<cesDoc id="tel-w-literature-novel-jaji2" lang="tel">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>tel-w-literature-novel-jaji2.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-13</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>జాజిమల్లి</h.title>
<h.author>అడివి బాపిరాజు</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - Book</publisher>
<pubDate>1984</pubDate>
</imprint>
<idno type="CIIL code">jaji2</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page 47.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-13</date></creation>
<langUsage>Telugu</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fiction"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p> 3
 నరసింహమూర్తి మేష్టారు నానాటికి చిక్కు లెక్కువ
పడిపోతున్న బుచ్చి వెంకట్రావు పద్మావతుల జీవిత
52-
సూత్రాలు గమనిస్తూ గాఢ విషాదంలో పడిపోయాడు.
వాళ్ళ బ్రతుకులే ఒక సంగీతమైతే అపశ్రుతులులా,
అపస్వరాలులా, తప్పుడు తాళాలూ ఏవేవో వచ్చి పడినవి. అతి
వేగమైన ఒక ప్రవాహంలోపడి తాను కొట్టుకొచ్చాడు.
తగిన శిష్యురాలై తనకు పేరు ప్రతిష్ఠ తెచ్చిపెట్టుతుంది.
అనుకున్న పద్మావతి తన దగ్గరకు రావడమే మానేసింది.
పోనీ, సంగీతాభ్యాసం కోసం ఎవరైనా ఒక పెద్ద సంగీత
విద్వాంసుడి దగ్గరకు వెళ్ళుతున్నదా అంటే, ఆ వెళ్ళడమూ
మానుకుంది. ఆడవాళ్ళ మనోభావా లెవరికర్ధమౌతాయి?
అసలే సంగీతం మానివేస్తుందేమో. అని లోలోన అతడు
భయపడినాడు.
 తాను వట్టి వంట బ్రాహ్మణుడై పోయినాడు. వీరిరువరి
కోసమూ! తాను పాడుకునే సంగీతము కూడా అభ్యాసము
చేసుకోవడము లేదు. సంగీతము భగవతార్చన అని అనుకున్న
తాను చేపలవాసనకొట్టే ఒక బెస్తల దాంపత్యం, తన్నంత
ఇంద్రజాలంలో ముంచివేయడం ఒక విచిత్రమే. ఆమె తనకు
ఒక కూతురుకన్న యెక్కువైనది. ఉత్తమ విద్య విషయంలో
కులం తేడాలు వుండనే వుండవు. అసలు కులం తేడాలేమిటి?
ఏ విధంగానూ గోడ఼లు కట్టని మూడు ముఖ్యమైన కులాలు
వేదకాలంలో వుండేవుంటారు. వారిలో ఒకరి కొకరికి సంబంధ
బాంధవ్యాలు, భోజన ప్రతి భోజనాలు ఉండేవి కాదా!
రాను రాను జనసమృద్ధి ఎక్కువై భావసంఘర్షణలు వృద్ధియై
అనేక కులాలు ఉద్భవించాయి! ఏమిటి తనకీ ఆలోచనలు!
53-
ఏది ఎట్లాయైనా వీరిద్దరు తన బిడ్డలు! వీళ్ళు వృద్ధిలోనికి
రావడం అతను కన్నులారా చూశాడు. ఆ వృద్ధిలో తాను
పాలుపంచుకొన్నాడు. వాళ్ళిద్దరినీ తల్లిలా పెంచాడు.
చూస్తూ చూస్తూ ఉండగా ఏదో పెనుభూతం వాళ్ళ జీవితాన్ని
ఆవహిస్తున్నట్టు అతనికి భయం ముంచుకువచ్చింది.
 ఏమిటీ పెనుభూతం? ఎవరిలోటు? అంత
ప్రేమించుకున్నారే! ఒకరి నొకరు విడవకుండా ఉండేవారే! విడిచి
బ్రతుక లేక పోయేవారే! ఒకరికోసం ఒకరు రూపాలు
దాల్చినట్లుగా, ఈడుజోడై తన కన్నుల యెదుట తిరుగుతూ
ఉండేవారే! ఏమిటి ఈనాటి ఈ పరిస్థితి! నరసింహమూర్తి మేష్టారు
దినదినమూ ఆంధ్ర మహిళాసభకు వచ్చి పద్మావతిని చూచి
పోతూ ఉండేవాడు. సాయంకాలము కాగానే పిల్లలందరు
సభలో ఉన్న తోటలో ఆడుకొంటూ ఉండేవారు. కొందరు
కేరంబోర్డ్సు ఆడేవారు. ఊయల ఊగేవారు కొందరు. బల్ల
బంతి ఆట ఆడేవారు కొందరూ. బల్ల ఊపుఆట ఆడేవారు మరి
కొందరు. ఇలా కలకల ఆటల్లో పొంగి బాలికల మధ్య
ఎక్కడో పద్మావతి ఒక్కతే కూచుని ఆలోచించుకుంటూ
ఉండేది!
 ఆమె కేమీ ఆలోచనలు తెగేవికావు. ఇంతట్లో
నరసింహమూర్తి మేష్టారుగారు వచ్చారనగానే ఆమెకు కొంత
ఊరటకలిగేది. వెంటనే అధికారి అక్కగారిని సెలవు వేడి,
ఆ బాలిక నరసింహమూర్తితో సముద్రం ఒడ్డుకు వాహ్యాళికి
54-
బయలుదేరింది. పన్నెండో నెంబరు బస్సు ఎక్కి, ట్రిప్లికేనులో
దిగి, సముద్రం ఒడ్డుకు పోయే వారు వారిద్దరూ!
 ఓనాడు వారు అక్కడ కూచుండగా నరసింహ
మూర్తి సతీర్థుని శిష్టుడైన ఒక యువకుడు వీరిద్దరూ
కూచున్న కడకు వచ్చాడు. ఆ యువకుడు నరసింహ
మూర్తికి కొన్నాళ్ళు శిష్యరికం చేసినాడు.
 యువకుడు . "నమస్కారం నరసింహమూర్తి మేష్టారూ!
మద్రాసు ఎప్పుడు వచ్చారు? ఇక్కడ పనేమిటి? ఎంతకాలం
ఉంటారిక్కడ?" అని ప్రశ్నలవర్షం కురిపించాడు.
 నరసింహమూర్తి ఒక్క నిమిషం అతణ్ణి ఆనవాలు
పట్టలేక పోయినాడు. "ఓహో! నువ్వటోయ్్ రాధాకృష్ణా!
నీ వేషంచూచి నిన్నానవాలు పట్టలేకపోయినాను సుమా!
ఏం చేస్తున్నా విక్కడ? ఎన్నాళ్ళనుండి ఉన్నావు?" అని
ఆనందంతో లేచి, అతన్ని కొంచెం దూరంగా తీసుకువెళ్ళి
ఆ ఇసుకలో అతన్ని కూచోబెట్టి తానూ కూచున్నాడు.
వారి మాటలు పద్మావతికి వినబడుతున్నాయి.
 ఆ యువకుడు రాగానే పద్మావతి అతన్ని కొంచెం
ఆశ్చర్యంగానే చూచింది. పట్టుపయిజామా, పట్టులాల్చీ
చేతికి కొంచెం ఖరీదుగల రిస్టువాచీ, మెళ్ళో సన్నని
బంగారపు గొలుసూ ఆ గొలుసును వేలాడుతూ ఏదో ఓ చిన్న
పతకమూ! కళ్ళకు ఫ్రేములేని అద్దాలజోడు! కాళ్ళకు జరీ
పూవులు కుట్టిన మొఖమల్ చడావులున్నాయ్్! ఈ
యువకుడు చాలా గమ్మత్తుగా ఉన్నాడు. గిరజాలులా జుట్టు
55-
చిత్రంగా సముద్రపుగాలికి ఎగురుతూ ఉంది. అతడూ
నరసింహమూర్తి మేష్టారు మాట్లాడే మాటలు వింటూ, ఆ
యువకుని గమనిస్తూ ఆమె కూచుని ఉన్నది.
 "నేను ఇక్కడ ఓ సినిమా కంపెనీలో సంగీత
దర్శకునిగా ఉన్నాను. భరతనాట్యం కూడా బాగా
నేర్చుకున్నాను. గొంతు చాలా తియ్యగా సైగల్్ కంఠంలా
వుండడంచేత కథానాయకునికి నా కంఠం ఇస్తూ వుంటాను."
 "ఆశ్చర్యమే! ఎంత సంపాదిస్తున్నావు?"
 "ఏదోలెండి. నెలకు రెండు మూడ~ వేలు! సంగీత
దర్శకునిగా ఒక్కొక్క చిత్రానికి పదివేలు చొప్పున ఇస్తారు.
కంఠం ఇచ్చినందుకు పాటకు వేయి రూపాయలు. డాన్సు
డైరక్టరుగా ఉంటే అయిదారావేలు. ఒక్కొక్కసారి రెండు
మూడు కంపెనీలలో పనిచేస్తూ వుంటాను"
 "ఏమిటీ! బాగానే ఉందోయ్్ నీ పని. నాకూ
సినిమాలలో పని యిప్పించ కూడదటయ్యా?"
 "దానికేముందండి మేష్టారు! అదిగో అందమైన చిన్న
కారు చూశారా?! బేబీఫియట్టంటారు దాన్ని. అది నా స్వంత
కారు మా కుటుంబానికి ఒక హిల్్మాస్్మిన్క్సు"
కొన్నాను. దానికి డ్రైవరున్నాడు."
 "చాలా బాగా ఉంది. ఫస్టుక్లాసు! ప్రజ్ఞ అంటే నీదీ
ప్రజ్ఞ!"
 "మా ఇంటికోసారి రండి మేష్టారు!"
 "తప్పుకుండానోయ్్"
56-
 "అచ్ఛా! అయితే అడగవచ్చునో అడగకూడదో!
మరి, ఆ అమ్మాయి ఎవరు? మీ బ్రహ్మచర్యానికి స్వస్తి
చెప్పారేమిటి? ఎవరా సినిమాతార! సినిమాలో
చేర్పించడానికి తీసుకువచ్చారా? అయితే మనం చాలా సహాయం
చేయగలం."
 "ఛా!ఛా! ఆ అమ్మాయి నా బిడ్డవంటిది.
వంటిదేమిటి, నా పెంపుడు బిడ్డే! నా దగ్గిర సంగీతం
నేర్చుకుంటూంది. మా వూరే. కావలి. వాళ్ళు బెస్తలులే! అయినా
భాగ్యవంతులు. ఆవిడ భర్త ఈ ఊళ్ళోనే పెద్ద వ్యాపారం
చేస్తున్నారులే!"
 "అలాగా! క్షమించాలి మీరు. కాని కాస్త నలుపైనా
ఏమి అందంగా ఉందండీ ఆ అమ్మాయి! పేరు మోసిన మా
సినిమా తారలు చాలామందికన్న నయం. సంగీతం
బాగుంటుందా అండీ మేష్టారు!
 "బాగుండడ మేమిటోయ్్! తిలోత్తమ కంఠమే.
తారలందరికన్నా చాలా బాగ పాడుతుంది."
 "నాకోమాటు వినిపించేటట్లు చేయరూ"
 "చూద్దాములే!"
 "ఆ అమ్మాయిలో ఏదో అద్భుతమైన ఆకర్షణ ఉంది
మేష్టారు! ఆ అమ్మాయి భర్త ఒప్పుకుంటే ఆవిణ్ణి మొదటి
రకం తారగా తయారు చేయగలను. ఈ మధ్య మన కంఠం
మీరు వినలేదు. మొన్ననే రికార్డు ఇచ్చిన ఈ పాట వినండి!"
57-
 పంచమ గుచ్ఛము
 "ఇంతేనా? నా సంగతి విన. నా
 వంతైనా ప్రియురాలి మనసు కరగదు
 పంతమో, చింతయో
 కంతుడరటే నా ఎడద గాసిపెట్టి, దూసిపెట్టి
 చింతాకులంత చిందర చేసినా
 డింతేనా?
 అతని కంఠం చాలా మధురంగా ఉంది. ఆ పాట
ఏదో కొత్తరకం బెంగాలీ వరసలా వుంది. ఆ కొద్ది మాటలూ
మూడు నిమిషాలు పాడాడు రాధాకృష్ణ.
 ఆ యువకుడు ఆ పాట ఎంత లోగొంతుకతో పాడినా
చుట్టుప్రక్కలవారికి కొంతమందికి వినిపించింది గాబోలు
నెమ్మది నెమ్మదిగా పదిమంది ఆ ప్రాంతాలకు చేరినారు.
 "ఆడే రాధాకృష్ణడా?"
 "అదు! ఎన్న రొంబా నైసా యిరుకు అంద కంఠం!"
 "రాధాకృష్ణ ఏమి బాగా పాడతాడయ్యా!"
 "ఆ అమ్మాయి కొత్త సినిమా స్టారులా వుంది."
 "మాంచి చురుగ్గా, షోగ్గా వుంది."
 ఈ మాటలు అస్పష్టంగా వున్నా, పద్మావతి చెవిలో
పడ్డాయి. ఆమె మోము కెంపువారింది. ఆమె గుండెలు
కొట్టుకున్నాయి. ఆమెకు కోపమూ వచ్చింది. సంతోషమూ
58-
వచ్చింది. ఆమె నెమ్మదిగా లేచి, తల వంచుకొని, బీచి
రోడ్డువైపుకు నడవడం ప్రారంభించింది. అది గమనించి
నరసింహమూర్తి "వస్తున్నాను వుండు అమ్మాయి." అని
కేక వేసి రాధాకృష్ణవైపు తిరిగి, "మళ్ళీ కలుసుకుంటాను.
నీ అడ్రస్సు మురుగప్ప వీధి, పదోనెంబరు ఇల్లు కాదూ,
త్యాగరాయ నగరంలో! తప్పకుండా వస్తాను. ఎప్పుడు నీకు
సావకాశం?" అని ప్రశ్నించాడు.
 "నాకా మాష్టారూ! ఎల్లుండి షూటింగు లేమీ
లేవు. రేపు సాయంకాలం అయిదు తర్వాత మా ఇంటికి
రండి. ఉండండీ! ఉండండి! మిమ్మల్నీ ఆ అమ్మాయినీ నా
కారుమీద దిగబెట్టనా?" అని రాధాకృష్ణ అడిగాడు.
 "వద్దులే, ఆ అమ్మాయికి ఇష్టం ఉండదు."
 ఎంత చక్కగా వుంది అతని కంఠం! ఎంత
తెచ్చిపెట్టుకుంటే వస్తుంది సంస్కారము? ఈ ప్రశ్నలు పద్మావతి
హృదయంలో దారిపొడుగునా వున్నాయి. బస్సులో ఆమె
నరసింహమూర్తి మేష్టారుగారితో మాట్లాడలేదు. ఏలాగో
ఆంధ్రమహిళకడ దిగింది. ఆమెను దించి నడిచి ట్రాం కడకు
వెళ్ళి రాయపేట చేరుకున్నాడు నరసింహమూర్తి మేష్టారు .
ఆ రాత్రంతా పద్మావతికి నిద్రరాలేదు. పక్కమీద ఇటూ
అటూ దొర్లింది. లేచి ఎలక్ట్రిక్కు దీపం వెలిగిద్దామా
అంటే తన గదిలోని ఇతర బాలికలు లేస్తారు.
 నెమ్మదిగా పక్కమీదనుండి లేచి, పై డాబామీదకు
వెళ్ళింది. సభాభవనాల మధ్యవున్న పూలతోటలో నుండి
59-
పూలవాసన పైకి ప్రసరించి వస్తున్నది. ఆకాశాన అక్కడక్కడ
మబ్బులు ప్రయాణం చేస్తున్నాయి. చంద్రుడు అస్తమించడం
చేత నక్షత్రాలు తళతళలాడుతూ ఆకాశం అంతా చిత్రమైన
ముగ్గుల పట్టులలా నిండి వున్నాయి.
 ఆ తారకలను చూస్తూ వాటి విచిత్రరూపాలూ,
చిత్రమైన కాంతులు గమనిస్తూవున్న పద్మ ఈ తారలనే
పేరు సినిమా స్త్రీల కెందుకు వచ్చింది అని ఆశ్చర్యం
పొందింది. ఈలా వారు మినుకు మినుకుమంటారా! ఇంత
ఎత్తున వుంటారా అందుబాటులో లేకుండా! చూపులకు
చిన్నగా ఉన్నట్టు కనబడి నిజంగా బ్రహ్మాండాలంతవారా
వారు! చల్లని రాత్రిలో మినుకుమనే ఈ చుక్కలు
సూర్యునికన్న ఎక్కువ వేడిమికల మహా సూర్యగోళాలని
టీచరుగారు చెప్పింది. అలానే సినిమాతారలు పైకి ఒక
రూపూ, లోపల ఒక రూపూ కలవారనా తాత్పర్యం!
 ఆమె చిరునవ్వు నవ్వుకుంది. ఎందుకు వచ్చిందో
ఆ పోలికా ఆ పేరు. తాను సినిమాతార అయితే అద్భుతం
అన్నాడేమి ఆ సంగీత దర్శకుడు. తనలో ఏమి వుంది? తనలో
ఏదో ఆకర్షణ వుందిట! ఏమిటో ఆ ఆకర్షణ? తెల్లని
బంగారం చాయతో మిలమిలలాడే బాలికలు ఎంతోమందో
తనతో చదువుకుంటున్నారు. మదరాసులో ఆ బంగారు
విగ్రహాలు జలజలలాడే చీరలు ధరించి చిత్రమైన ఫేషనుల
బ్లౌజులు తొడిగి, కొందరు పంజాబీ కుడతాలు తొడిగి,
విచిత్రమైన నగలు ధరించి ఎంత అందంగా వుంటారు. తాను
వారిముందు కోతిలా వుంటుందేమో!
60-
 ఆ అబ్బాయి ఎంత అందంగా పాడాడు.
 ఆ రాత్రి ఆ చుక్కల వెలుగులో కలిసిపోయేటట్లు తానూ
తన మధురమైన కంఠంతో ఆ పాటే పాడింది. తన కంఠం
కృష్ణవేణి కంఠంలా వుంటుందా? బానుమతి గొంతు,
వరలక్ష్మిగొంతులకు సరిపోల్చడానికి వీలుందా? ఆ సంగీత
దర్శకుడు తన కంఠం వింటే ఏమంటాడో! ఏమంటాడు!
 ఆ సంగీత దర్శకుడు రాధాకృష్ణకూ ఆ రాత్రి
నిద్రపట్టలేదు. ఏదో `సెక్సు' ఆకర్షణ వుంది ఆ బాలికలో!
ఎంత జిగిగా వుంది ఆమె అంగసౌష్ఠవం! ఆమె
నరసింహమూర్తి మేష్టారు శిష్యురాలా? అంటే
సంగీతములోనిధి అన్నమాట. నిజంగా ఆ యువతి సినిమాలో
చేరవలసిందే! ఏమి ఠీవిగా నడిచింది! బెస్తలా? అయితే
దాశరాజకూతురు యోజగంధిలా వుంది. మత్స్యగంధి
మాత్రం కాదు. ఏదో చక్కని సువాసనద్రవ్యం
ఉపయోగించింది. ఆమె మూర్తి శిల్పంవలెనే వుంది. ఈనాడు తానో
మొదటిరకం సినిమా తారను లోకానికి ఇస్తాడుగాక.
పుల్లయ్యగారివంటి దర్శకులే కాదు సినిమా ప్రపంచానికి
కొత్తతారను ఇచ్చేది! `వాహిని' వారి వంటి సంస్థేకాదు
పాతతారలను నూతన కాంతితో వికసించేసేది! ఒక సంగీత
దర్శకుడ఼ు తెలుగు సుబ్బలక్ష్మిని ప్రపంచానికి ప్రత్యక్షం
చేస్తాడుగాక. మరునాడు నరసింహమూర్తి రాధాకృష్ణ
ఇంటికి వెళ్ళినాడు.
61-
 2
 రాధాకృష్ణ మేడ చిన్నదైనా చాలా అందంగా ఉంది.
ఆ మేడ తాను కట్టించుకున్నానని రాధాకృష్ణ చెప్పినాడు.
వంటయిల్లు, భోజనశాల ఆ రెండు ఇళ్ళనూ కలిపి వరండా
ఉంది. వరండాకు ఈవలావల దొడ్డి, ఆ దొడ్డికి గోడలు
ఉన్నాయి.
 అసలు మేడకు దూరంగా తూర్పున ఇంకొక చిన్న
మేడ కట్టించుకున్నాడు రాధాకృష్ణ. ఆ మేడకు పైన ఒక
పడకగదీ, ప్రక్కగదీ-క్రింద అలాగే పడకగదీ, ప్రక్కగదీ
ఉన్నాయి. పెద్దగది అతని సంగీతం గది. క్రిందగది అతని
గాంధర్వమేళం గది. రెండు ఫిడేళ్ళు, రెండు వేణువులు,
రెండు వీణలు, ఒక క్లారియెనెట్్, ఒక పియానో, ఒక
జలతరంగ఼ము, ఒక తబలా తరంగము, ఒక మృదంగము, ఒక
తబలా, ఒక సారంగి, ఒక దిల్్రుబా, దిల్్రుబా, ఒక
మాండోలిన్్, రెండు వీణలు, ఒక సితార్్ - ఇవీ అతని
మేళవాద్యాలు. ఆ వాద్యాలు వాయించేవారికి అతడేం
జీతమిస్తాడు. ఆ మేళంకోసం తన జీతం కాకుండా ఇంకో వేయి
రూపాయలు అతణ్ణి సంగీత దర్శకునిగా పెట్టుకున్న సినిమా
కంపెనీవారు జీతం ఇచ్చుకోవలసి వస్తుంది. అతని పై గదిలో
"హిజ్్ మాష్టర్సు వాయిస్్" కాబినేట్్ గ్రామఫోను ఉంది.
62-
ఒక గోడ్రెజ్్ ఇనప బీరువానిండా ఉత్తరాది దక్షిణాదివారల
రికార్డులు ఉన్నాయి. ఇంకో బీరువానిండా హిందీ, తెలుగు,
తమిళ, బంగాళీ, మరాటీ, గుజరాతీ రికార్డులున్నాయి.
 మూడవ బీరువానిండా ప్రసిద్ధికెక్కిన పాశ్చాత్య
సంగీతమేళాల రికార్డులు, ప్రసిద్ధ పాశ్చాత్య గాయకుల
రికార్డులూ ఉన్నాయి.
 ప్రాన్సు నుండి వచ్చిన "ఆర్గను" ఒకటి ఒక మూలను
ఉంది, అతడు అన్ని వాద్యాలూ వాయించగలడు.
 అన్నిగదులూ చక్కగా అలంకరించుకొన్నాడు. క్రింద
ప్రక్కగది తనతో పనిఉండి వచ్చిన పెద్దమనుష్యులు
కూర్చుండేగది. పైన ప్రక్కగది తన పడకగది.
 ఇవన్నీ నరసింహమూర్తి మేస్టారుకు చూపించాడు.
 "ఎంతవాడవయ్యావోయ్్! అంతా అంతా డబ్బే
సినిమాలో" అన్నాడు నరసింహమూర్తి మేష్టారు.
 "అవునండీ మీ అమ్మాయి పేరేమిటి!"
 "పద్మావతి!"
 "ఆ అమ్మాయి కంఠం చాలా
బాగుంటుందనుకుంటాను."
 "బాగుండడ మేమిటోయ్్, కిన్నెరకంఠం? నువ్వు విని
తీరాలి."
 "ఎప్పుడు తీసుకువస్తారు?"
 "ఏదో సెలవురోజున; కాని, ఆ అమ్మాయి భర్త
యీ ఊళ్ళోనే ఉన్నాడు. పెద్ద చేపల వర్తకుడు. అతని
63-
ఆజ్ఞ లేకుండా ఆ అమ్మాయిని ఎక్కడికీ కదిలించడానికి
వీలులేదు."
 "ఏమిటీ? భర్త ఒకడున్నాడు, పైగా ఆ భర్త ఈ
ఊళ్ళోనే ఉన్నాడూ? అతని ఆజ్ఞకూడా కావాలీ! అయితే
మీరు ఆ అమ్మాయిని బీచికి ఎట్లా తీసుకువెళ్ళారు!"
 "అది ఆ భర్త ఆజ్ఞవల్లనే!
 "సరేలెండి! ఆ భర్తనే అడగండి, అతన్ని కూడా వెంట
బెట్టుకురండి. నాకు కావలసినవి మధురమైన కంఠాలు. కనక
ప్రథమంగా ఆ బాలికవాణి వినాలి. ఏమంటారు?"
 "సరే సరే! ప్రయత్నిస్తాను."
 అక్కడ పద్మావతికి మరునాడు రాత్రికూడా నిద్ర
పట్టలేదు. ఆ యువకుడు ఎంత అద్భుతంగా పాడాడు!
ఎవరాయన? సంగీత దర్శకుడా? సినిమాలో పాడతాడా?
అనుకున్నది. ఆ పాటంత అందంగా తానూ లోగొంతులో
పాడుకున్నది. ఆ పాటవిన్న సహాధ్యాయినులైన కొందరు బాలికలు
సుడిగాలులులా వచ్చి, ఆమె చుట్టూ చేరినారు. "ఆ పాట
ఇంకోమాటు పాడు పద్మా!" అని కొందరు. "ఏదీ ఏదీ
కాస్త కంఠమెత్తండి!" అని కొందరు ఆ బాలికను వేధించ
సాగినారు.
 ఆంధ్రమహిళలలో ఆమె సంగీతమంటే బాలికలందరూ
ప్రాణాలిస్తారు. రోజూ చదువులయ్యాక పడుకునే ముందర
హాస్టలు భవనంపై మేడమీద ఉపాధ్యాయినులు, బాలికలు
చేరి పద్మావతిని పాడమంటూ ప్రార్థిస్తూ ఉంటారు. ఆ బాలిక
64-
తన మధుర గాంధర్వం వెన్నెలలోనో, తారకల కాంతిలోనో
మేళనం చేస్తూ వుంటుంది.
 ఈ దినం ఆ బాలిక లెంతమంది బ్రతిమాలినా పద్మ
మళ్ళీ పాడడానికి వప్పుకొనలేదు. ఏదో కంఠంలో మంట
వచ్చిందంది. విసుగుచెంది ఒక్క఼ొక్క బాలికా వెళ్ళిపోయింది.
పద్మావతికి ఏదో బాధ వచ్చింది. తన భర్త అంతచక్కని
గాయకుడు ఎందుకు కాలేకపోయాడు అనుకున్నది. ఇంతట్లో
అతనిమూర్తి తన మనస్సులో ప్రత్యక్షమైంది. ఎంత
నాగరికతను అతడు దగ్గిరకు తీసుకున్నా, అది అతనిపైన కప్పిన
పట్టు పచ్చడంలా ఉంది కాని, అతడు ఫేషన్్తో కలకలలాడి
పోయాడు. అతని కంఠం ఉరుములా వుంటుంది. అతని
దేహం నల్ల రాతితో చెక్కిన విగ్రహంలా వుంటుంది. అతడు
బుష్్కోట్లు ధరించినా, పట్టులాల్చీలు తొడుక్కున్నా అతడూ
అతని దుస్తులూ ఏ మాత్రమూ శ్రుతి కలియలేదు.
 ఈ సంగీత దర్శకుడు ఎంత అద్భుతంగా పాడాడు!
తమ తోటలోని పూలన్నీ ఒక్కసారి పరిమళాలు
వెదజల్లినట్లయినదికదా! అది మనుష్యుని కంఠం కాదు. దేవతల
కంఠం.
 ఆమె మంచంమీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆ సమయంలో అందరు బాలికలూ నిద్రపోయేదీ, చదువు
కొనేది గమనించడానికి వరండాలో తిరుగుతున్న వసతి
గృహాధికారిణి, కిటికీలో నుండి చూచి, పద్మావతి ఏదో
బాధపడుతున్నట్లు గ్రహించింది. తలుపుతీసి ఉండటంచేత
65-
ఆమె చల్లగా పద్మావతి గదిలోకి వచ్చి, ఆ బాలిక ప్రక్కనే
మంచంమీద కూచుని, పద్మమీద చేయివైచి, "పద్మా!
ఏమిటిది? ఈ పాటికి నిద్రపోతుంటావు అనుకున్నాను. వంట్లో
బాగా లేదా?" అని ప్రశ్నించింది. ఆ అధికారిణి పేరు
శ్రీమతి కరుణామయి. హాస్టలులోని బాలికలందరూ ఆమె
బిడ్డలు. తన తీయని కంఠంతో మెల్లగా మాట్లాడుతూ,
బాలికల మనస్సులు గ్రహించి వారిని కంటికి రెప్పల్లా
కాపాడుకుంటూ ఉంటుంది. శ్రీమతి గారంటే బాలిక
లందరూ ప్రాణాలర్పిస్తారు. ఆమెతో తమ సంతోషాలూ,
ఆశయాలూ, కష్టాలూ చెప్పుకుంటారు. ఎవరికైనా ఏ కాస్త
జ్వరము వచ్చినా ఆవిడ వారి ప్రక్కన వుండాలని గోల
పెడ్తారు.
 శ్రీమతి అంత తీయగా తన్ను ప్రశ్నించగానే ఆమెకు
మరీ దుఃఖం ఎక్కువైంది. గబుక్కున పద్మ తలను శ్రీమతి
ఒళ్ళోపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకా బాల అలా
ఏడుస్తున్నదో శ్రీమతి కేమి తెలుస్తుంది. కాని పద్మకు
నరాలజబ్బు వచ్చి ఆరోగ్యం చాలా చెడిపోవడం చేత భర్త
ఆమెను ఆంధ్రమహిళా సభ విద్యాలయంలో చేర్పించారు.
ఆ జబ్బు ఇంకా పోలేదు అని అనుకుంది. చదువూ వస్తుంది,
ఆమె ఆరోగ్యమూ పూర్తిగా కోలుకుంటుంది అని కదా
ఆమెను తమ విద్యాలయంలో చేర్పించి హాస్టల్లో ప్రవేశ
పెట్టించినా డాయన. కాని నరాలజబ్బు తగ్గినా ఎన్నాళ్ళకో
గాని పూర్తిగా వదలదు. అందుకని పద్మ ఏడుస్తున్నదనుకుని
శ్రీమతి నెమ్మదిగా ఆ బాలికను అనునయించ ప్రారంభించింది.
66-
 "ఏమి పద్మా! యీ స్వాతంత్ర్య మహాయుగ
ప్రారంభంలో భారతీయాంగనలు తమ మహోత్తమ కర్తవ్యం
నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండవద్దూ?"
 పద్మావతి మౌనం.
 "మనం ధైర్యం వహించి, బాధ్యతలు గుర్తించి,
నిజమైన శాంతిదేవతలమై, మగవారికే దారి చూపించవలసి
వున్నదిగదా!"
 పద్మావతి తల వూపింది.
 "అనేకమంది బాలికలు ఎంత చదువుకున్నా జ్ఞాన
విదగ్ధ మూర్ఖత్వం వదలలేక వారిదగ్గర వీరిమీదా, వీరిదగ్గర
వారిమీదా నేరాలు చెపుతూ, తగాదాలు పెంచుకుంటారు.
ముప్ఫై ముళ్ళు ఇముడుతాయి. మూడు కొప్పులు ఇమడవు
అన్నాసామెత మూడువందలరెట్లు నిజం చేస్తున్నారు.
అందుకు కారణం తమ సహజమైన స్త్రీత్వం దగ్ధం చేసుకొని
మగవారి సుగుణాలు అలవాటు చేసుకొనలేక మగరాయళ్ళలా
సంచరిస్తూ వుంటారు."
 "మగవారుమాత్రం ఉత్తమంగా సంచరిస్తున్నారా
పిన్నిగారూ?"
 "ఆనాటికీ ఈనాటికీ మగవాళ్ళలో మార్పు ఏమీ
రాలేదు తల్లీ. పని వేడితగ్గగానే వారికి భామవేడి కావాలి.
ఉత్తమమైన ఉద్యమంలో చటుక్కున చేరుతారు. తీవ్రంగా
పట్టుదలతో పనిచేస్తారు. జయమో అపజయమో తేలగానే
చెప్పబడిపోతారు!"
67-
 "గాలిపోయిన రబ్బరు బుడగలా!"
 "అదీ! సరసమైన పోలిక తెచ్చావు. విజయమే
సంభవిస్తే వాళ్ళ ఆత్మబలిభావం ఎగిరిపోయి, స్వలాభాపేక్షా,
స్వకులపరాయణత్వమూ స్వీయయశోకామత్వమూ
ఉద్భవిస్తాయి. ముప్ఫైమంది, మూడువందల ముఠాలవుతారు.
దేశాన్ని గంగలో దింపుతారు."
 "మన ఆంధ్రదేశ వ్యవహారాలన్నీ అల్లానే వున్నాయి
కాదండీ అక్కా."
 "నిజం చెప్పావు. ఇంకా మనమూ అలానే సిద్ధం
అయితే?"
 "ఆడవాళ్ళు దేవతల బిడ్డలాండి! వారికి అధికారం
చేతికివస్తే మీ రన్నట్లు గర్వాలు ఆకాశం అంటుతాయేమో!
అప్ప చెల్లెళ్ళకన్న ఎక్కువగా స్నేహంగా వున్న స్త్రీలు
ఒకరికొకరు భరించలేనంత విరోధం వహిస్తారు."
 "అందులోనూ నిజం వుంది. అయినా ఆడవాళ్ళు
కూడా ఎక్కువగా జాతీయజీవనంలో పాలుపంచుకోవాలి."
 ఆ విధంగా పద్మావతిని ఊరడింపచేసి శ్రీమతి
వెళ్ళిపోయింది.
 పద్మావతికి ఏదో వర్ణనాతీతమైన శాంతి కలిగి
దిండుపైన తల వాల్చింది. ఆ మరునిమిషంలో నిద్రాదేవి
ఆమెను తన ఒడిలోకి గాఢంగా ఒరిగించుకొన్నది.
68-
 3
 సంగీత దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా తన గురువు
గారైన నరసింహమూర్తి మేష్టారిని వెంకట్రావుగారింటికి
చేర్చాడు. వారు ఇంటికి వెళ్ళేటప్పటికి బుచ్చి వెంకట్రావు
హాలులో ఎలక్ట్రిక్్దీపం వెలుతురున పేపరు
చదువుకొంటున్నాడు.
 "మేస్టారూ రావడం ఆలస్యం చేశారే! పద్మ
కులాసాగా వుందికదా?" అని బుచ్చి వెంకట్రావు నరసింహ
మూర్తి మేష్టారును పలకరిస్తూ, అతనితో వచ్చిన రాధాకృష్ణ
వైపు తేరిపారచూచాడు. ఆ చూపులో `ఎవరయ్యా యీ
అతిపట్నం వాసంవాడు!' అన్న ప్రశ్న స్పష్టంగా
మూర్తించింది.
 "ఏమీలేదు. ఈయన రాధాకృష్ణ! చాలా పేరు
పొందిన సంగీతదర్శకుడు. నాతో పాటు మా గురువుగారి
దగ్గిర సంగీతం నేర్చుకొన్న వెంకటరత్నం శిష్యుడు.
నా దగ్గిరా కొంతకాలం శిష్యరికం చేశాడు. ఈతనిది
బాపట్లలే! చటుక్కున సముద్రం ఒడ్డున కలుసుకున్నాం"
అని నరసింహమూర్తి మేస్టారు తొందరగా జవాబు
చెప్పినాడు.
 "అలాగా, చాలా సంతోషం!" అంటూ లేచి బుచ్చి
వెంకట్రావు రాధాకృష్ణ చేతిని స్పృశించి కరచాలనం
చేశాడు.
69-
 రాధాకృష్ణచేయి నెప్పెట్టింది. ఆరి ఉద్ధండపిడుగా,
చేయి కాస్తయితే ముక్కలయివుండును. ఎంత బండగా
ఉన్నాడు! అందుకనే ఆ నీలికలువపూవులాంటి ఆ అందమైన
బాలిక అంత బాధపడుతున్నట్లు కనబడింది. అని
అనుకున్నాడు రాధాకృష్ణ.
బుచ్చి: కూర్చోండి రాధాకృష్ణగారూ! మిమ్మలను కలుసు
కోవడం చాలా ఆనందంగా వుంది. మా ఆవిడ చాలా
గొప్ప సంగీత పాఠకురాలు అంటారు మా నరసింహ
మూర్తి మేష్టారు. మీరు వినాలి. మీ అభిప్రాయం
చెప్పాలి.
నర: అదేనయ్యా వస్తూ అనుకున్నాము. రాధాకృష్ణ
సంగీతం నువ్వు వినితీరాలి. ఏమయ్యో రాధాకృష్ణా! మా
బుచ్చి వెంకట్రావుకు సంగీతం అంటే ప్రాణం.
రాధా: అవును! ఆయన్ని చూడగానే గ్రహించవచ్చును.
ఆయన కళాహృదయం ఈ హాలు చూడగానే గ్రహించ
వచ్చును.
నర: ఈ రోజుల్లో డబ్బున్న ఒక్క పెద్దమనిషి ఒక్క కళా
పూర్ణమైన బొమ్మనుకొని తన ఇల్లు అలంకరించుకొన్న
పాపాన పోతున్నాడటండీ?
రాధా: ఈ రోజులలో లలితకళలు నేర్చుకోవడం ముష్టి
ఎత్తుకోడానికే! జమీందారులు వారికి శతాబ్దాలనుంచీ
వచ్చిన సంస్కృతి ప్రీతిచేత కళావేత్తలను పోషిస్తూ
వచ్చారు. ఇప్పుడేముందీ? జమీందారీలు లాగేశారు.
70-
స్వతంత్ర సంస్థానాలు ఎగిరిపోయాయి. ఎక్కడినుంచి
వస్తారింక అపరభోజులూ, కృష్ణదేవరాయలూను!
బుచ్చి: జమీలూ అవీ పోవలసిందే అనుకోండి. కాని
లక్షలు ధనం ఆర్జించే ధనస్వాములకు ఏం పొయ్యేకాలం
వచ్చింది చెప్పండీ?
నర: ఈ దేశంలో ప్రభుత్వం కులతత్వ ప్రభుత్వం! తక్కిన
దేశోద్ధారక ప్రాణాళికలన్నీ కులతత్వ రాక్షసి కడుపులో
ప్రాణాయస్వాహా అయిపోతున్నాయి.
రాధా: ధనస్వాములకు కళలెందుకండీ. సంగీతంపాడే బాలిక
మీద ఎక్కువ మోజు. అందుకనే సినిమాలు. సినిమాలు
అని కంపెని పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మా
బోటివారికి లాభమే అనుకోండి. లేకపోతే ఎంతమందో
చిత్రకారులూ, గాయకులూ మాడిపోవలసిందే కదా!
బుచ్చి: నేను ఇంతవరకూ కొంచెం కళావేత్తలు అనుకున్న
వారి సలహాతో ఒక డజను మంచిబొమ్మలు కొన్నాను
రాధాకృష్ణగారూ! రండి చూద్దురుగాని.
రాధా: మొత్తం ఏమాత్రం అయివుంటుందండీ!
బుచ్చి: పదిహేనువందలు ఖర్చయ్యాయి. కాని అంతవిద్య
సంపాదించుకొని, అలా అందంగా బొమ్మలువేస్తే నూరు
నూటయాభై వారిని ఏం పోషిస్తాయి చెప్పండీ?
రాధా: చూడండి, మా సినీమావారు లక్షలు సంపాదిస్తారు.
ఒక్క బొమ్మ కొన్న డైరక్టరుగాని, తారగాని, తారకుడు
గాని ఉన్నారా? ఒక్క రామబ్రహ్మంగారు తప్పబుట్టాడు
మహానుభావుడు.
71-
నర: ఏమనుకుంటే ఏంలాభం? ప్రభుత్వం ప్రజారాజ్యం
అంటారు. ప్రజలకు కళ కావాలికదా. ఆ కళను ప్రదర్శన
శాలలుగా ఏర్పాటు చెయ్యాలి ప్రభుత్వం. ఈ ప్రజా
ప్రభుత్వాలకు మాటలు జాస్తీ, చేతలు నాస్తీ.
బుచ్చి: ఎప్పుడండీ మీ సంగీతం మేము వినడం?
రాధా: నా కారు పంపిస్తాను.
నర: మా కారుమీదే వస్తాములే! నీకు ఎప్పుడు వీలో,
అప్పుడే వస్తాము మా అమ్మాయినీ తీసుకువస్తాము.
రాధా: రేపు రాత్రి ఎనిమిదిగంటలకు రండి. మా ఇంట్లోనే
మీ భోజనాలు. మళ్ళీ కాదనకండి. మాకు కులంతేడాలు
లేవండోయ్్ బుచ్చి వెంకట్రావుగారూ.
బుచ్చి: నాకు ఆ విషయంలో ఎవరినీ, ఏమీ ఇబ్బంది
పరచకూడదని నియమం.
రాధా: మా ఆవిడ ఒక నాయరమ్మాయి. సంగీతానికీ,
నాట్యానికీ నాకు శిష్యురాలయింది. ఆ తర్వాత భార్య
అయింది. కాని మన బ్రాహ్మణులకన్నా ఆచారాలే.
మాంసం చూడలేదు, చేపవాసనే గిట్టదు. కోడిగుడ్డు
కూడా పడదు.
బుచ్చి: మాకూ ఈ మాష్టారు పుణ్యమా అని చప్పటి
భోజనమే అలవాటయింది.
రాధా: కాబట్టి తప్పకుండా రేపురావాలి. మీ ఫోను
నెంబరివ్వండి. ఫోనులో జ్ఞాపకంచేస్తాను. సెలవు.
నమస్కారం మేష్టారూ.
రాధాకృష్ణ సెలవుపుచ్చుకుని వెళ్ళిపోయాడు.
72-
 4
 రాధాకృష్ణ ఇంటిలో బుచ్చివెంకట్రావూ, పద్మావతీ,
నరసింహమూర్తీ, రాధాకృష్ణ భార్య సుశీల చేరారు.
నాయరు వంటలో పండితుడు. మధురమైన మలబారు
శాకాహార భోజనమూ, పిండివంటలు వడ్డించగా భోజనాలు
పూర్తిచేసి, తాంబూలాలు వేసుకుంటూ లోని హాలులో
కూచున్నారు. రేడియో చక్కని సంగీతం పాడుతున్నది.
పద్మా: ఇప్పుడువచ్చే సంగీతం అంతా వట్టి కాఫీహోటలు
సంగీతం మేష్టారూ!
నర: అవునమ్మా అవును. ఎవరికి కావాలి ఉత్తరమైన
కర్ణాట బాణి?
రాధా: ఉత్తమమైన ఉత్తరాది బాణికూడా ఉత్తరాది
వారికే అక్కరలేకపోతోంది.
సుశీ: నాకుమాత్రం ఈనాటి సంగీతం చాలా అందంగా
ఉంటుంది.
బుచ్చి: కొన్ని కొన్ని ఉత్తరాది సినీమాపాటలు సురయా
పాడినవీ, కన్నన్్బాల పాడినవీ లతామంగేష్్కర్్,
షేంషెడ్్బీగం పాడినవీ చాలా ఇష్టం నాకు. అలాగే
సైగల్్. పంకజమల్లిక్్, వసంతదేశాయీలు నాకు ఇష్టం.
 అక్కడనుంచి అందరూ రాధాకృష్ణ గాంధర్వ
మందిరానికి పోయారు. అక్కడ రాధాకృష్ణ మేళంవారు
అంతా సిద్ధంగావున్నారు.
73-
 రాధాకృష్ణ తన భార్యనూ, ముగ్గురు అతిధులనూ
అక్కడ ఉన్న సోఫాలపై కూచోపెట్టి, తానువెళ్ళి తన మేళ
వాయిద్యాల వారి మధ్య తన దార్శకాసనంపై అధివసించాడు.
 అక్కడనుంచి అతడు గంభీరమైన తన కంఠమెత్తి
నాలుగు పాటలు పాడాడు. ఆ తర్వాత సుశీల వెళ్ళి
రాధాకృష్ణ ప్రక్కన కూచుని రెండు మలయాళపు పాటలూ ఒక
తెలుగుపాటా పాడింది.
 నరసింహమూర్తి మేస్టారు ఆనందంతో చప్పట్లుకొట్టి
"చాలా ఆనందంగా ఉందయ్యా, ఇంక మా అమ్మాయి
పద్మావతి పాట వినాలి నువ్వు. అమ్మా! ఏదీ ఒక్కపాట
వినిపించూ. రాధాకృష్ణా! ఒక్క పిడేలూ, మృదంగమూ
మాత్రమే మేళం. నా పిఢేలు తెచ్చుకున్నాలే! దానితో
నేనే వాయిస్తాను" అన్నాడు.
 "పాడు పద్మా! భయమేమిటి? అంతా మనవాళ్ళే!"
అని బుచ్చివెంకట్రావు భార్యను కోరాడు.
 పద్మావతి శ్రుతిచూచుకుని తన గురువు అందివ్వగా
నెమ్మదిగా రాగం ప్రారంభించింది. రెండు మూడుసార్లు
భయంచేత శ్రుతి తప్పింది. కాని వెంటనే అందుకుంది.
నెమ్మది నెమ్మదిగా తనకు ఇష్టమైన ఆ తోడిరాగం
సాగించింది. ఆ రాగంలో తన వర్ణంలోనికి ప్రసరించింది. ఆ
వెంటనే త్యాగరాజకృతి అందుకుంది. ఆ కృతికి సరిపడిన
స్వరకల్పనా వికాసంతో ఆ పాట పూర్తి చేసింది. అంతా
పదిహేను నిమిషాలు పట్టింది.
14-
 ఆ పాట పాడినంతసేపూ అందరూ మంత్రముగ్ధులై
విన్నారు. రాధాకృష్ణకు ఆ పాట వింటూఉంటే తాను ఒక
నాడు సందర్శించిన ఉదకమండలం ప్రకృతి దృశ్యం ప్రత్యక్షం
అయింది. ఒత్తుగా వివిధములైన ఆకుపచ్చని రంగుల చెట్లు
నిండివున్న కొండచరియలు చిన్న చిన్న సెలయేళ్ళు,
చెరువులు, లేళ్ళగుంపులు, పూవులు, నెమళ్ళు, పక్షులు, మేఘాలు
ఒక మహాశ్రుతిలో స్వరాలై దర్శన మిచ్చినట్లు అతనికి
తోచింది. ఆ కంఠం అంత అమృతమయమని అతడు
కలలోనైనా అనుకోలేదు. ఆ బాలికా, ఆమె గానమూ, చంద్ర
మూర్తి, చంద్రికా అయి అతనికి ఎదుట
లోచనగోచరమైనట్లయినది.
 ఆమె వెంటనే రాగమాలికతో "కస్తూరి తిలకం
అన్న శ్లోకం పాడింది. శ్రీ కృష్ణభగవానుడు నీలమేఘ
శ్యామల కాంతిపూర్ణుడై, కోటిసౌందర్య - రాజిత హాసాంచిత
వదనుడై, సదస్యులందరికీ గాంధర్వరూపంలో
ప్రత్యక్షమైనట్లనిపించింది. క్షేత్రయ్య పదం ఆ వెంటనే ఎత్తుకొన్నది.
 నరసింహమూర్తి ఆనందం వర్ణనాతీతం, అతడా
ఆనందంతో ఆచేతనుడొతూ తన ఫిడేలును వాయించడం
మానుతూ ఉండేవాడు.
 మేళంవారు ఆ పరమసౌందర్య గాంధర్వం వింటూ
శిల్పాలే అయిపోయినారు. ఏమి భాణి! ఇది మానవమాత్రుల
భాణియా అని బుచ్చి వెంకట్రావు, ఆమెను తప్ప స్వరమూ
మరచిపోయాడు. సుశీలాదేవి కన్నురెప్ప వేయని
అనిమిష
75-
త్వంతో పద్మావతిని చూస్తూ ఆమె గాంధర్వంలో మేళవించి
పోయింది. ఇవన్నీ ఒక గంట పట్టాయి.
 పద్మావతి పాటచాలించి అక్కడే తన తల వంచుకొని
కన్నుల నీరు కారిపోగా వెక్కి వెక్కి ఏడవడం
ప్రారంభించింది. అది గమనించగానే సుశీలాదేవి ఒకగంతున ఆ బాలిక
కడకు పరుగిడి ఆమెను పొదివిపట్టుకుని, లేవదీసి తన గది
లోనికి తీసుకుపోయింది. అక్కడ ఆమెను ఒక సోఫాపై
కూర్చుండబెట్టి తానామెప్రక్కన కూర్చుండి,
"అంతసిగ్గయితే ఎలా అమ్మా!" అని తెలుగులోనే మాట్లాడుతూ, నీ
సంగీతందా నేను వర్ణించ శక్తి చాలదే. జన్మకోసారికూడా
ఇందమాదిరి పరమసౌందర్య స్వరూపమైన సంగీతం
దొరుకునో ఏమో! అని అన్నది.
 ఇంతట్లో నాయరును పిలిపించి "కోకోచేసి, వెంటనే
తీసుకు రమ్మని." ఆజ్ఞ ఇచ్చి, ఈలోగా తాను మలబారు
నుంచి తెచ్చిన మంచి ఔషధం రెండు మాత్రలు మింగించి,
మంచినీళ్ళు త్రాగిపించింది.
 సుశీల పద్మావతిని గదిలోకి తీసుకువెడుతూ ఉంటేనే
పద్మావతి తేరుకుంది. ముందు బాగా పనిచేసింది. కోకో
పద్మావతిని పూర్తిగా మామూలు మనిషిని చేసింది.
 సుశీలాదేవి పద్మావతిని తన స్నానాల గదిలోకి
తీసుకుపోయి, మొగం కడుక్కోమని, తుడుచుకొనే తువాలు
ఇచ్చింది. ఆమెకు తలసర్ది, పౌడరు అవీ వ్రాసి, బొట్టుంచి,
76-
తన పూలబుట్టలోంచి జాజిమల్లియ దండనుతీసి ఆమె తలలో
అమరించింది.
 పద్మావతి జాజిమల్లియ దండను చూచింది. ఆమె
మనస్సు తేటబారింది. ఆ దండతో తన తలను అలంకరించిన
సుశీలను పద్మావతి సిగ్గుతో పలకరిస్తూ ఇంగ్లీషులో "వదినా!
ఈనాటినుంచి మనమిద్దరం ప్రాణస్నేహితులం సుమా!"
అంది.
77-
 షష్ఠమ గుచ్ఛము
 సంగీత దర్శకుడైన రాధాకృష్ణ ఇంట్లో, పద్మావతి
సంగీత ప్రదర్శనమైన కొద్దిరోజులకు, ఒక సాయంకాలం,
పద్మావతి స్నేహితురాండ్రతో చీనాబజారుకు వెళ్ళింది.
ఫేసుపౌడరూ, తిలకాలూ, సబ్బులూ అలాంటివన్నీ
కొనుక్కుందామని వారి ఉద్దేశం. హాస్టలుకు కావలసిన
సరుకులు కొత్వాల్్ సావిడిలో కొనడానికి వసతిగృహాధికారిణి
శ్రీమతి కరుణామయిగారు వస్తూవుంటే వారితో ఈ
బాలికలందరూ వచ్చినారు. అచ్చట ఒక కొట్టులోనికి ఎగబడి
ఏవో రంగు రంగుల చీరలూ, రవికల గుడ్డలూ బేరం
చేస్తున్నారు. అక్కడికి రాధాకృష్ణా అతని భార్య సుశీలా దేవి
చక్కావచ్చారు.
 "నమస్కారం పద్మావతీ దేవిగారూ! చీరలు
కొంటున్నారా ఏమిటి?" అంటూ సుశీల, పద్మావతీ తక్కిన
బాలికలూ ఉన్నచోటికి వచ్చింది.
 "నమస్కారం సుశీలా దేవిగారూ! అదిగొ రాధాకృష్ణ
గారు కూడా వచ్చారు. నమస్కారం రాధఆకృష్ణగారూ!
వీరందరూ మా సభా పాఠశాలలో చదువుకుంటున్నారు.
వీరు కరుణామయిగారు, మా హాస్టలు అధికారిణి! అక్క
గారూ, వీరు రాధాకృష్ణగారు, వీరు వారి భార్య సుశీలా దేవి
78-
గారు! ఈమె మళయాళీలు. రాధాకృష్ణగారు తెలుగువారు.
ఎంచో ప్రసిద్ధిపొందిన సంగీతదర్శకులు" అని తొందర
తొందరగా మాట్లాడింది.
 పద్మావతి మోము ప్రపుల్ల మనడమూ, ఆమె
కళ్ళల్లో కాంతి శ్రీమతి చూసింది. శ్రీమతి కరుణామయికి
ఏమి బుద్ధి పుట్టిందో కాని సుశీలనుచూచి, "ఏమండీ సుశీలా
దేవిగారూ, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే!
కొంచెం మళయాళీయాస ఉందనుకోండి! మీరు తప్పక మా
ఆంధ్ర మహిళాసభలో మెంబరు కాకూడదా?" అని
అడిగింది.
సుశీల: తప్పక చేరుతానండి. రేపు ఎల్లుండో వీలు చేసుకుని
వస్తాను.
కరుణా: మీరు మీ భర్తగారిచేత మా సభలో పదిహేను
రోజుల తర్వాత జరిగే సభలో సంగీతం పాడించాలని
ప్రార్థిస్తున్నాను.
రాధా: మా గృహలక్ష్మిగారిని ప్రార్థించ నక్కరలేదు.
కరుణామయి దేవిగారూ! మీరు ఎప్పుడువచ్చి పాడమంటే
అప్పుడు వచ్చి పాడడానికి సిద్ధం.
పద్మావతి: తప్పకరండి రాధాకృష్ణగారూ! ఆ సందర్భంలో
సుశీలా దేవిగారూ కూడా పాడతారు.
సు: పద్మావతీ దేవిగారూ పాడతారు.
కరుణా: చాలా బాగా ఉంది. ఆ సభ దివ్యంగా రక్తికడుతుంది.
పద్మా: అమ్మో! నేను పాడడమే!
79-
సు: నేను పాడితేదా చాలా బాగాఉండునా ఏమీ?
ఏమమ్మా నీవుదా చెబుతావు. నువ్వు పాడతానంటేనే
నేను పాడటానికి మాట ఇస్తాను.
క: మా పద్మావతి తప్పక వప్పుకుంటుంది లెండి.
రాధా: పద్మావతీ దేవిగారి గురువుగారూ నాకూ కొంతకాలం
గురువుగారు సుమండీ! మా గురువుగారు నరసింహ
మూర్తిగారు ఫిడేలు వాయిస్తారు లెండి.
పద్మా: మా మేష్టారి అనుమతి పుచ్చుకోవద్దా రాధాకృష్ణ
గారూ!
రాధా: ఆయన అతి సంతోషపడతారు.
 ఇంతట్లో చీరలబేరం సాగింది. సుశీల మంచిచీర ఒకటి
తీసి "ఇది కొనుక్కో పద్మావతి వదినా! నీకు ఇది బాగా
ఒప్పుతుంది!" అన్నది.
 ఆ చీర కరుణామయికి నచ్చలేదు. అది అతి నవీన
విధానంగా ముందు కుచ్చులకు వచ్చేభాగం ఎంతో పెద్ద
లతలతో తక్కిన చీర రంగును భేదంగా ఉన్న రంగుతో
ఉంది. చీర అతి పల్చన. అలాంటి చీరలు కొందరు సినీమా
తారలూ, పెద్ద ఉద్యోగస్తుల తనయులూ కడుతున్నారు.
అయినా పద్మావతి అలాంటిచీర కట్టుకుంటే, ఆమె మనస్సు
ఏఏ రీతుల ప్రవహిస్తుందో అని కరుణామయి అనుకున్నది.
ఒక్కొక్క రకం మనః ప్రవృత్తికలవారు ఒక్కొక్కరకం
చీరనూ రంగునూ ఎన్నుకోడం ఉంది. ఒక్కొక్కప్పుడు
ఒక్కొక్కచీరా, ఒక విచిత్రమైన లతలూ, నేతా, రంగులూ
80-
కలిగిన బ్లౌజు, స్త్రీలలో ఒక్కొక్క మార్పు కలుగజేస్తుంది.
అని కరుణామయి అనుకున్నది. ఆ చీర కొనవద్దని
చెప్పుదామని రెండుమార్లు అనుకున్నది. నాలుక చివరివరకూ మాట
వచ్చింది. తాను మాటంటే పద్మావతి అది రాజాజ్ఞగా
పరిపాలిస్తుంది. నిజమే! కాని లోన ఎంతో బాధపడుతుంది.
ఎవరిజ్ఞానం వారే సంపాదించుకోవాలిగదా అని నిశ్చయానికి
వచ్చి కరుణామయి మాట్లాడక వూరుకుంది. పద్మావతి
ఆ చీర కొనుక్కుంది.
 తక్కిన బాలికలకు చీరలూ, రవికగుడ్డలూ ఏరుతూ,
కరుణామయీ, బాలికలూ ఆ పనిలో నిమగ్నులయ్యారు.
సుశీలా, రాధాకృష్ణా, పద్మావతీ షాపులోనుండి వీధిలోనికి
వచ్చి అక్కడ వున్న వారి కారులో కూర్చున్నారు. సుశీల
తన కారు నడుపుకుంటుంది.
 "నువ్వే కారునడుపుతావా ఏమిటి వదినా?" పద్మావతి
సుశీలను అడిగింది.
 "అవును. ఇది నా కారు. మీ అన్నగారికి వేరేకారు
ఉంది. నా కారు ఇంకోరు నడిపేందుకు అవసరంలేదు." అని
సుశీల పకపక నవ్వుతూ జవాబు చెప్పింది.
 రాధాకృష్ణ చూపులు ఇంతవరకూ పద్మావతిపైనే
ఉన్నాయి. అతడు సిగరెట్టుమీద సిగరెట్టు వూదేస్తూనే
వున్నాడు. ఆ అమ్మాయి దేహవిన్యాసము అతణ్ణి విపరీతంగా
ఆకర్షించింది. శిల్పశాస్త్రరీత్యా ఇంత మనోహరమైన శరీరం
ఈ లోకంలో ఉండదు- అని అతడనుకొన్నాడు. ఆ
కూపా
81-
నికి తగినట్లు మోము, ఆ మోము సౌందర్యంలో ఆర్యజాతి
వారి రేఖలు వుండకపోవచ్చుగాక. ఆ చామన చాయ ఎంత
ఒప్పిందో? ఆ దేహం ఎంత స్నిగ్ధంగా ఉన్నదో. స్వచ్ఛమైన
రంగు, ధనమూ, సంపదా, రాగానే రంగుకూడా వచ్చింది.
వీళ్ళు మాంసాదులు తినడం మానివేశారట. దానివల్ల
మానసికంగా కూడా మార్పులు వస్తాయి కాబోలు!
 ఆ బాలిక కళ్ళు విశాలంగా సోగలై,
వెన్నెలకాంతులు పొదువుకొని ఉన్నాయి. చామనచాయ కలవారిలో
ఇంత అందం వుంటుందని అత డిదివరకు ఊహించుకోలేదు.
 అలా అతని ఆలోచనల~ ప్రవహించిపోతున్నవి.
 ఆర్ద్రత కలిగిన అతని చూపులు తనపై పూర్తిగా
ప్రసరించి పోవడం పద్మావతి గ్రహించింది. అతని
హృదయంలో తన్ను గురించిన ఏవో ఆలోచనలు
గుబాళించుకొంటున్నాయని ఆమె ఊహించుకుంది. ఇంత పేరుపొందిన
వాడు, ఇంత గాయకుడు తానంటె సమ్మోహపడడం
తనకెంతో గొప్ప అనుకుంది. ఆమెకు ఏదో పట్టరాని ఆనందం
కలిగింది. "మీరూ మా వదినా పాడేటట్లయితే నేనూ
పాడతానండీ రాధాకృష్ణగారూ!" అని చటుక్కున పద్మావతి
అన్నది.
 రాధాకృష్ణ చకితుడై "ఆం ఏమిటి? చాలా
బాగుటుంది. ఆ రోజు మనవాళ్ళందరికి దివ్యమైన సంగీతపు పిండి
వంటలతో విందు చేద్దాము" అన్నాడు. ఇంతట్లో
కరుణామయి తక్కిన బాలికలూ పైకి వచ్చారు. పద్మావతి
వారందరితో కలసి ఆంధ్రమహిళాసభకు వెళ్ళిపోయింది.
82-
 2
 బుచ్చి వెంకట్రావు, రాధాకృష్ణ ఇంటిలో జరిగిన
సంగీత ప్రదర్శనం వెనక పదిరోజులకు ఒక సాయంకాలం
తన కారుమీద ఒంటిగా రాధాకృష్ణ మేడకు వచ్చినాడు.
అతనికి ఇనాళ్ళూ మంటి స్నేహాలు దొరకలేదు. వ్యాపార
సంబంధం కలిగినవారు పదిమందితో అతనికి పరిచయం కలిగిన
మాట నిజమే.'కాని అది పరిచయంగానే ఉండిపోయింది.
 అతనికి అతిసన్నిహిత మిత్రుడు నరసింహమూర్తి
మేష్టారే! ఇంతవరకూ భార్యా, తనూ సర్వతో ముఖంగా
జ్ఞానవంతు లవ్వాలన్నదీక్షే అతనికి స్నేహాలు అవసరం
లేకుండా చేసింది. ఇప్పుడు భార్య దూరమైపోయింది.
మదరాసులో నరసింహమూర్తి మేష్టారు నానాటికి తనకు
తాబేదారయ్యాడు. స్నేహం చాకిరిగా మారిపోయింది.
 ఇంక అతనికి తన వ్యాపారం తప్ప ఇంకోవృత్తి లేక
పోయింది. సాయంకాలం ఏమీ తోచేదికాదు. బీచికి వెళ్ళటం
మొదటి దినాల్లో కొంత కాలక్షేపం అయింది. సినిమాలు
కొంత కాలక్షేపం తీర్చేవి. చివరికి రెండూ
విసుగుపుట్టించాయి. కొన్ని దినాలు అలా కారు వేసుకొని మద్రాసంతా
తిరిగేవాడు. అతడు వాళ్ళని పేటలేదు. తిరగని సందులేదు.
అదీ విసుగు పుట్టింది.
 అలాంటి బుచ్చివెంకట్రావుకు రాధాకృష్ణ మంచి
83-
స్నేహితుడు కావచ్చును అనిపించింది. ఆ ఆలోచనతో
రాధాకృష్ణ ఇంటికి వచ్చాడు.
 రాధాకృష్ణ ఇంటిలోలేడు. "ఏదో సినిమా చిత్రంలో
ఒకపాట రికార్డు చేస్తూండడంవల్ల వారు వెళ్ళినారు" అని
సుశీలాదేవి ఆయనతో చెప్పి. "రండి! కాస్త కాఫీతాగుదురు
గాని!" అని లోని హాలులోనికి ఆహ్వానించింది.
 బుచ్చి వెంకట్రావు బలసంపద కళ్ళు తనివోవ సుశీల
చూస్తూ అతడు కూచున్న సోఫాకు ఎదురుగావున్న సోఫాలో
కూచుంది.
 "మీరు యుద్ధానికి వెళ్ళివచ్చారా వెంకట్రావుగారూ?"
 "వెళ్ళివచ్చాను. కాని అది నాకు ఉపకారమే
చేసిందొ, అపకారమే చేసిందో?"
 "అదేమిటి అలా అంటారు?"
 "అవునండి! యుద్ధానికి వెళ్ళకముందు నేను వట్టి పల్లె`
టూరి పల్లెవాడిని. యుద్ధంనుంచి వచ్చాను. ఏదో పిచ్చి పిచ్చి
ఆలోచననలు పుట్టాయి. చేపలు వర్తకం పెట్టాను.
రంగూనుకూ, అలాంటి ఇతర దేశాలకూ రొయ్యపప్పు ఎగుమతీ,
ఆ మూలాన బాగా లాభం వచ్చింది. వస్తూవున్నది. ఇంక
నాకు మా ఆవిడకూ జ్ఞానసముపార్జన తృష్ణ ఉద్భవించింది.
నాగరికతా, చదువూ కావాలి. ఆవిడకు సంగీతమూను,
మేము నాగరికుల మయ్యాము. కాని తృప్తి, ఆనందమూ
మాత్రం మాయమయ్యాయి సుశీలాదేవిగారూ!"
 బుచ్చి వెంకట్రావు మాట్లాడుతున్నంతసేపూ సుశీల
84-
అతనివైపు రెప్పవాల్చకుండా చూస్తుంది. ఎంత విచిత్రంగా
వుంది బుచ్చి వెంకట్రావు కథ. పద్మావతిలోనూ ఏదో
అసంతృప్తి వుంది. ఈతనిలోనూ ఏదో అనూహ్యమైన ఆవేదన
బయలుదేరింది. తన జీవితమూ విచిత్రమైనదే, తనకు ఈ
వివాహం కాకముందే పురుష సంబంధం వున్నది. స్కూల్్
ఫైనల్్ పరీక్ష అయి తిరువాన్్కూరులో సంగీతమూ,
నాట్యమూ కొంత నేర్చుకొన్నది. ఒక మలయాళ సినిమా
చిత్రంలో వేషం వేయడానికి (ఏదో చిన్న నాట్యవేషమే
అనుకోండి) తను మద్రాసు వచ్చింది. అంతట్లో తను, రాధా
కృష్ణ దగ్గిర శిష్యురాలయింది. అతనితో నాట్య భాగస్వామిని
అయింది. అతడు బ్రాహ్మణుడు, తాను నాయరుబాలిక,
అయినా తనకు అతడు సరియైన పురుషుడని తోచింది. అతని
వల్ల తనకూ పేరు వచ్చింది. అతడు సంగీత దర్శకుడుగా,
నాట్యదర్శకుడుగా ఉన్న ప్రతి చిత్రంలో తనకూ నాట్య
వేషమో లేక రెండవ నాయిక వేషమో వస్తోన్నది. అతడు
తన పేర ఒక ఇల్లు కొన్నాడు. కొంతడబ్బు బ్యాంకిలో
వేస్తున్నాడు. తన జీవితం హుషారుగా ప్రవహించి పోయింది.
ఇంతట్లో అతని పేరు హెచ్చిపోసాగింది. అనేక కంపెనీల
వారు ఇతర నాట్యకత్తెలు కావాలునేవారు. ఇంక రాధాకృష్ణ
దూరమైపోతాడని ఊహించింది. వివాహ ప్రసక్తి తెచ్చింది.
 "బుచ్చి వెంకట్రావుగారు! తృప్తి, ఆనందమూ అనేవి
మనలో ఉన్నవి అంటారా, పైనుంచిదా వచ్చేవంటారా?"
 "మనలోనే ఉన్నాయనుకోండి, కాని పైన మనకు
85-
సంధానమయ్యే పరిస్థితులనుబట్టి కదా మనకు ఆనందమూ,
తృప్తి కలగడము!"
 "అవునుదా! నిజమే కాని, మనకు ఏలాంటి పరిస్థితి
సంఘటించినా, దానివల్ల మన మనః ప్రవృత్తి ఎందుకుదా
మారాలి?"
 "నిగ్రహం కలవారికి మారదనుకోండి. కాని ఎందుకు
మనం ఈ పనులన్నీ చేస్తున్నామో తెలియని వారికి
నిగ్రహం కలుగదు. జ్ఞానం వృద్ధి అయినకొద్దీ, మనస్సుకు నిలకడ
తక్కువౌతుంది."
 "సంపూర్ణ జ్ఞానం కలవారికి!"
 "సంపూర్ణత అనేది జ్ఞానానికి వుందా!"
 "కాబట్టి, జ్ఞానం సంపాదించడానికి అంతులేదు. జ్ఞానం
సంపాదించే వారందరికీ అసంతృప్తి అన్న మాటేనని
సెప్పండిమీ!"
 "ఈ విషయాలన్నీ ఆలోచించడానికి నాకు శక్తి
ఎక్కడ ఉందండి!"
 "కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఉండరాదాఅండి."
 "అది ఎల్లాసాధ్యం!" నేను యోగినా? ఉప్పూ,
పులుసూ, కారము తినేవాడిని."
 "అయితే ఆ ఆలోచనవల్ల వచ్చే బాధలను,
ఆవేదనలను భరించడం నేర్చుకోవలసిదా ఉంటుంది. అసంతృప్తి
వల్ల వచ్చే హృదయబాధ భరించవలసిదా ఉన్నది."
86-
 "అందుకోసమే సర్వకాలమూ ప్రయత్నం
చేస్తున్నాను!"
 ఇంతట్లో నాయరు ఏవేవో ఫలహారాలు, "టీ కెటిల్్"
పాల "జగ్గూ", పంచదారభరిణా, చెంచాలూ, అన్నీ పట్టుకు
వచ్చి, ఆ లోని హాలులో ఒక మూలగా ఉన్న టీ బల్లపైన
వుంచాడు. సుశీల "రండి మీ వెంకట్రావుగారూ!" అని
పిలిచి అతణ్ణి టీ బల్ల కడనున్న కుర్చీలో ఒకదానిలో
కూచోమని కోరింది. వారిద్దరూ కూచుని ఉపహారం సేవింప
సాగించారు.
 "ఏమండీ వెంకట్రావుగారూ! మీకు తోచనప్పుడల్లా
మా ఇంటికి రండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడే రావచ్చును.
అరవ సినీమా చిత్రాలలో, మళయాళ చిత్రాలలో, నా
కంఠము కొందరు సినిమా తారలకు ఇస్తున్నాను. అందుకై
పాటలు రికార్డింగుకు మాత్రందా వెడుతూ ఉంటును.
నాట్యకత్తెగా సినిమా చిత్రాలలో నటిస్తాను. గనుక, ఆ
సమయాలలో తీరుబడి ఉండదు. మీరు ముందు ఫోనుచేసి, మా
ఇద్దరిలో ఎవరన్నా ఉన్నారో లేరో కనుక్కుని, ఎవరున్నా
తప్పకుండా రండిమీ. మీ ఆవిణ్ణిదా తీసుకువస్తాను.
 "మీ రెప్పుడు ఇంటిదగ్గిరనా ఉందురు?"
87-
 3
 "ఇల్లూ, ఆఫీసూ ఒక్కటే గనుక ఎప్పుడుపడితే అప్పుడే
వుంటాను."
 "అయితే చూస్తిరా? నేనుగాని, నేను మా ఆయన
గాని, మా ఆయన ఒక్కరేగాని మీ ఇంటికి తరుచుగా
వస్తూ శుంటుమే."
 "అంతకన్న భాగ్యమేముందండీ!"
 అంతకంతకు బుచ్చి వెంకట్రావుకు సుశీలతోనూ,
రాధాకృష్ణతోనూ స్నేహం ఎక్కువయినది. ఈతడు వీరింటికి
రావడమూ, వీరు బుచ్చి వెంకట్రావు ఇంటికి వెళ్ళడమూ,
అందరూ కలిసి సినిమాకు వెళ్ళడమూ, వెంకట్రావుకు కాలం
జరగడం లేదన్న ఆవేదన పోయింది.
 అతనికి, సుశీలకూ స్నేహం ఎక్కువైంది. సుశీల అతణ్ణి
ఒక్కణ్ణే కలుసుకునేది. అతణ్ణి కారుమీద ఈ ఊరు ఆ ఊరు
ప్రయాణం చేయించేది. రాధాకృష్ణ "సుశీల మీ చెల్లెలను
కోండి, మీ రామె స్నేహంలో ప్రపంచజ్ఞానం పూర్తిగా
అలవరచుకొంటారు బావగారూ!" అనేవాడు.
 సుశీల బుచ్చి వెంకట్రావుకోసం రాగానే అతని భుజాల
మీద చేయివేస్తుంది. ప్రక్కనే కూచుంటుంది. అతని ఛాతీ
మంచి విశాలమైనదని తడుముతుంది. దండలు ఉక్కుతో
చేసివుంటాయని నొక్కుతుంది. తనకు బలమైన వాళ్ళను
చూస్తే ఆనందమంటుంది.
86-
 సుశీల కలుపుగోరుతనమూ, ఆమె లేనిపోని పిచ్చి పిచ్చి
ఊహలు పెట్టుకోకుండా తనతో సాయిలా ఫాయిలాగా
ఉండడమూ అతనికి చాలా ఆనందం కలిగింది. అతని హృదయంలో
ఏవో బరువులు కరిగిపోయినట్లయినది.
 మధ్య మధ్య ఆంధ్రమహిళాసభ పాఠశాల
ప్రధానోపాధ్యాయిని అనుమతితోనూ, వసతిగృహాధికారిణి
అనుమతితోనూ పద్మావతిని రాధాకృష్ణగారింటికి బుచ్చి వెంకట్రావు
తీసుకువచ్చేవాడు. ఆ సమయంలో రాధాకృష్ణ ఆనందానికి
మేరలేకపోయేది. పద్మావతీ అతడూ సంగీతం అని
కూచునేవారు. రాగాలు, తాళాలు సినీమాలలో ఆనాడు ఎక్కువగా
వాడుకలోకి వచ్చిన పాటలు, అవి విపరీతంగా ప్రజామోదం
పొందటానికి హేతువులు, గట్టి సంగీతం ఎందుకు ప్రజలకు
భరింపరానిదవుతుంది - ఈ విషయాలు ఆమెకు చెప్పేవాడు
రాధాకృష్ణ, ఆమెకు ఉత్తరాది, మహారాష్ట్ర సినీమాల
పాటలు గ్రామ ఫోనులో వినిపించేవాడు. తానిచ్చిన వరసలు
ఉత్తరాది వరసలకన్నా దక్షిణాది వరసలకన్నా ఎందుకు
బాగుంటాయో చెపుతూ, తన వరసలూ ఆయా పాటల
వరసలూ పాడి వినిపించి ఆమెకు తెలియజేసేవాడు.
 ఆ మేడలో సుశీలా వెంకట్రావు ఒకవైపునకూ
పద్మావతీ రాధాకృష్ణ లొకవైపునకూ తేలుకు వెళ్ళేవారు.
పద్మావతిని ఏదో వంకతో రాధాకృష్ణ స్పృశించేవాడు.
ఆమే దేహం తన శరీరానికి తగులుతూ ఉండేటట్లు సోఫాలో
కూచునేవాడు. నడుస్తూ ఉన్నప్పుడు. ఆమె నడుం చుట్టూ
చేయివేసేవాడు.
89-
 మొదట పద్మావతి భయపడింది. ఈ విధానం అతి
నవీనం కాబోలు. ఇందులో తప్పులేదని సమాధాన
పెట్టుకున్నది. అంతకంతకు రోజులు గడిచినకొద్దీ ఆ బాలికకు
రాధాకృష్ణ స్నేహం అతి అవసరమైనది. సంగీతం విషయాలు
నేర్చుకొనడం ముఖ్యమే! అంతకన్న ముఖ్యం రాధాకృష్ణ
మాటలే! అతడు మాట్లాడేవన్నీ ఆమెకు తెలియవు. అతడు
ఏవేవో చెప్పేవాడు. అతడు ప్రపంచంలోని అన్ని విషయాలు
తెలిసికోలేదు. అతని చదువూ అంత పెద్దది కాదు. రోజూ
వచ్చే దినపత్రికలు వార్తలిస్తాయి. కొన్ని ఉపన్యాసాలు
ముద్రిస్తాయి. అవి విజ్ఞాన విషయాలేమి చెప్పగలవు?
స్నేహితులైన సినీమావారు మాట్లాడుకునే మాటలూ,
చప్పచప్పని ఆరణాల మాస, పక్షపత్రికలు ఏమంత జ్ఞానం
ఈయగలవు?
 అయినా ఇప్పుడిప్పుడే ప్రపంచజ్ఞాన వాతావరణంలో
హృదయపుష్పపుటాలు విప్పుతూన్న పద్మావతికి అతడు ఏ
విషయం చెప్పినా అవన్నీ అద్భుతంగానే ఉండ఼ేవి. ఇంతకూ
అతడు అదృష్టవంతుడూ, చాలా తెలివైన సంగీతదర్శకుడూ!
 ఇటు పద్మావతికి ఏ రీతిగా ఏదో సంతృప్తి హృదయం
నిండిపోయిందో, ఆరీతిగా సుశీలాదేవి స్నేహంవల్ల బుచ్చి
వెంకట్రావుకు వర్ణింపరాని తృప్తికలిగింది.
 అతని హృదయంలోనూ సుశీలాదేవి విషయంలో
స్త్రీ పురుష సంబంధ విషయకమైన భావాలు కలగలేదు.
అలాంటిభావా లేమైనా పద్మావతీ వెంకట్రావుల హృదయ
90-
మూలాల స్పందనం అయివుండెనో ఏమో! కాని వారిద్దరి
ఆవేదనలూ తగ్గిపోయాయి.
 పద్మావతి ఇప్పుడు విద్యాలయములో తృప్తిగా
చదువుకుంటున్నది. తోటి బాలికలతో ఎక్కువ చనువు
సంపాదించుకుంటున్నది. వారితో కలిసి తిరగడం ఆమెకు
ఎక్కువ ఇష్టమైనది. అంతకంతకు శ్రీమతి కరుణామయి
గారితో ఆమె స్నేహం వృద్ధి పొందింది.
 కరుణామయికి పద్మావతి అంటే చెప్పలేని దయ
కలిగింది. ఆమె ఎక్కువ శ్రద్ధ వహించి తానే ఎన్నో
విషయాలు ఆమెకు బోధించేది. పద్మావతి సభలలో నిర్భయంగా
సంగీతం పాడేట్లు చేసి, ఆమె సభాపిరికితనం మాయం చేసింది.
 ఇంతలో దసరా ఉత్సవాలు వచ్చినవి. ఆ
ఉత్సవాలలో ఒకరోజున రాధాకృష్ణ, సుశీల, పద్మావతిగార్ల సంగీతపు
కచ్చేరీ జరిగింది. ఆ రోజున పద్మావతి అపర మీరా
బాయిలా ప్రకాశించింది. సంగీతంలో సుబ్బలక్ష్మికి
దీటనుపించుకుంది. పాడినపాటలలో ఒకటిమాత్రమే త్యాగయ్య
కృతి. తక్కినవన్నీ ఈనాటి కవులలో ప్రసిద్ధికెక్కినవారి
పాటలు, కృష్ణశాస్త్రిగారి ఊర్వశీ గీతమొక్కటీ, మురళీ
గీతమొక్కటీ పాడింది.
 "మోయింపకోయ్్ మురళి మోయింపకోయ్్! అన్న
పల్లవిలో రాధాదేవిలో ప్రతిభక్తునిలో, మురళీకృష్ణ
దివ్యభావంవల్ల ఉద్భవించే పరమ మనోహరానందం రాగంలో
అవరోహణంలో చూపించింది - "తీయ తేనియ బరువు
91-
మోయలేదీ బ్రతుకు" అని అనుపల్లవి ఎత్తుకొని, ఆ ఆనంద
వివశత్వం, ప్రియా ప్రణ౟గాఢోత్కంఠితయైన రాధ ఆ విశ్వ
సౌందర్యంలో లయమూకావాలి. లయముకాకుండా తన
దివ్యపురుషునితో సాలోక్య, సారూప్య సామీప్యానందమూ
పొందాలి.
 ఆ పాట శ్రోతల హృదయాలు కరిగించింది.
ఆనందంతో అనేకమంది స్త్రీల కన్నులనీరు జలజల
ప్రవహించాయి.
92-
సప్తమ గుచ్ఛము
 "పద్మావతీదేవిగారికి గాయకులమైన మేమంతా
`గీతాదేవి' అని బిరుదు ఇస్తున్నాము." అని రాధాకృష్ణ
ఆ సంగీతసభ అనంతరం, పద్మావతి సంగీతాన్ని
మెచ్చుకుంటూ ఉపన్యాసం ఇచ్చి ముగించాడు. సభ అంతా కరతాళ
ధ్వనులు నిండిపోయాయి.
 అక్కడనుండి `గీతాదేవి' సంగీత కచ్చేరీలు
మద్రాసులో ఎన్నో జరిగాయి. కొన్ని ఆంధ్ర విద్యాసంస్థల
పోషణార్థం ధనం వసూలు చేయడానికి గీతాకుమారి సంగీత
సభలు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క గానకచ్చేరీకి పదివేలు,
పదిహేనువేల రూపాయలు రాబడిరాసాగింది. ఆంధ్ర
తుఫాను నిధీకీ, తమిళదేశం వరదలనిధికీ, ప్రభుత్వంవారు
ఆ బాలికను కచ్చేరీలక఼ు ప్రార్థించి ఒప్పించుకొన్నారు.
 `గీతాదేవి' ప్రసిద్ధనామమయినది. గ్రామఫోను
కంపెనీలవారు ఆమెపాటలు రికార్డుతీయ ఏర్పాట్లు
చేసుకొన్నారు. ఒక ప్రసిద్ధ ఆంధ్ర సినిమాకంపెనీవారు ఆమెను
తమ చిత్రంలో ఉపనాయికగా రమ్మనమని పిలిచారు. ఆమె
రానని చెపితే, ఆమె కంఠం నాయికకు గాంధర్వ కంఠంగా
బుక్్ చేసుకున్నారు.
 వీటి అన్నింటికీ కారణం రాధాకృష్ణ. రాధాకృష్ణ
పద్మావతీ చరణచారణ చక్రవర్తి అయిపోయినాడు. ఒక్క
93-
రోజు పద్మావతిని చూడకపోతే అతనికి తోచదు. తాను
ఆంధ్రమహిళాసభకు సుశీలను పంపి పద్మావతిని తీసుకు
రమ్మంటాడు. `గీతాదేవికి' చదువు సాగటంలేదు. పద్మావతికి
మతిలేదు.
 మహిళాసభా విద్యాసంస్థాధ్యక్షురాలు పద్మావతిని
తనగదిలోనికి పిలిపించుకుంది. "ఏమమ్మా పద్మావతీ! నువ్వు
సంగీతంలో అతి ప్రసిద్ధురాలివై పోయినావు, నువ్వు మాసభలో
ఉండటం కీర్తే! కాని విజయం పొందలచుకొన్న పరీక్షమాట
ఏమిటి? ఇంతవరకూ చదువులో బాగావచ్చావు. కాని, ఈ
సంగీతం గొడవవల్ల కాబోలు మొన్న అర్ధసంవత్సరం
పరీక్షలో చాలా తక్కువమార్కులు వచ్చాయి. పరీక్షలు
ఇంక నాలుగునెలలే ఉన్నాయి. ఇప్పటినుండి గట్టిగా చదవక
పోతే నువ్వు పరీక్షలకు వెళ్ళి లాభంవుండదు. నీకు సంగీతంలో
పేరురావడం, నీవల్ల లోకానికంతకూ ఉపకారం జరగడం
మా కందరికీ ఎంతో ఆనందంగానే వుంది. అయితే మరి
చదువుమాట?"
 "అవునండీ. అదే నేనూ ఆలోచిస్తున్నాను. ఇంతా
కష్టపడి చదివి, పరీక్షకు వెళ్ళకపోతే ఏమిలాభం? ఈ ఏడు
పరీక్షకు వెళ్ళకపోతే, ఇంక జన్మలో పరీక్షకు వెళ్ళలేను."
 "కాదుమరీ! కనుక బాగా ఆలోచించుకో. పరీక్షకు
వెళ్ళడం మానివేస్తే నువ్వు హాస్టలునుంచి వెళ్ళిపోవాలి.
నిరుడు పరీక్షలో నెగ్గని ఇద్దరు బాలికలు ఈ నాలుగు నెలలు
94-
ఇక్కడే వుండి చదవాలని, వస్తామని వ్రాసారు. వారిని
నీగదిలో ప్రవేశపెట్టగలను."
 "నేను పరీక్షకు వెళ్ళితీరుతానండి!"
 "అయితే సంగీతం? పేరు? సభలూ? రికార్డులూ?
సినీమా?"
 "ప్రస్తుతం అన్నీ మానేస్తాను!"
 "రేపు రాధాకృష్ణగారు వచ్చి బలవంతం చేస్తారు.
సుశీలగారు వచ్చి బ్రతిమాలుతారు!"
 "అవన్నీ లెక్కచేయనండీ! పరీక్షకని సంకల్పంతో
కదా ఇక్కడ చేరిందీ! అవి పూర్తిచేసుకుని తీరుతాను."
 "ఇంక నేను చేసే ఏర్పాట్లు విను. నీ భర్తగాని,
నరసింహమూర్తి మేస్టారుగాని సాయంకాలంవచ్చి మాట్లాడ
వచ్చును. సుశీలగారూ, రాధాకృష్ణగారు వస్తే నీకు తీరుబడి
లేదన్న మాట! సంగీత బేరాలు ఏవీ ఒప్పుకోడానికి వీలు
లేదు. ఏవైనాసరే! ఎంత గొప్ప వాళ్ళయినా సరే!
సాయంకాలం షికారు బందు! ఇవి ఇష్టమైతే పరీక్షకు దరఖాస్తు
పెట్టిస్తాను. లేదంటావూ నువ్వు మీ ఇంటికెళ్ళవలసిందే!"
 ఈ మాటలు ఖచ్చితంగా అధ్యక్షురాలు అంటూ
వుంటే పద్మావతి ముఖం వెలవెలపోయింది. అది చూచి,
"నేనింత నిష్కర్షగా అంటూవుంటే, మనస్సులో బాధపడకు
తల్లీ! నీకోసమే చెప్పాను. ఏ విషయమూ వేళాకోళంగా
చూడకూడదు. తర్వాత నీ ఇష్టము" అని అన్నది. పద్మావతి
ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది.
95-
 2
 నరసింహమూర్తి మాస్టారుకు ఏదో ఆవేదన
పట్టుకుంది. పద్మావతి విషయం చూస్తూవుంటే అతనికి మతి
పోయింది. ఈనాడు ఆమె జీవితం తనకందని వేగంతో
ప్రవహిస్తోంది. ఆ మహాఝంఝామారుతంలో తానో
మూలకు కొట్టుకొని పోయినాడు. అతణ్ణి గమనించేవారేలేరు.
రాధాకృష్ణ "ఓహో!" అంటాడు. "మేష్టారూ! ఎప్పుడు
వచ్చరండోయ్్!" అంటాడు. "సుశీల లోపల ఉందండీ!"
అంటాడు; ఆ తర్వాత ఆ ముక్కలూ అనడం మానివేశాడు.
 రాధాకృష్ణ గానమేళంలో, మొదట అతడ఼ు ఫిడేలు
వాయించేవాడు. ఆ రోజుల్లో "మేష్టారూ! ఈపాట ఈరకంగా
ప్రారంభిద్దాము" అనేవాడు. "గురువుగారూ, ఇప్పుడు
ఆ ఫ్లూటు ఈ సంగతులు వేస్తే బాగుంటుంది కాదండీ!"
అనేవాడు. నేడు అలాంటి సలహాలు అడగడు. ఆయన
రాకపోయినా రాధాకృష్ణ మేళం సావిపోతూనేవుంది. రమ్మన
మనీ అడగడం తగ్గించాడు.
 అప్పుడంత గౌరవంచేసిన రాధాకృష్ణ నేడింత
ఉదాసీనం వహించాడ఼ేమిటి?
 నరసింహమూర్తి మేష్టారి హృదయం కృంగిపోయింది.
అటు బుచ్చి వెంకట్రావూ తనకు దూరమైపోయాడు. ఇటు
పద్మావతి చదువులో పడిపోయింది.
96-
 బుచ్చి వెంకట్రావు సుశీలాద్వితీయుడై లోకం అంతా
తిరుగుతున్నాడు. ఇప్పుడంత త్రాగడానికి వీలులేదు.
పట్టణంలో ప్రోహిబిషను వచ్చింది. రహస్యంగా ఏలాంటి
బుడ్లయినా దొరుకుతాయి. కాని అతనికి ధైర్యం లేక
పోయింది. త్రాగు డాతనికి జీవితంలో భాగంకాలేదు. పైగా
త్రాగుడు కన్న నిషాకలిగిన సుశీలస్నేహం దొరికింది.
ఆ స్నేహంలో బుచ్చి వెంకట్రావుకు పద్మావతి అవసరం
లేదు. నరసింహమూర్తి మేస్టారూ అవసరంలేదు అనిపించింది.
 రాధాకృష్ణకు సుశీల అంటే నమ్మకమే! మలబారు
నాయర్లమ్మాయి. సంగీతమూ నాట్యమూ తిరువాంకూరులో
నేర్చుకుని, మద్రాసులో భరతనాట్యంలో అందెవేసిన చేయి
కావాలని ఆ మహానగరం వచ్చింది. మదరాసులో
కామాక్షీశ్వరపిళ్ళదగ్గిర తంజావూరి విధాననాట్యం నేర్చుకునే
రోజుల్లో రాధాకృష్ణ కామాక్షిశ్వర పిళ్ళ ఇంటికి వచ్చినాడు.
కామాక్షిశ్వరపిళ్ళకు అతడు శిష్యుడు.
 రాధాకృష్ణ తనగతి ఏమిటి అని పదేళ్ళక్రిందట
తటపటాయించే రోజుల్లో కొంతకాలం కూచిపూడి వెళ్ళి,
నాట్యం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు వేదాంతం లక్ష్మి
నారాయణగారికి శిష్యుడయ్యాడు. అతడు ఆడవేషంవేసి
నాట్యంచేస్తే ఆడవాళ్ళ నాట్యంకన్న, అతనినాట్యం
బాగుంటుందంటున్నారు. "వేషము స్థానం నరసింహారావు
గారి చిన్ననాటి ఆడవేషం అంత బాగుంటుంది." అని ఒక
నాట్యకళా విమర్శకుడు వ్రాసినాడట. ఆ వెనుక తంజావూరి
97-
విధానంకోసం అతడు మదరాసువచ్చి కామాక్షిశ్వరపిళ్ళెకు
శిష్యుడయ్యాడు. అక్కడ తోటి శిష్యురాలైన సుశీలతో
ఈతనికి పరిచయం గాఢమైనది.
         0 
</p></body></text></cesDoc>