్యాలి. కాపర్ లోపం సంభవిస్తే రక్తహీనత కలిగే
అవకాశం ఉన్నది.
22-
విటమిన్్లు
 విటమిన్్లు శరీరంలో స్వల్ప మోతాదులో అవసరమైన పదార్థాలు. ఇవి
#జీవక్రియలో
ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. శరీరం పెరుగుదలకు, ఆరోగ్యాన్ని
#పరిరక్షించేందుకు ఇవి
చాలా అవసరం. అందువలన వీటిని ప్రతి దినం ఆహారంలో తప్పకుండా చేర్చాలి.
#వివిధములైన విటమినుల వేరు వేరు రసాయన సంకేతాన్ని కలిగి ఉండి వేరు వేరు
#చర్యలను
నిర్వహిస్తాయి. విటమిన్్లను రెండు వర్గాలుగా విభజించారు. 1 కొవ్వు
#పదార్థములలో
కరిగే విటమిన్్లు - A,D, E, K లు. 2 నీటిలో కరిగే విటమిన్్లు - ఴ B
#విటమినులు,
C విటమినులు.
కొవ్వులో కరిగే విటమిను:
A విటమిన్:
 A విటమిన్ లేత పసుపుపచ్చనని రంగుతో స్ఫటికాకారంలో ఉంటుంది.
#దీనినే
రెటినాల్ అని కూడా అంటారు. A విటమిన్ జంతు సంబంధమైన ఆహార
పదార్థాలలోనే ఉంటుంది. వృక్ష సంబంధమైన ఆహారపదార్థాలలో కెరొటినాయిడ్్లు
అనే A విటమిన్్గా పరివర్తన చెందుతాయి. ఈ రీతిగా పరివర్తన చెందే
కెరొటినాయిడ్్లను A ప్రోవిటమిన్ అంటారు. కెరొటినాయిడ్్లు మూడు
రూపాలలో ఉంటాయి. అవి ఆల్ఫా, బీటా, గామా
కెరొటినాయిడ్్లు. వీటిలో బీటా కెరొటిన్ ప్రధానమైనది ఎందుకంటే ఒక అణువు
#బీటా
కెరొటిన్ రెండు A విటమిన్ అణువులను విడుదల చేయగలదు. ఆల్ఫా, గామా
కెరాటిన్్లు చేరి ఒక అణువు. A వలిటమిన్్ను మాత్రం విడుదల చేస్తాయి. A
#విటమిన్్ను
ఇంటర్ నేషనల్ యూ ట్ లోనే కాక మైక్రొగ్రాములలో కూడా కొలుస్తాయి. ఒక
ఇంటర్ నేషనల్ యూనిట్ A వి మిన్ 0.3 మైక్రోగ్రాముల రెటినాల్ లేదా 0.6
#మైక్రో
గ్రాములబీటా కెరాటిన్్కు సమానం. A విటమిన్ వివిధ రూపాలలో ఉంటుంది అవి
రెటినాల్. A విటమిన్ అసిటేట్, A విటమిన్
ఆమ్లం.
226-
A విటమిన్ ప్రమేయాలు:
 1. కంటిచూపుకు, కంటి ఆరోగ్యాన్ని రక్షించేందుకు A విటమిన్ చాలా
#అవసరం.
2. A విటమిన్ ఎముకల, దంతాల నిర్మాణానికి, వాటి పెరుగుదలకు శరీరం
పెరుగుదలకు చాలా ముఖ్యం.
3. జీర్ణకోశం, ఊపిరితిత్తులు మొదలైన శరీరావయవాలలోని శ్లేష్మ పటలం
ఆరోగ్యాన్ని కాపాడడానికి A విటమిన్ అవసరం. ఈ
పొర ఆరోగ్యంగా ఉన్నప్పుడ఼ే వ్యాధిక్రిములు శరీరావయవాల లోనికి పోకుండా
ఎదుర్కొంటుంది. ఈ కారణం వల్లనే A విటమిన్్ను వ్యాధినిరోధక శక్తిగల
పదార్థంగా భావిస్తారు.
4. చర్మం మృదుత్వాన్ని, ఆరోగ్యాన్ని రక్షించేందుకు A విటమిన్ కావాలి.
6. సంతానోత్పత్తి సక్రమంగా జరగాలంటే A విటమిన్ చాలా అవసరం.
7. A విటమిన్ శరీరంను కాన్సర్ వ్యాధి బారినుంచి రక్షిస్తుందని భావిస్తారు.
ఆహార మూల పదార్థాలు:
 జంతు సంబంధమైన ఆహార పదార్థములు ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాలు,
వెన్న, గుడ్డులోని పచ్చసొన, పాలు, మీగడ, జొన్నులలో బాగా ఎక్కువగా
#ఉంటుంది.
కెరాటిన్ రూపాలు గోంగూర, మునగ, తోటకూర మొదలగు ఆకు కూరలలో, కారట్లు
గణుసుగడ్డ, బొప్పాయి, మామిడి లాంటి పసుపు ఎరుపు రంగు గల కాయగూరలు
పండ్లలో ఎక్కువగా ఉంటాయి. కార్ మరియు హాలిబట్ చేపల నూనెలు
A విటమిన్్ను అత్యధిక మోతాదులో కలిగి ఉండడం వలన నీటిని A విటమిన్ లోపం,
వల్ల వచ్చే జబ్బును పోగొట్టడానికి వాడతారు.
227-
నిత్యావసరాలు:
 ఏ వయసులో ఉన్నవారికైనా రోజుకు 3000 నుండి 4000 IU దాకా A విటమిన్
అవసరం. గర్భిణి స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు రోజూ ఆహారంలో ఎ విటమిను
#ఇంకా ఎక్కువ
మోతాదులో అవసరం. ఎదిగే పిల్లలకు కూడ ఎ విటమిన్ అవసరం ఎక్కువగా
#ఉంటుంది.
A విటమిన్ న్యూనతా రోగాలు:
 ఎదిగే పిల్లల ఆహారంలో A విటమిన్ లోపిస్తే పిల్లలు బాగా పెరగరు.
#A విటమిన్
లోపం వల్ల రేచీకటి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులకు చీకటి పడిన
తరువాత చూపు కనిపించదు. ఎక్కువ వెలుతురు నుండి చీకటి గదిలో
#ప్రవేశించినప్పుడు
చాల సేపటి వరకు కళ్ళు కనిపించక పోవడం కూడ ఈ వ్యాధి లక్షణమే. ఈ
#విటమిన్
లోపం వల్ల శరీరావయవాలను కప్పి ఉంచే శ్లేష్మ పటలం పొడి బారుతుంది.
#దీనినే
కెరటినైజేషన్ అంటారు. ఈ రీతిగా చర్మంగాని, ఇతర పొరలుగాని
228-
పొడిబారినప్పుడు అవి చేయవలసిన పనులను సక్రమంగా నిర్వహించలేవు. దీని వలన
సూక్ష్మ జీవుల బారి నుండి శరీరాన్ని రక్షించే శక్తి నన్న గిల్లుతుంది.
 A విటమిన్ లోపం వల్ల కంటిలో బీటాట్ మచ్చ ఏర్పడుతుంది.
ఈ లోపాన్ని చాల కాలం పొడిగిస్తే. గ్జెరోప్తాల్మియా అనే వ్యాధి
సంభవిస్తుంది. కంటిలో ఉన్న అశ్రుగ్రంథులు పని చేయక పోవడం వలన కంటి
#గ్రుడ్డు
మీది పొర తేమలేక ఎండిపోయినట్లు అగుపడుతుంది. చివరకు పుండు పడి
#గుడ్డితనానికి
దారి తీస్తుంది. మన దేశంలో ఉన్న గుడ్డివారిలో ప్రతి నలుగురిలో ఒకరికి
#A విటమిన్
లోపం వల్లనే అంధత్వం సంభవిస్తున్నది.
D విటమిన్:
 స్వచ్ఛమైన D విటమిన్ తెల్లగా, స్ఫటికాకారంలో, వాసన లేనిదిగా
#ఉంటుంది.
ఇది కొవ్వు, ద్రావణులలో కరగుతుంది. ఉష్ణం, ఆమ్లాలు - క్షారాలు దీనిపైన
#తమ
ప్రభావాన్ని చూపలేవు. జంతు సంబంధమైన ఆహార పదార్థాలలోని 7-డి
#హైడ్రోకొలెస్టెరాల్
వృక్ష సంబంధమైన ఆహారపదార్థాలలోని ఎర్గోస్టెరాల్
లను D ప్రోవిటమిన్్లు అంటారు. చర్మంలో ఉన్న 7-డి
హైడ్రోకొలెస్టెరాల్ సూర్యరశ్మి సోకినప్పుడు D విటమిన్్ లభిస్తుంది. D విటమిన్్ను
#ఇంటర్్నేషనల్
౟఼యూనిట్టులలో కొలుస్తారు.
229-
D విటమిన్ ప్రమేయాలు:
 1. ఎముకల నిర్మాణానికి, ఆరోగ్యానికి D విటమిన్ చాల అవసరం.
 2. కాల్షియమ్, ఫాస్పరస్ శోషణలో D విటమిన్ ముఖ్యపాత్ర వహిస్తుంది.
 3. రక్తంలో కాల్షియమ్, ఫాస్పరస్ మోతాదులు తగ్గినప్పుడు D విటమిన్
#ఈ
పదార్థాలను ఎముకల నుంచి తరలించి, రక్తంలో వీటి మోతాదులను క్రమ
పరుస్తుంది.
ఆహార మూల పదార్థాలు:
 D విటమిన్ కొన్ని చేపలలో, చేప నూనెలలో అత్యధికంగా ఉంటుంది.
#వెన్న,
మీగడ, గుడ్డులోని పచ్చసొన, కాలేయంలో సుమారైన మోతాదులలో ఉంటుంది. మిగతా
ఆహార పదార్థాలలో ఈ విటమిన్ లేదనే చెప్పవచ్చు.
నిత్యావసరాలు:
 సూర్యరశ్మి సోకని ప్రాంతాలలో నివసించే పసి పిల్లలకు, పిల్లలకు,
#కిశోర
వయస్కులకు 10 మైక్రో గ్రామ్్లు లేదా 400 iu D విటమిన్ నిత్యావసరంగా
#నిర్ణయింప
బడినది. పెరిగే వయసు దాటిన వారిలో ఎముకల పెరుగుదల ఆగిపోతుంది. కనుక
#అట్టి
వారికి రోజుకు 5 మైక్రో గ్రామ్్ల D విటమిన్ సరిపోతుంది. గర్భిణీ
#స్త్రీలకు, బాలింతలకు
D విటమిన్ అవసరం పెరుగుతుంది.
D విటమిన్ న్యూనతా రోగాలు:
 శరీరానికి అవసరమయ్యే మోతాదులో D విటమిన్ లేక పోయినప్పుడు రికెట్స్్
అనే వ్యాధి పిల్లలలో, ఆస్టియో మలేషియా అనే వ్యాధి
పెద్దలలో వస్తుంది. రికెట్స్్ ఎముకలలో కాల్షియం ఫాస్పేట్ కావలసినంతగా
#ఇముడని
కారణంగా వస్తుంది, ఈ వ్యాధి ఉన్న వారిలో ఎముకలు
బలహీనంగా ఉండి వంగిపోతాయి. దీనినే దొడ్డి కాళ్ళు లేదా గాడిద
కాళ్ళు అని అంటారు. ఇవే కాక ఉబ్బు రొమ్ము
ఎదురు రొమ్ము ఎముకలు రెండు వైపుల చివరలు లావెక్కి పూసల దండ
వలె కనిపించటడం కూడ రికెట్స్ వ్యాధి లక్షణాలే. ఈ వ్యాధికి
230-
సరి అయిన చికిత్స చేయనప్పుడు ప్రాణాపాయం కూడ సంభవిస్తుంది. D విటమిన్
రికెట్స్్ను అరికట్టుతుంది. కనుక దీనిని అంటీ రాకటిక్ విటమిన్్గా
వ్యవహరిస్తారు.
 D విటమిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే ఆస్టియో మలేషియ అనే
#వ్యాధిలో
కీళ్ళ నొప్పులు, అలసట విపరీతంగా ఉంటాయి. వీరిలో ఎముకలు మెత్తబడతాయి.
#దీని
మూలంగా వీరి నడకలో మార్పు రావచ్చు. ఎక్కువ పొగమంచు ఉన్న దేశాలలో,
ఎప్పుడూ పరదాలో ఉన్న స్త్రీలలో D విటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులను
#చూడవచ్చు.
దీనికి ముఖ్య కారణం శరీరానికి సూర్యరశ్మి సోకక పోవడమే. ఇటువంటి వారి
#ఆహారంలో
తప్పక D విటమిన్ ఉన్న ఆహారపదార్థాలను చేర్చాలి.
 A,D విటమినులను శరీరావసరాల కంటే బాగా ఎక్కువ మోతాదులలో
క్రమంగా తీసుకోవడం వల్ల శరీరానికి చాల ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి ఇది
హెచ్చుగా ఉన్న చేప నూనెలను తీసుకొనదలచినప్పుడు వైద్యుని సలహా తీసుకోవాలి.
E విటమిన్:
 E విటమిన్్ను టోకోఫెరాల్ గా కూడా వ్యవహరిస్తారు. E విటమిన్
చర్యగల ఈ టోకోఫెరాల్ నాలుగు రూపాలలో ఆహార పదార్థాల నుండి లభిస్తుంది
అవి ఆల్పా, బీటా, గామా, డెల్టా టోకోఫెరాల్్లు. ఇవి చమురు వంటి పసుపు
#పచ్చని
ద్రవాలు. ఇవి నీటిలో కరగవు. కొవ్వు ద్రావణులలో కరుగుతాయి. వీటిపైన
#ఉష్ణం,
ఆమ్లాల ప్రభావం తక్కువగా ఉండి, క్షారాలు, అల్్ట్రా వయొలెట్ కాంతి
ఆక్సిజన్్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
E విటమిన్ ప్రమేయాలు:
 E విటమిన్ ఆక్సీకరణ నిరోధి గా పని చేస్తుంది. శరీరంలోని A
విటమిన్, కెరాటిన్, C విటమిన్్లు ఆక్సిజన్ వలన ఆక్సీకరణ చెందకుండ
#కాపాడుతుంది.
ఆహార మూల పదార్థాలు:
 ఆహార పదార్థాలలో E విటమిన్ సాధారణంగా ఉంటుంది. E విటమిన్ గోధుమ
మొలకల నూనె లో అత్యధికంగా ఉంటుంది. పత్తి గింజల
నూనె లోను, E విటమిన్ ఎక్కువగా ఉంది. ఆకు కూరలు, ముడి
231-
ధాన్యంలో కూడ E విటమిన్ సమృద్ధిగానే ఉంది. కాలేయం, గుండె, మూత్ర పిండాలు,
పాలు, గుడ్లు మొదలైన వాటిలో ఇది లేక మాత్రంగా ఉంది.
నిత్యావసరాలు:
 ఒక సంవత్సరం లోపు పసి పిల్లలకు E విటమిన్ రోజుకు 3 నుంచి 4
#మి.గ్రా
పిల్లలకు, కిశోర వయస్కూలకు 5 నుంచి 10 మి.గ్రా మగవారికి 10 మి.గ్రా
#ఆడవారికి
8 మి.గ్రా గర్భిణి స్త్రీలకు 10 మి.గ్రా పాలిచ్చే తల్లులకు 11 మి.గ్రా
#అవసరం
ఆహారంలో అసంతృప్త ఫాటీ ఆమ్లాలు అధికమైనప్పుడు E విటమిన్ ఆవశ్యకత కూడ
అధికం అవుతుంది.
 సాధారణంగా రోజు తీసుకునే ఆహారంలో శరీరావసరాలకు చాలినంత E విటమిన్
ఉంటుంది. ఇందు వలన E విటమిన్ లోపం సామాన్యంగా ఏర్పడ఼దు. రక్తంలో E
విటమిన్ తక్కువగా ఉన్నప్పుడు ఎర్ర రక్తకణాలు సులభంగా సంలయనం
చెందుతాయి.
K విటమిన్:
 K విటమిన్ మూడు రూపాలలో లభిస్తుంది. వాటిని క్వినోన్్లు
అంటారు. K విటమిన్ వేడి వల్ల నశించదు. కాని క్షారాలు, గాఢ ఆమ్లాలు,
#ఆక్సిజన్
సూర్యరశ్మి దానిని నాశనం చేస్తాయి. K విటమిన్ ఆకు కూరలలో ఎక్కువగా
#ఉంది.
గుడ్డులోని పచ్చ సొన, కాలేయం, జున్నులలో K విటమిన్ తక్కువగా ఉంది.
#మానవుని
ప్రేగులలో ఉన్న సూక్ష్మజీవులు ఈ విటమిన్్ను తయారు చేస్తాయి.
 రక్తం గడ్డ కట్టడానికి K విటమిన్ అవసరం. మన ఆహారంలో శరీరానికి
అవసరమైన K విటమిన్ లభిస్తుంది. K విటమిన్ లోపం సామాన్యంగా సంభవించదు.
K విటమిన్ లోపిస్తే శాస్త్ర చికిత్స చేసినప్పుడు గానీ లేదా దెబ్బ
#తగలినప్పుడు గాని
రక్తం గడ్డకట్టకుండా ఎక్కువ స్రవించే ప్రమాదం ఉంది. పసిపాపల విషయంలో
#ఇటువంటి ప్రమాదం సంభవించకుండా ఉండడానికి ప్రసవానికి ముందే తల్లికి K
#విటమిన్్ను
ఇంజక్షన్ ద్వారా ఇస్తారు. శరీరంలో K విటమిన్ కొంత వవరకు తయారవుతుంది.
#కనుక
ఆహారంలో K విటమిన్ ఉండ఼వలసిన మోతాదు తేల్చి చెప్పడం అంత సులభం కాదు.
ఆహారంలో పసిపాపలకు రోజుకు కిలో గ్రామ్్కు 2 మైక్రోగ్రామ్్లు, పెద్దవారికి
#రోజుకు
70 నుండి 140 మైక్రో గ్రామ్్ల K విటమిన్ అవసరం.
233-
నీటిలో కరిగే విటమిన్్లు:
B- కాంప్లెక్స్్ విటమిన్్లు
 శరీరంలో అన్ని కణాలలో జరిగే జీవక్రియలకు B కాంప్లెక్స్్ విటమిన్్లు
చాల అవసరం. శరీరంలో శోషణ చెందిన పోషక పదార్థాలు శరీరం
ఉపయోగించుకోవడానికి ఈ విటమిన్్లు తోడ్పడుతాయి. ఈ B- కాంప్లెక్స్్ విటమిన్్లు
#ఒకదానితో
మరొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఆహారంలో ఏ ఒక్కటి
#లోపించినా
మిగిలిన B కాంప్లెక్స్ ఉపయోగం సరిగ్గా జరగదు. B కాంప్లెక్స్్ విటమిన్్లలో
#చేరిన
విటమిన్్లు ధయమిన్ రైబోప్లేవిన్, సయసిన్
పిరిడాక్సిన్, లేదా B 6 విటమిన్, పాంటోధెనిక్ ఆమ్లం
బయోటిన్, ఫాలాసిన్, కొబాలమిన్ లేదా
B 12 విటమిన్ కోలిన్, ఇనోసిటాల్ అనేవి.
థయమిన్:
 స్వచ్ఛమైన థయమిన్ హైడ్రో క్లోరైడ్ తెలువ పసుపు కలిసిన
#స్పటికాకృతి గలిగి
ఉన్న నీటిలో కరిగే పదార్థం ఇది కొద్దిగా ఉప్పగా ఉండి రుచికి
#పిక్కలవలె ఉంటుంది.
ఇది నీటిలో కరిగినప్పుడు ఉష్ణం వలన గాని, క్షారల వలన గాని సులభంగా
#నాశనమై
పోతుంది. ఘన రూపంలో ఉన్నప్పుడు ఇది బాగా స్థిరత్వాన్ని కలిగి
#ఉంటుంది. ఆహార
పదార్థాలను పండేటప్పుడు క్షారాన్ని ఎక్కువ ఉపయోగించడం వలన, ఎక్కువ
#ఉష్ణోగ్రత వాడడం వలన, ఎక్కువ కాలం పండడం వలన, ఎక్కువ నీటిని వాడడం వలన,
పండిన నీటిని పారబోయడం వలన, ఈ విటమిన్ కొంతవరకు నాశనం అవుతుంది.
థయమిన్ ప్రమేయాలు:
 1. థయమిన్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు పదార్థాల జీవక్రియలో
పాల్గొంటుంది.
 2. నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి థయమిన్ చాల అవసరం.
 3. కణజాలాలు శ్వాసించడంలో థయమిన్ ప్రముఖ
పాత్ర వహిస్తుంది.
234-
 4. శరీరంలో పాటీ ఆమ్లాల శోషణకు థయమిన్ అవసరం.
 5. శరీరంలో థయమిన్ ఒక ముఖ్యమైన కో ఎంజైంగా పని చేస్తుంది.
ఆహార మూల పదార్థాలు:
 గోధుమ మొలకలోను, కొవ్వులేని పంది మాంసంలోను ఈ
ధయమిన్ ఎక్కువగా ఉంది. ఈస్ట్్ లో థయమిన్ పుష్కలంగా ఉంది. కనుక
పులవ బెట్టిన పిండిలో, ఈస్ట్్ను ఉపయోగించి చేసిన రొట్టె లో థయమిన్
#ఎక్కువగా ఉంటుంది. బియ్యంపై పొరలో థయమిన్ ఎక్కువగా ఉంటుంది. ఐతే తెల్లగా
#మరవట్టిన బియ్యంలో ధయమిన్ మోతాదు తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా పాలిష్
#పట్టిన
బియ్యంను ఉపయోగించడం మంచిది కాదు. కాలేయం, మాంసం, గుడ్డులోని పచ్చసొన,
చేపలు, చిక్కుళ్ళు సోయా చిక్కుడు, వేరుశెనగ, ముడి ధాన్యాలు మొదలైన వాటిలో
థయమిన్ నుంచి మోతాదులో ఉంటుంది.
నిత్యావసరాలు:
 ఒక మనిషికి కావలసిన థయమిన్ ఆ మనిషి శరీరంలో బరువును బట్టి,
#అతను
ఆహారంలో తీసుకొనే కెలొరీలను బట్టి, అతని ప్రేగులలో శోషణ చెందే థయమిన్్ను
బట్టి ఉంటుంది. ఎక్కువగా కార్బోహైడ్రేట్్లను తీసుకున్నప్పుడు కూడ థయమిన్
అవసరం పెరుగుతుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలు ఆహారంలో తీసుకున్నప్పుడు
థయమిన్ అవసరం తగ్గుతుంది. వివిధ దశలలో ఉన్నవారికి రోజుకు వారి ఆహారంలోని
#కెలరీలను బట్టి ప్రతి 1000 కెలారీలకు 0.5 మి.గ్రా థయమిన్ అవసరమవుతుంది.
#గర్భిణి
స్త్రీలు రోజూ తమ ఆహారంలో ప్రతి 1000 కెలరీలకు 0.6 మి.గ్రా థయమిన్
#గాని లేదా
రోజుకు 0.4 మి.గ్రా థయమిన్్ను అదనంగా తీసుకొనవలెను. ఇదే విధంగా పాలిచ్చే
తల్లులు రోజు తమ ఆహారంలోని ప్రతి 1000 కెలారీ లకు 0.6 మి.గ్రా థయమిన్
#గాని
లేదా రోజుకు 0.5 మి.గ్రా థయమిన్ అదనంగా తీసుకొనవలెను. అంటురోగాలున్నప్పుడు
లేదా ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు ఈ మోతాదులను పెంచవలసి ఉంటుంది.
థయమిన్ న్యూనతా రోగాలు:
 ఆహారంలో థయమిన్ లోపించినప్పుడు బెరిబెరి అనే వ్యాధి వస్తుంది.
ఆకలి మందగించడం, మానసిక వేదనకు గురికావడం, బదకంగా ఉండడం, ముఖ్యంగా
235-
కాళ్ళలోని కండరాలు బలహీనమై పక్షవాతం రావడం, మల బద్ధకం ఏర్పడం, గుండె,
అతివేగంగా కొట్టుకోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు.
 థయమిన్ లోపం వలన వచ్చే బెరిబెరి అనే వ్యాధి రెండు రకాలు. ఒకటి
#అర్థ్ర
బెరి బెరి రెండు అనార్థ్ర బెరిబెరి. అర్థ్ర బెరి బెరి లో శరీరానికి నీరు
పడుతుంది. అనార్థ్ర బెరిబెరి లో వ్యక్తి ఎండి పోయినట్లు కనిపిస్తాడు.
#నరాలు, గుండె
దెబ్బ ఉంటాయి.
 తల్లి భుజించే ఆహారంలో థయమిన్ లోపించినట్లయితే తల్లి పాల఼లో గూడ
#థయమిన్ లోపిస్తుంది. ఆ తల్లి పాల మీదనే ఆధారపడిన బిడ్డకు బెరిబెరి
#వ్యాధి రావడానికి
అవకాశంముంది. ప఼సి బిడ్డలకు వచ్చే బెరి బెరిని శిశు బెరి బెరి
అంటారు. ఈ వ్యాధితో బాధపడే బిడ్డకు వాంతులు అవడం, శరీరానికి నీరు పట్టడం
గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి
#ముదిరినప్పుడు
ప్రాణాపాయం కూడ సంభవించవచ్చు.
 ఈ వ్యాధిని నివారించాలంటే తక్కువ మర పట్టిన బియ్యం, ముడిధాన్యాలు,
గింజలు, చిరు ధాన్యాలు తీసుకోవాలి. ఆహార పదార్థాలను పండటంలో కూడ ఈ
#విట఼మిన్ నశించకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధిని అరికట్టవచ్చు.
రైబో ఫ్లేవిన్:
 రైబో ఫ్లేవిన్ పసుపురంగు గల ఫ్లెవిన్ వర్గానికి చెందిన విటమిన్.
#దీనిని B2
అని కూడ వ్యవహరిస్తారు. స్వచ్ఛమైన రైబోఫ్లేవిన్ పసుపురంగు గలిగి
#స్పటికాకృతిలో
ఉంటుంది. ఉష్ణం, ఆక్సిజన్, ఆమ్ల గుణం గల పదార్థాలు దీని
#స్థిరత్వాన్ని భంగపరచ
లేవు. క్షారాలు, అతి నీల లోహిత కిరణాల వలన ఇది నశిస్తుంది.
వంటలలో వంట సోడా వాడినప్పుడు ఆహార పదార్థాలలోని రైబోఫ్లేవిన్ చాల మటుకు
నశిస్తుంది.
రైబోఫ్లేవిన్ ప్రమేయాలు:
 1. శరీరంలో రైబోఫ్లేవిన్ రెండు ఆమ్లాల చర్యలలో ఎంజైంలలో
అంతర్భాగంగా ఉంది.
 2. పెరిడాక్సిన్, పోలిక ఆమ్లాల చర్యలలో రైబోఫ్లేవిన్ ముఖ్య పాత్ర
వహిస్తుంది.
236-
3. శరీరం పెరుగుదలకు ఈ విటమిన్ చాల అవసరం.
4. థయమిన్ వలెనే రైబోఫ్లేవిన్్శక్తి జీవక్రియ లో
ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రోటీన్్లు, కార్బోహైడ్రేట్్లు, ఫాటీ
ఆమ్లాల నుంచి శరీరం శక్తిని గ్రహించడానికి రైబోఫ్లేవిన్ అవసరం.
5. రైబోఫ్లేవిన్ రక్తంలోని ఎర్రకణాల తయారీలో తోడ్పడుతుంది.
ఆహార మూల పదార్థాలు:
 రైబోఫ్లేవిన్ పాలు, చెద్దార్, చీస్, కాటేజ్ చీస్ అనే జాన్నులలో
#అధికంగా
ఉంది. ఇతర జంతు సంబంధమైన పదార్థాలయిన కాలేయం, గుండె, మూత్ర పిండాలలో
ఈ విటమిన్ చెప్పుకోతగ్గ మోతాదులలో ఉంది. మొలకెత్తిన శెనగలు, పెసలు, ఆకు
కూరలు, గుడ్లు మొదలైన వాటిలో రైబోఫ్లేవిన్ సుమారు మోతాదులో ఉంది.
#ధాన్యాలు,
పండ఼్లు, కూరగాయలలో రైబోఫ్లేవిన్ చాల తక్కువగా ఉంది.
నిత్యావసరాలు:
 ఒక మనిషికి కావలసిన రైబోఫ్లేవిన్ అతని ఆహారంలోని శక్తిని బట్టి
#ఉంటుంది. ఏ వయస్సు వారికైనా వారి నిత్య ఆహారంలోని ప్రతి 1000 కెలొరీలకు 0.6
#మి.గ్రా
రైబోఫ్లేవిన్ అవసరం. గర్భిణీ స్త్రీలకు రోజుకు 0.3 మి.గ్రా. పాలిచ్చే
#తల్లులలకు రోజుకు
0.5 మి.గ్రా అదనంగా ఆహారంలో చేర్చాలి. వివిధ దశలలో ఉన్నవారికి
#రైబోఫ్లేవిన్
అవసరాలను అనుబంధ పట్టికలో చూడవచ్చు.
న్యూనతా రోగాలు:
 రైబోఫ్లేవిస్ వ్యాధి మొదలవుతున్న దశలో నాలుక, గోరు, పెదవులలో
పుండ్లు పడి మంట పెడతాయి. కళ్ళు కాంతిని చూడలేవు. కళ్ళ వెంబడి నీరు
#కారుతుంది.
వ్యాధి ముదిరిన దశలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.
 1. పెదవులు పొడిగా ఉండి పగులుతాయి. దీనిని అధర విదరత అంటారు.
 2. నాలుక ఎర్రగా ఉంటుంది. దీనిని గ్లాసైటిస్ అంటారు.
 3. నాలుక విపరీతంగా పగిలి నొప్పి పెడుతుంది. దీనిని బీటలు వారిన
నాలుక అంటారు.
237-
4. పెదవులు కలిసే చోట రెండు ప్రక్కల పుండ్లు పడతాయి. దీనినే
ఆంగ్యులర్ స్టోమటైటిస్ అంటారు.
5. కండ్ల చివర కొనలు ఉబ్బి, కండ్లు ఎర్రబడి, కనురెప్పలు
అంటుకొంటాయి. దీనినే నేత్ర శ్లేష్మల శోధనం అంటారు.
6. శుక్ల పటల నాళ సంఖ్యానత ఏర్పడుతుంది.
7. రక్త హీనత కలుగుతుంది.
 ఈ లక్షణాలు సామాన్యం
గా అన్ని లేదా కొన్ని B
కాంప్లెక్స్్ విటమినుల లోపంవలన
కనిపిస్తాయి. ఈ లక్షణాలు
అన్ని కనిపించినట్లయితే అవి
రైబోఫ్లేవిన్ లోపం వలన
కలిగినవని గ్రహించవచ్చును.
 రైబోఫ్లెవిన్ అధికంగా
ఉన్న పదార్థాలను ఆహారంలో
చేర్చడం వలనను, సరైన
పంట పద్ధతులను వాడి ఆహార
పదార్థాలలో ఉన్న రైబోఫ్లెవిన్
నష్ట పోకుండా చూడటం
వలనను ఈ విటమిన్ లోపం
వలన వచ్చే వ్యాధులను
అరికట్టవచ్చు.
నయసిన్:
 నయసిన్ తెల్లటి స్ఫటికాకారం కలిగిన విటమిన్. ఇది పొడిగా
#ఉన్నప్పుడు దీని
స్థిరత్వం అపారం. క్షార, ఆమ్ల గుణాలు ఉన్న పదార్థాలు గాని, వెలుతురు
#గాని, ఉష్ణం
వలన గాని ఈ విటమిన్ నశించదు.
నయసిన్ ప్రమేయాలు:
 1. నయసిన్ పెరిడిన్ న్యూక్లియోటైడులు అనే
 కో ఎంజైంలలో అంతర్భాగం.
238-
 2. రైబోఫ్లెవిన్్ల వలనే నయసిన్ కూడ ఆహార పదార్థాలలోని కార్బో
హైడ్రేట్, ప్రోటీన్, కొవ్వు పదార్థాల నుండి శరీరం శక్తిని
గ్రహించడానికి తోడ్పడుతుంది.
ఆహార మూల పదార్థాలు:
 ఆహార పదార్థాలలో ఉన్న ట్రిప్టొఫాన్ అనే అమైనో ఆమ్లం
నయసిన్ పూర్వగామి కాబట్టి నయసిన్ అధికంగా ఉన్న ఆహార
పదార్థాలను గురించి తెలుసుకొనేటప్పుడు, ట్రిప్టోఫాన్ అధికంగా ఉన్న ఆహార
#పదార్థాల
గురించి కూడ తెలుసుకోవాలి జంతు సంబంధమైన ఆహార పదార్థాలలో అంటే మాంసం,
చేపలు మొదలైన వానిలో ట్రిప్టోఫాన్ అధికంగా ఉంది. ఈస్ట్్, వేరుశెనగలో కూడ
నయసిన్ ఎక్కువగా ఉంది. ధాన్యాలలో ఉన్న నయసిన్ మర పట్టినప్పుడు చాలా
#మట్టుకు
తవుడులో పోతుంది.
నిత్యావసరాలు:
 ఒక వ్యక్తికి రోజుకు కావలసిన నయసిన్ అతని ఆహారంలో శక్తిని
#బట్టి
ఉంటుంది. వివిధ దశలలో ఉన్న వారి నిత్యావసరాలను అనుబంధ పట్టికలో
చూడవచ్చును. ట్రిప్టొఫాన్ శరీరంలో నయసిన్్గా మార్పు చెందుతుంది కాబట్టి
#ఆహారంలో ఉన్న
నయసిన్్ను కొలచేటప్పుడు ట్రిప్టోఫాన్, నయసిన్్లను కలిపి చూడాలి. అదే
#విధంగా
రోజు వారి కావలసిన మోతాదులు సూచించేటప్పుడు రెండింటిని కలిపి చూడాలి.
#శరీరంలో
ఒక మి.గ్రా నయసిన్ తయారు కావడానికి సుమారు 60 మి.గ్రా ట్రిప్టొఫాన్
#అవసరం. ఈ
విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రోజుకు కావలసిన నయసిన్ మొత్తాన్ని లెక్క
#కట్టాలి.
నయసిన్ న్యూనతా రోగాలు:
 నయాసిన్ లోపం వలన వచ్చే వ్యాధిని పెలాగ్రా అంటారు. ఈ
వ్యాధి ముందు దశలలో కండరాల బలహీనత, ఆకలి లేక పోవడం, అజీర్తి చేయడం,
చర్మంపై మార్పులు ఏర్పడటం లాంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వ్యాధి
ముదిరినప్పుడు జీర్ణాశయం పొడవుగా పూయడం సంభవిస్తుంది. పెదవులు, నాలుక
#ఎర్రబడి
దవాలు మింగడం కూడ కష్టమౌతుంది. అలసట, తలనొప్పి ఉంటాయి. రక్తహీనత
ఏర్పడుతుంది. విరేచనాలు అవుతా౟యి. రెండు చేతుల వెనక, మోచేతుల మీద,
#పాదాల
పైన, కాళ్ళపైనమెడపైన చర్మ ఎర్రబడి పుండ్లు పడతాయి. ముఖ్యంగా గమనించవలసిన
దేమంటే ఒక భాగంలో చర్మంపై వచ్చే మార్పులు, ఒకే రకంగా, ఒకేసారి
239-
రెండు వైపుల ఏర్పడుతుంది. ఈ స్థితిలో చర్మం కాలినట్లు
కనిపిస్తుంది. జబ్బు ఇంకా ముదిరితే చర్మం పగిలి, పొలును జారి, చివరకు
#పుండ్లు
పడతాయి. సూర఼్యరశ్మి సోకితే చర్మవ్యాధి ఇంకా ఉధృతమవుతుంది. ఈ వ్యాధికి
#ఇంకొక
ముఖ్యమైన లక్షణం నరాల బలహీనత ఏర్పడటం దీని మూలంగా కలవరపాటు, తల
తిరగటం, జ్ఞాపకశక్తి తగ్గడం, విసుగు ఏర్పడటం, మతిభ్రమ కలగడం సంభవిస్తాయి.
చర్మవ్యాధి, విరేచనాలు, మతి చలించటం ఈ
వ్యాధి ముఖ్యమైన మూడు లక్షణాలుగా
గుర్తించాలి.
పిరిడాక్సిన్
 పిరిడాక్సిన్ వాసనలేని తెల్లని
స్పటికాకృతి కలిగిన విటమిన్. ఇది నీటిలోను,
ఆల్కహాల్్లోను కరుగుతుంది. ఆమ్ల గుణం గల
పదార్థాలలో ఉన్నప్పుడు దీనిని ఉష్ణం నాశనం చేయ
లేదు కాని క్షార పదార్థాలతో ఉన్నప్పుడు ఉష్ణం
వలన ఇది కొంత నాశనమవుతుంది. ఈ
విటమిన్్ను B 16 అనికూడ అంటారు.
పిరిడాక్సిన్ ప్రమేయాలు
 1. శరీరంలో కొన్ని అమైనో ఆమ్లాలనుండి కార్బాక్సిల్ వర్గాన్ని
వేరుచేస్తుంది. ఈ క్రియను డికార్బాక్సిలేషన్
అంటారు.
2. శరీరం పెరుగుదలకు అవసరంకాని అమైనో ఆమ్లా నుంచి అమైనో
వర్గాన్ని వేరుచేస్తుంది. దీనిని ది అమినేషన్
అంటారు.
3. సల్ఫ్ హైడ్రిల్ వర్గాన్ని ఒక అమైనో ఆమ్లంనుండి మరొకదానికి
అందిస్తుంది. దీనిని డిసల్ఫరేషన్ అంటారు.
4. శరీరంలో ట్రిప్టొఫాన్ నయసిన్్గా మార్పుచెందడానికి పిరిడాక్సిన్ అవసరం.
5. పిరిడాక్సిన్ లినోలియిక్ ఆమ్లం అరాకిదానిక్ ఆమ్లంగా మార్పుచెందడంలో
ముఖ్య పాత్ర వహిస్తుంది.
             0 
</p></body></text></cesDoc>