<cesDoc id="tel-w-translat-admin-karya4" lang="tel">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>tel-w-translat-admin-karya4.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-13</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>కార్యాలయ నిర్వహణ</h.title>
<h.author>డా.వి. లలిత, డా//కె. మురళీమనోహర్్</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - Book</publisher>
<pubDate>1990</pubDate>
</imprint>
<idno type="CIIL code">karya4</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page 51.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-13</date></creation>
<langUsage>Telugu</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fact"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>2) ఐటమ్్వారీ ప్రకటన:
 భారతీయ ఎరువుల కార్పోరేషన్్ లిమిటెడ్ (భారత ప్రభుత్వ సంస్థ)
సంస్థ ఆరోగ్యకేంద్రాలలో స్టావ్ నర్సులుగా పనిచేయడానికి అర్హత ఉన్న
#అభ్యర్తుల నుంచి
దరఖాస్తులు కోరబడుచున్నవి.
1) ఖాళీల సంఖ్య: 12 (SC లకు ఒకటి, ST లకు ఒకటి)
2) వేతనం: రు.715-1115, మెస్సింగ్్ అలవెన్్స్ నెలకు రూ.45, వాషింగ్
#అలవెన్స్ నెలకు
రూ.20, యూనిఫారం అలవెన఼్స్ సంవత్సరానికి రూ.356. మొత్తం కనీస వేతనం
#నెలకు రు.
1177లు. గరిష్ట వేతనం నెలకు రూ.1622 లు.
3) విద్యార్హతలు: మెట్రిక్యులేషన్్, నర్సింగ్్లో `A'గ్రేడ్ సర్టిఫికేటు
#ఉండాలి. రాష్ట్ర నర్సింగ్్
రిజిష్టరులో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
4) వయస్సు:30 సంవత్సరాల లోపు (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు
#(5 సం//లు
అదనంగా సడలింపు).
5) అనుభవం: కనీసం ఒక సంవత్సరమైన పేరున్న అనుపత్రిలో పనిచేసి ఉండాలి.
6) నివాసం: ఎంపికైన అభ్యర్థులకు నర్సుల హాస్టలులో వసతి కల్పించడం
#జరుగుతుంది.
7) ఇతర నిబంధనలు: అర఼్హత అనుభవాన్ని బట్టి గరిష్ట వేతనం కూడా మొదట్లోనే
#ఇవ్వడం
జరుగుతుంది. అన్ని అలవెన్సులు కేంద్ర ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా ఉంటాయి.
 అన్ని వివరాలతో టైప్ చేసిన దరఖాస్లును డిప్యూటి పర్సనల్ మేనేజర్,
#భారతీయ
ఎరువుల కార్పోరేషన్్ సింద్రీ, బీహార్, 828122కు ఇది ప్రకటించిన మూడు
#వారాల్లో
పంపుకోవాలి.
chapter 13
115-
 వచ్చిన లేదా అందిన ఉత్తరాల రిజిష్టరీ
ప్రతి సంస్థ వ్యాపార లేదా పరిపాక వ్యవహారాలను బయటివారితే నడపడానికి
#ఉత్తర
ప్రత్యుత్తరాలు కిలకమైన పాత్ర వహిస్తాయి. పోస్టు ద్వారా గాని మెసింజర్ల
#ద్వారా గాని వచ్చే లిఖిత
కవర్లు ఇన్సూరెన్సు కవర్లు మొదలైనవి ఎన్నో ఉంటాయి. ఈ ఉత్తర
#ప్రత్యుత్తరాల అంశం సంస్థకు
రక్తప్రసరణం వంటిది. చాలాముఖ్యమైన అంశంగా దీన్ని భావిస్తారు.
 కార్యాలయానికి సంబంధించిన మెయిల్్ను (1) వచ్చే మెయిల్ అనీ
(2) బయటకు పోయే మెయిల్ అనీ ముఖ్యంగా విభజిస్తారు. సంస్థలో శాఖల
మధ్య జరిగే మెయిల్్ను మూడోరకంగా వర్గీకరించవచ్చు.
 సంస్థలోకి వచ్చే ఉత్తరాలు-సంస్థకు బయటి ప్రపంచంతో సత్సంబంధాలను
ఏర్పరచగలుగుతాయి. వీటిని చేపట్టే విధానం సమర్థవంతంగా ఉండాలి. ఈ విధానం
#కార్యాలయ
సామర్థ్యాన్ని చాటడమే గాక, బయటి ప్రపంచంపై మంచి ప్రభావాన్ని కలుగజేసేదిగా
#ఉండాలి.
 కార్యాలయంలోకి వచ్చే ఉత్తరాలను ఒక రిజిష్టరులో నమోదు చేస్తారు.
#ఈ విధంగా
చేయడం వల్ల సంస్థలోకి వచ్చిన ఉత్తరాలకు రుజువు ఉంటుంది. సంస్థలో పనిచేసే#ఉద్యోగుల
బాధ్యతలు నిర్ణయించడం, ఏయే పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నయో తెలుసుకోవడం
ఆలస్యాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది. అందువల్ల చాలా కార్యాలయాల్లో వచ్చిన
#ఉత్తరాల
రిజిష్టర్్లో వచ్చిన ఉత్తరాల వివరాలను సంగ్రహంగా, క్లుప్తంగా నమోదు
#చేస్తారు.
వచ్చిన ఉత్తరాలు రిజిష్టరులో నమోదు చేయడానికి కారణాలు:
1. కార్యాలయానికి వచ్చిన ఉత్తరాలను క్రమసంఖ్యలో ఉత్తరంలోని విషయాన్ని
#క్లుప్తంగా నమోదు
చేయటానికి.
2. భవిష్యత్తులో ఒక ఉత్తరం/దరఖాస్తు/పత్రం మొదలైనవి పరిశీలించడానికి పై
#విధంగా నమోదు
చేసింది ఉపయోగపడుతుంది.
3. అందిన ఉత్తరంపై తగు చర్య వెంటనే తీసుకోవటానికి సంబంధిత వ్యక్తికి
#సూచించటానికి.
వచ్చిన ఉత్తరాలను పుస్తకంలో నమోదు చేయడానికి ముందున్న దశలు
1. మెయిల్్ని అందుకోవడం, విప్పడం: వచ్చిన ఉత్తరాలను అందుకోవడం విప్పడం
#అనేది ఒక
ప్రత్యేకమైన పని. ఈ పనిని సంస్థ పరిమాణాన్ని బట్టి-అంటే చిన్న చిన్న
#కార్యాలయాల్లో వచ్చిన
117-
ఉత్తరాలను అదికారులు గాని, సెక్రటరీలుగాని, తీసుకొంటారు. పెద్ద సంస్థల్లో
#మెయిల్్ను
తీసుకోవడానికి, విప్పడానికి ప్రత్యేక విభాగం ఉంటుంది. మరీ పెద్ద సంస్థల్లో#ఈ పనికి యంత్రాలను
కూడా ఉపయోగిస్తారు.
ఉత్తరాలను విప్పి, వేరుపరిచి, ఏయే శాఖలకు, ఏయే విభాగాలకు, ఆ
#ఉత్తరాలను అందించాలో
వాటిని అయా శాఖలకు విభాగాలకు అందజేస్తారు.అధికారుల వ్యక్తుల సొంత
#పేర్ల మీద వచ్చిన
ఉత్తరాలను అంతరంగిక `వర్సనల్్', `కాన్పిడెన్షియల్్' అని రాసి ఉన్న
#ఉత్తరాలను అయా
అధికారులకు వ్యక్తులకు వాటిని విప్పకుండా అందజేస్తారు.
2. పరిశీలన: కవరులో ఉన్న పత్రాలను పరిశీలించాలి. కవర్్లో జతపరిచిన అన్ని
#పత్రాలు
సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. చెక్కులు, డ్రాప్టులు, డబ్బు మొదలైనవి
#ఉత్తరానికి జతపరచి
ఉంటే అవి సక్రమంగా అందాయో లేదో లెక్క పెట్టి లేదా పరిశీలించి అసలు
#ఉత్తరం పైన రాయాలి.
ఉత్తరం ఉద్దేశమేమిటో కూడా గమనించాలి.
3) తేదీ ముద్ర వేయడం: కవర్లు తెరచిన వెంటన్ ప్రతి ఉత్తరం పైన దానికి
#జతపరిచిన ఇతర
పత్రాలపై వచ్చిన తేదీ ఉన్న ముద్ర వేయాలి. అవసరమైతే సమయం కూడా
#వెయ్యాలి.
రిఫరెన్స్్కోసం ఉత్తరాల క్రమసంఖ్య కూడా వేయాలి. పెద్ద సంస్థలలో ఈ పనిని
#యంత్రాలు
చేస్తున్నాయి.
4) తప్పుగా వచ్చిన ఉత్తరాలు: ఇట్లాంటి ఉత్తరాలేవైనా వస్తే వాటిని
#అధికారులకు చూపించి,
తగుచర్య తీసుకొని తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలి.
5) అంతరంగిక/రిజిష్టర్ ఉత్తరాలు: ఒక ప్రత్యేక రిజిష్టర్్లో అంతరంగిక
#ఉత్తరాలను నమోదు
చేస్తారు. వాటిని విప్పకుండా తగిన అధికారులకు పంపుతారు. రిజిష్టర్డ్
#ఉత్తరాలను కూడా కొన్ని
సంస్థల్లో ప్రత్యేక రిజిష్టర్్లో రాస్తారు.
 ఈ వచ్చిన ఉత్తరాలు రిజిష్టర్్ను సంస్థలో బాధ్యతగల ఉద్యోగులు
#నిర్వహిస్తారు. దీన్ని
నిర్వహించే వ్యక్తికి వ్యవస్థలో జరిగే కార్యకలాపాలను గురించి బాగా
#తెలిసుండాలి. అతనికి
వ్యవస్థాపటాన్ని గురించి అధికార బాధ్యత ప్రాధాన్యాన్ని గురించి కూడా
#వివరంగా తెలిసుండాలి.
పై వివరాలు తెలిసుంటే వచ్చిన ఉత్తరాలు వ్యవస్థలోని వివిద అధికారులకు
#సక్రమంగా సరైన
సమయంలో సమాచారం అందించవీలవుతుంది. ఈ రిజిష్టరు నిర్వహించే వ్యక్తి
#ఉత్తరాలు వాటిలోని
విషయాలను రహస్యంగా ఉంచాలి. అన్నిరకాల ఉత్తరాలు ఇతని చేతిపైన పోతూ
#ఉంటాయి.
కాబట్టి ఇతడు సంస్థకు నమ్మకమైన వ్యక్తిగా ఉండి తీరాలి.
అయితే ఇన్ని ప్రయోజనాలు ఈ రిజిష్టర్ నిర్వహించడంలో ఉన్నా కొన్ని
#సంస్థలు పెద్ద మొత్తంలో
ఉత్తరాలను అందుకొనేటప్పుడు రిజిష్టర్్ను నిర్వహించడం లేదు ఉదా: పబ్లిక్
#సర్వీస్ కమీషన్లు.
ఉత్తరాలు తప్పిపోకుండా జాగ్రత్తపడటానికి వేరే పద్ధతులు కనిపెడుతున఼్నారు.
#అందులో ఒక
పద్ధతి ఏమిటంటే: ఒక శాఖకు/వ్యక్తికి పంపిన ఉత్తరాల జాబితాను
#తయారుచేసి, దానికి
సంబంధించిన వ్యక్తి సంతకాన్ని తీసుకోవడం. దానినే మెయిల్ రూం జాబితా
అంటారు. దాని నమూనా ప్రక్కపేజిలో చూడవచ్చు.
 కేందర్ ఫైలింగ్్పద్ధతి అమల్లో ఉన్నప్పుడు మరో ప్రత్యామ్నాయ
#పద్ధతిని
అనుసరించవచ్చు. ఈ పద్ధతి కింద ఉత్తరాలకు సంఖ్యలు వేసి ఆ ఉత్తరాలు
#ఏయే శాఖలకు
సంబంధించినవో సూచిస్తూ ఒక పట్టిక తయారుచేస్తారు. ఆ పట్టిక తయారుచేస్తారు.#ఆ పట్టికను ఫైలింగ్్ గుమాస్తాకు
పంపుతారు. అతడు ఆ పట్టిక ప్రకారం ఉత్తరాలను తనీఖి చేసి టికా వేసి
#సక్రమంగా పైల్ చేస్తాడు.
ఫైలింగ్ కాని ఉత్తరాల సంగతిని ఆయా శాఖలకు అడగటం జరుగుతుంది.
#మెయిల్ రూం పట్టిక
కింది విధంగా ఉంటుంది.
chapter 14
పంపే ఉత్తరాల రిజిష్టర్
 ప్రతి సంస్థ నుంచి రోజూ ఎన్నో ఉత్తరాలు బయటకు వెళుతూ ఉంటాయి.
#బయటి
ప్రపంచంతోను, వ్యక్తులతోను ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపే కార్యక్రమాన్ని
#కార్యాలయంలో
ఒకసమగ్ర విభాగం నిర్వహిస్తూ ఉంటుంది. బయటికి పంనే ఉత్తరాల సంఖ్య బాగా
#ఎక్కువగా
ఉంటే దాని నిర్వహణ కూడా సక్రమంగా ఉండాలి. బయటికు పంపే ఉత్తరాలకు
#సంబంధించిన
సమాచారం నమోద చేయాల్సి ఉంది. ఈ విధంగా పంపే ఉత్తరం తేదీ, సమయం
#మొదలైన
వివరాలు నమోదు చేయటానికి ఒక రిజిష్టర్్ను ఏర్పాటు చేస్తారు. దీనినే
#డిస్్పాచ్ రిజిష్టర్ అని
అంటారు. ఇందులో ఉత్తరం తేదీ, సమయం, క్రమసంఖ్య శ్రేణి, పేరు, పంపిన
#వారి చిరునామా,
విషయం, ఉత్తరంలో జతపరచిన పత్రాలు చర్యతీసుతకొన్న విధానం అంటించిన
#తపాలాబిళ్ళల
విలువ మొదలైనవి నమోదు చేస్తారు.
1. ఉత్తరం తయారీ 2. సంతకం 3. రిఫరెన్స్ చేయడం.
ఉత్తరాల తయారీలో డ్రాప్టింగ్, టైపింగ్ ఇమిడి ఉంటాయి. ఈ డ్రాప్టింగ్్ను #పై అధికారి గానీ లేదా
122-
గుమస్తా గానీ చేయవచ్చు. ఇట్లా రాసిన ఉత్తరాన్ని టైప్్చేసి అధికారి
#సంతకానికి పంపిస్తారు. మరీ
రోజూ వెళ్ళే రొటిన్ ఉత్తరాలైతే జూనియర్ అదికారులు సంతకాలు చేస్తారు.
#ముఖ్యమైన ఉత్తరాల
మీద ఉన్నత అధికారులు సంతకం చేస్తారు. సంతకాల఼యిన తరవాత, ముందు
#అవసరాల నిమిత్తం
ప్రతి ఉత్తరానికి రిఫరెన్స్ నంబరు ఇస్తారు. అయితే ఈ పద్ధతి మరీ
#సంస్థల్లో అమలులో లేదు.
ఉత్తరాలు డిస్పాచ్ చేయటంలో విధానాలు: డిస్టాచింగ్ అంటే ఉత్తరాలను బయటికి #పంపడమే.
అంటే ఉత్తరాలను పాసింజెర్ల ద్వారా పంపడం లేదా పోస్లు డబ్బాలో వేయడం.
#మెసింజర్ల ద్వారా
పంపితే వారు ఉత్తరాలు అందజేసి డిస్పాచ్ పుస్తకంలో సంతకాలు తీసుకొంటారు.
#డిస్పాచింగ్్లో
1. ఉత్తరాలను మడవటం, కవర్లలో పెట్టడం 2. సిల్ చేయడం, స్టాంప్ వేయడం 3.
#రిజిష్ట్్ర్్లో
రాసుకోవటం 4. తరవాత పోస్టు చేయటం లేదా పంపించడం అనే కార్యాకలాపాలు
#ఇమిడి
ఉన్నాయి. వీటిని డిస్పాచ్ గుమస్తా చేస్తాడు. పెద్ద ఆఫీసులో అయితే
#ఇందుకు గాను ఒక విభాగమే
ఉండవచ్చు.
 భవిష్యత్తులో ఒక ఉత్తరం గురించి చర్య తీసుకోవాలన్నా, వివరాలు
#తెలుసుకోవాలన్నా ఈ
రిజిష్టర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డిస్పాచ్ రిజిష్టర్ ద్వారా పోస్టు.
#ఖర్చులను
నియంత్రించవచ్చు.
chapter 15
ఫైలింగ్ పద్ధతి
సంస్థకు సంబంధించిన వ్యవహారాలకు వాటి వివరాలను సక్రమంగా నమోదు
#చేయటం ఎంత
ముఖ్యమో, ఆ రికార్డులను ఉత్తరాలను రిపోర్టులను భద్రపరచడం కూడా అంతే
ముఖ్యం. శాస్త్రీయమైన పద్ధతుల్లో సంస్థ కార్యకలాపాలకు సంబందించిన
#రికార్డులను
క్మపద్ధతిలో ఏర్పాటుచేసి భద్రపరచడాన్ని ఫైలింగ్ అంటారు. అవసరమైనప్పుడు
#వాటిని
త్వరగా కనుగొని, హాజరు పరచడానికి వీలుగా ఈ ఫైలింగ్ పద్ధతి ఉండాలి.
#ఇక్కడ ఫైలింగ్ అంటే
పత్రాలను జతపరచి ప్రాసెన్్ చేసి వాటిని సమాచారంగా మార్చడం. అంటే
#సులభంగా అర్థమయ్యే
విధంగాను, విశ్లేషణకు చర్చించడానికి అనువుగాను ఉండేటట్లు అమర్చడం అని
#అర్థం.
ఫైళ్ళ వర్గీకరణ: ఫైళ్ళను సులభంగా కనిపెట్టడానికి అవసరమైనప్పుడు అందుబాటులో
ఉంచడానికి, వాటికి తగిన విధంగా శీర్షికలు ఇచ్చి, ముందుగా నిర్ణయించిన
#ప్రాతిపదికపై వర్గీకరణ
చేయాలి. అయితే ఈ వర్గీకరణను ఎన్నో విధాలుగా చేయవచ్చు. కింది
#ఉదాహరించిన ఐదు
పద్ధతులను విడిగా, లేదా ఒకేసారి రెండు లేదా ఎక్కువ పద్ధతులను
#అనుసరించవచ్చు.
ఫైలింగ్్లోని పద్ధతులు: 1. అక్షర క్రమంలో ఫైలింగ్
 2. అంకెల క్రమంలో ఫైలింగ్
 3. తేదీ క్రమంలో ఫైలింగ్
 4. భౌగోళిక ఫైలింగ్
 5. విషయాల వారీ ఫైలింగ్
1. అక్షర క్రమంలో ఫైలింగ్: వివిధ వ్యక్తుల నుంచి వచ్చిన ఉత్తరాలకు లేదా
#వాటిని ఉంచిన
ఫైళ్ళను, ఇతర పత్రాలను అక్షర క్రమంలో విభజిస్తారు. ఈ ఫైలింగ్ పద్ధతి
#నిఘంటు
సూత్రాలననుసరించి ఉంటుంది. నిఘంటువులో మాటలకు A,B,C,D,E లుగా
#విభజించినట్లే
ఇక్కడ ఉత్తరాలను బిల్లులను విభజిస్తారు.
ఉదా: రమా అండ్ కంపెనీ-బిల్లు-`R' అక్షరం కింద.
 వెంకట్ ట్రేడర్స్-ఉత్తరం-`V' అక్షరం కింద.
2. అంకెల క్రమంలో ఫైలింగ్: ఈ పద్ధతిలో వ్యక్తులకు లేదా విషయాలకు
#సంబంధించిన
ఉత్తరాలకు ప్రత్యేక నంబర్లు ప్రకారం ఫైళ్ళను ఏర్పాటు చేస్తారు. ఇది
పరోక్షపద్దతి. ఈ నంబర్లకు సబ్ నంబర్లు కూడా ఇవ్వొచ్చు. ఇది గొప్పగా
#పత్రాలను
భద్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఉదా: 953/IAF/85జాగ్వార్:953
#నెంబరుతో వచ్చిన
ఉత్తరాలన్నీ ఈ పెల్్లోనే జాగ్రత్త చేస్తారు.
124-
తేదీ క్రమంలో ఫైలింగ్: సాధారణంగా ఖాతా పుస్తకంలు, పత్రాలకు ఈ పద్ధతిలో
#ఏర్పాటు
చేస్తారు. కోర్టు కేసు విషయంలోను, బిల్లుల విషయంలోను పాత తేదీలు అడుగుకు
#పోయి రాబోయే
తేదీలు పైకి వస్తూ వ్యవహారాలను ఈ పద్ధతి సులభతరం చేస్తుంది. సంవత్సరం
#వారిగా గాని,
నెలవారీగాగాని, తేదీ వారీగా గాని, పత్రాలను ఫైళ్ళలో అమర్చవచ్చు.
4. భౌగోళికఫైలింగ్: రికార్డులకు ప్రాంతాల వారీగా ఉంచదలచుకౌన్నప్పుడు ఈ
#భౌగాలిక
వర్గీకరణను అనుసరించవచ్చు. ఖాతాదార్లు సంస్థతో సంబంధమున్నవారు వివిధ
#ప్రాంతాలలో
ఉండవచ్చు. ఒక్కొక్క పట్టణానికి లేదా జిల్లాకు ఒక్కొక్క ఫైలు కేటాయించి,
#అక్కడికి
సంబంధించిన కరస్పాండెన్స్ ఆ పైలులో భద్రపరుస్తారు.
5. విషయాల వారీ ఫైలింగ్: విషయాల వారీగా ఉత్తరాలను, పత్రాలను విభజించి
#ఫైళ్ళను
ఏర్పాటు చేస్తారు. ఒక్కో విషయం కింద ఎన్నో ఉత్తరాల, సమాచారం
#ఉండవచ్చు. ఇలాంటప్పుడు
వాటిని మళ్ళీ విభజించి ప్రధాన విషయం కింద ఫైలో చేస్తారు. దీనిని ప్రభుత్వ
#సంస్థలు ఎక్కువగా
అనుసరిస్తూ ఉంటాయి.
ఉదా: ప్రజా సెక్షన్/హూంశాఖ/1984వ సంవత్సరం
స్థాయి హెడ్్-3 సంఖ్య. ఎఫ్-34 3-1-85-ప్రజా-1 తేది: 20.1.1985.
chapter 16
కార్యాలయ టీకా
 కార్యాలయ టికా అంటే అధికారికి, కార్యాలయానికి ఉన్న సమాచార
#సాధనం. అధికారులకు
కార్యాలయంలో ఉన్న ప్రతి అనిశ్చిత ఫైలులోని ప్రతి విశేషం గుర్తు
#ఉండకపోవచ్చు. కాబట్టి
ప్రస్తుతం కదలికలో ఉన్న ప్రతిఫైలుకు ఒక టికా ఫైలు ఏర్పరుస్తారు.
#ముఖ్యమైన ఫైలును
వర్తమాన ఫైలు అంటారు. దీనిలో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి.
#వర్తమాన ఫైలుకు టికా
ఫైలు అనుబంధమై ఉంటుంది. అన్ని నిర్ణయాలు, ఆజ్ఞలు టికాఫైలులో రాయడం
#జరుగుతుంది.
రెండు ఫైళ్ళ కూడికే రిఫరెన్స్ నంబర్ ఉంటుంది. నోట్్లో పేర్కొన్న
#రిఫరెన఼్స్్లకు సూచకాలు
ఉండాలి. పుటలు, క఼ొన్ని వాక్యాల సముదాయం వారీగా నోట్ ఫైలును నంబరు
#చేయడం
జరుగుతంది. ఫైలు సమర్పించిన వెంటనే చదవడానికి ఆఫీసరుకు వీలుకాకపోవచ్చు.
#కాబట్టి
ఫైలుతో బాటు క్లుప్తంగా దానిలోని విషయాలు వాటి రిఫరెన్సులు,
#పూర్వనిదర్శనాలు, నిబంధనలు,
నిర్ణయించే అధికారికి సలహాలు మొదలైనవి ఉన్న ఒక నోట్్ను జతపరచాలి.
కార్యాలయ టికా ముఖ్యవిశేషాలు:
1. టికా పరోక్ష పద్ధతిలో ప్రధమ పురుష లోనూ, సాధారణమైన పదాలతోనూ
#ఉండాలి.
2. ఒకదానిని ఒకటి పోలి ఉన్న కేసులలోని క్లుప్తమైన చరిత్రలు, వర్తమాన
#కేసులోని నిజానిజాలు,
పూర్వనిదర్శనాలు, దానికి సంబంధించిన నియమాలు, చట్టం, భవిష్యత్్లో
#తీసుకొనే చర్యకు
సలహాలు ఉండాలి.
3. ఆజ్ఞలు తెలపడానికి, గమనికలు, సూచించడానికి సంతకం చేయటానికి
#తగినంత ఖాళీస్థలం
పేపరు మీద వదలాలి.
4. టికా వేరొక ఫైలులో ఉండాలి. కార్యాలయ టికా మామూలు ఫైలుకు
#ప్రాసెన్్గా ఉండకూడదు.
5. వర్తమాన ఫైలులోని లోపాలకు లేదా చర్చ విషయాలను సూచించాలి.
#వర్తమాన ఫైలులోని
తప్పులను సరిదిద్దిడం, అనిశ్చితమైన వాటిని వివరించటం, ఆజ్ఞలు ఇవ్వడానికి
#ముందు కావలసిన
సమాచారం మొదలైన విషయాలపై కేంద్రీకృతం చేయడం జరగాలి.
6. మునుపటి ఫైలులో ఏవైనా నిజానిజాలు, సమస్యకు సంబంధించిన ఏవైనా
#నూత్రాల చర్చలు
తగిన రీతిలో ఉన్నట్లయితే వాటిని తిరిగి రాయనవసరం లేదు. ఒక సూచన
#పత్రాన్ని జతపరిస్తే
చాలు. కాని తాజా విషయాలకు విస్మరించకుండా జాగ్రత్త తీసుకోవడం
#అవసరం.
7. స్పష్టమైన నిర్దేశాలు లేకుండా ఉత్తరువులు అవసరమైనప్పుడు లేదా విధాన
#నిర్ణయాలు
తీసుకోవలసినప్పుడు టికా రాసి ప్రవేశపెట్టి ఉత్తరువులు తీసుకోవాలి. ఈ
#ఉత్తరువుల ఆధారంతో
వర్తమాన ఫైలునూ చిత్తుప్రతి రాసి పెట్టాలి.
8. మామూల కేసులో టికాతోబటు చిత్తుప్రతిని కూడా ప్రవేశపెట్టవచ్చు. తక్కువ
#స్థాయి
ఉద్యోగునుంచి సమాచారాలు అవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని కోరుతూ
#చిత్తుప్రతిని టికాతో
126-
సమర్పించవచ్చు.
9. ఆ టికాలో ఏదైనా చెప్పడం జరిగితే దానికి తగిన అధికారపరమైన ఆధారం
#అవసరం. సెక్షన్ల
అధికారుల మాత్రమే టికా ఫైలులో అభిప్రాయాలను తెలపవచ్చు. ఈ
#అభిప్రాయాలను పై
అధికారులు అంగీకరించవచ్చు లేదా తేసి పుచ్చవచ్చు. అభిప్రాయాలను
#అంగీకరించినట్టైతే
అందుకు కారణాలను ఫైలులో రాయాలి.
10. అధికారి ఏదైనా ప్రశ్నలు వేస్తే ఆ టికాను పొడిగిస్తూ ఆ ప్రశ్నలుకు
#జవాబులు రాయాలే కానీ.
మార్జిన్్లో ప్రశ్నకు ఎదురుగా జవాబు రాయకూడదు.
11. వర్తమాన ఫైలుకు పూటల సంఖ్య ఎర్ర సిరాతో రాయాలి. కానీ టికా
#ఫైలుకు నల్ల సిరాతో
రాయాలి.
 కార్యాలయ టీకా-నమూనా ప్రశ్నలు
1. ఒక బి.యన్.సి. మొదటి సంవత్సరం. విద్యార్థి సర్వోదయ
#కళాశాలకు చేశాడు. ఈ బదిలీ వినతి పత్రం
15, సెప్టెంబర్,1984 బదిలీ కోరుతూ వినతి పత్రం దాఖలు చేసాడు. ఈ బదిలీ
#వినతి పత్రం
పరిశీలించి నిర్ణయించే అధికారం విశ్వవిద్యాలయానిది. సర్వోదయ ప్రిన్సిపాల్
#ఈ బదిలీ వల్ల
బి.యన్.సి. క్లాను సంఖ్య అధికమైందని యూనివర్సిటికి ఉత్తరం ద్వారా
#తెలపాలి. దీనిపై
సర్వోదయ కళాశాల ప్రిన్సిపాల్ కోసం విశ్వవిద్యాలయాన్ని ఉద్దేశించి టికా
#తయారుచేయండి.
2. ఈ కింది ఉత్తరం ఆధారంగా ఒక కార్యాలయం టికా తయారుచేయండి.
తేది. 2.3.1985
Re.No.980-1c4-1/1985
నుంచి:
వైన్ ప్రిన్సిపాల్,
జవహార్ భారతి
కావలి.
కు:
కార్యదర్శి,
ఇంటర్్మీడియట్ బోర్డ్,
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్.
విషయం: ఇంటర్్మీడియట్ ప్రభుత్వ పాలనాశాస్త్రం నిర్భంధంగా ప్రవేశ
#పెట్టడం గురించి.
ఆర్యా,
ప్రభుత్వ పాలనా శాస్త్రం దినదినం ప్రాముఖ్యం పొందుతున్నది. ఇది కొన్ని
#విశ్వవిద్యాలయాల్లో
ఇంటర్్మీడియట్్లో ప్రవేశపెట్టారు. కొన్ని టోట్ల ఇంకా ప్రవేశ పెట్టలేదు.
#కచ్చితంగా దీనిని అన్ని
కళాశాలల్లో ప్రవేశపెట్టవలసి ఉంది.
 కనీసం 1986 నుంచీ అయినా సాంఘీకశాస్త్రల్లో ముఖ్యమైన పాఠ్యభాగంగా
#ప్రవేశ
పెట్టడానికి తగిన ఏర్పాటు చేస్తే మంచిది.
 ఇట్లు,
 భవదీయుడు,
 సంతకం.
chapter 17
 డెమి అధికార ఉత్తరం (D.O. ఉత్తరం)
ప్రవేశం: అధికార ఉత్తర ప్రత్యుత్తరాలలో జాబులు ముఖ్యపాత్ర వహిస్తాయి.
#అధికార ఉత్తరాలంటే
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, అర్థప్రభుత్వకార్యాలయాల్లోనూ అదికారులు రాసే,
#అందుకొనే
ఉత్తరాలు. అధికారులకు ఫిర్వాదు చేస్తూ రాసిన ఉత్తరాలు, సమాచార
#ఉత్తరాలు, లేదా సమాచారం
కోరుతూ రాసిన ఉత్తరాలు మొదలైనవి. అదికార ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా
#విధానాలు వీటిలో
డెమి అదికార ఉత్తరం ఒకటి.
 ఈ డెమి అధికార ఉత్తరాలలో రాసిన చిరునామా అందుకొనే వారి
#చిరునామాతో పాటు
అదికారులు పేరు కూడా ఉంటుంది. దీనివల్ల పేర్కొన్న విషయంపై తగిన
#అధికారి స్వయంగా దృష్టి
కేంద్రీకరించడానికి వీలవుతుంది. ఉత్తరంలోని విషయం చాలా ముఖ్యమైనదైనప్పుడు,
అత్యవసరమైన దైనప్పుడు, ఈ ఉత్తర ప్రత్యుత్తర పద్ధతిని అవలంభిస్తారు.
 సాధారణ ఉత్తర ప్రత్యుత్తర పద్ధతిలో అనుకొన్న సంస్థకు ఉత్తరం
#రాసేటప్పుడు ఉన్న
విషయం గురించి తెలుపుతూ క్లుప్తంగా తగిన సూచన కూడా తెలుపుతారు.
పెద్ద సంస్థల్లో సంప్రదాయ ఉత్తరాలకు తగిన స్థానమివ్వడం చాలా కష్టం.
#రాసేటప్పుడు ఉన్న
సంస్థలలో పని ప్రాసెన్్ విధానంలో చాలా వికేంద్రీకరణ ఉండడం వల్ల ఉత్తరం
#మొదట్లోనే విషయం
గురించి క్లుప్తంగా తెలపనట్లయితే ఆ ఉత్తరాలు తప్పిపోవడమోలేదా పని పంపిణి
#విధానం లోపం
వల్ల చేరవలసిన వ్యక్తికి గాక మరో ఉద్యోగికి చేరడమో జరుగుతుంది.
#ఇట్లాంటి సమయాల్లో
నిర్ణయం చేసే అధికారికి గాని, లేదా సరయిన అధికారికి గాని డెమి అధికార
#ఉత్తరాలు రాయడం
వల్ల ఆ అధికారి తక్షణమే విషయాన్ని గ్రహించడానికి వీలవుతుంది. ఎవరి
#చిరునామాకు ఉత్తరం
fiwQnBSr వారు ఈ ఉత్తరాన్ని మామూలు అదికార మార్గం ద్వారా కాకుండా
#స్వయంగా తామే
అందుకోవచ్చు. ఇందు మూలంగా తక్షణమే చర్య తీసుకోవటానికి వీలవుతుంది.
డెమి అదికార ఉత్తరాలు మూడు విధాలు:
అ) పై స్థాయి అదికారి కింది స్థాయి అధికారికి రాసే డెమి అదికార ఉత్తరం.
ఆ) సరయిన అధికారి పై స్థాయి అధికారికి రాసే డెమి అధికార ఉత్తరం.
ఇ) కింది స్థాయి అదికారి పై స్థాయి అదికారికి రాసే డెమి అదికార
#ఉత్తరం.
డి.ఒ. ఉత్తరాలు రూపాలు వేరువేరుగా ఉంటాయి. పై అధికారికి రాసే డి.ఒ.
#ఉత్తరాలలో ఉత్తరం
మొదటి "ఆర్యా" పేరు తెలపకుండా రాయడం జరుగుతుంది. చివరలో`నగౌరవంగా'
#అని
128-
ముగిస్తారు. ఉత్తరం అఖరున పేరు, చిరునామా, రాయాలి. సరిసమానులు
#మధ్య నడిచే డి.ఒ.
ఉత్తరాలలో `ప్రియమైన' అనే మాటను తరుచుగా వాడుతుంటారు. ఈ ఉత్తరాల
#చివరలో
"శుభాకాంక్షలతో" అని రాయడం జరుగుతుంది. తమ `విధేయుడు' అనిగానీ
#ధన్యవాదాలు"
అనిగానీ రాయరు.
డి.ఒ. ఉత్తరంలో, ఈ లక్షణాలు ఉంటాయి.
1. మామూలు ఉత్తర ప్రత్యుత్తరాల లాగా వీటిలో విషయం గాని, తగిన
#సూచనగాని పేర్కొనడం
 జరగదు.
2. చెప్పదలుచుకొన్న విషయం సూటిగా తెలపడం జరుగుతంది.
3. ఇట్లాంటి ఉత్తరాలకు ముందు సాంప్రదాయ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి
#ఉండవచ్చు.
4. అనేక మందికి పంపే పత్రమయితే తప్ప డి.ఒ.ఉత్తరాలు వైఖరి సొంతలిపిలో
#ఉంటుంది.
ఆఖరులో గుర్తించదగ్గ విషయం ఏదంటే ప్రతివారు డి.ఒ.ఉత్తరం రాయలేరు.
#ఒకే స్థాయికి చెందిన
అధికారుల మధ్య మాత్రమే డి.ఒ. ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. మామూలు
#అధికార
మార్గంలోని ఆటంకాలను తొలగించి ఉత్తర ప్రత్యుత్తర ప్రక్రియను వేగం చేయడమే
#దీనిలో
ముఖ్యోద్దేశం.
 సామాన్యమైన ఉత్తరం నమూనా
లెట఼ర్ హెడ్్
ఉన్నత విద్యాడైరెక్టర్
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్్నుంచి
కార్యదర్శి,
వృత్తి విద్యాబోర్డు,
ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్్కు,
 విషయం:-
 సూచన:-
chapter 18
వేతన బిల్లు తయారు చేయడం
 ప్రతి కార్యాలయ నిర్వహణలోను అనేక విధాలయిన బిల్లులను, పత్రాలను
#తయారు
చేయవలసి ఉంటుంది. అట్లాంటి బిల్లులలో ముఖ్యమైనది వేతన బిల్లు. ప్రభుత్వ
#ఉద్యోగులందరూ
ప్రతి నెలా అమలులో ఉన్న విధానాలు, పద్ధతుల ప్రకారం వేతన బిల్లు ద్వారా
#వారివారి వేతనాలను
పొందుతారు. ఈ వేతన బిల్లును సక్రమంగా జాగ్రత్తగా తయారు. చేయాలి.
#లేకపోతే చెల్లింపు
జరగదు. అందువల్ల వేతన బిల్లును తయారు చేసే విధానం తేలుసుకోవాలి.
#దాన్ని సరిగ్గా అర్థం
చేసుకొని అమలు పరిచే విదానాన్ని తెలుసుకోవడర్ కూడా అవసరం.
 ఈ వేతన బిల్లు నిర్ణయించిన రూపంలో, అవసరమైన సమాచారంతో
#ఉండాలి. ఈ బిల్లులోని
క్లెయిమ్్లను పరిశీలించి, దాన్ని పాన్్చేసే ఖాతా పుస్తకంలో రాస్తే అది ఒక#రికార్డ్్గా ఉంటుంది.
 కార్యాలయంలో స్థాపన విభాగం ఉద్యోగుల జీతభత్యాల విషయాన఼్ని
#చూస్తుంది. సంస్థలో
పనిచేసే ఉద్యోగులందరి జీతభత్యాలను క్లెయిమ్ చేసే బాధ్యత ఈ విభాగం పైన
#ఉంది. ఒక నెలలో
ఒక ఉద్యోగి ఎంత సంపాదిస్తాడో ఈ వేతన బిల్లులో వివిధ హెడ్్ల కింద
#చూపిస్తారు. అతని మొత్తం
సంపాదన ఎంత! ఆ సంపాదనలో వివిధ హెడ్్ల కింద ఉన్న తగ్గింపులు, ఏవైనా
#రికవరీలు ఉంటే
అవి, మొదలైన వాటి వివరాలు ఈ బిల్లులో ఉంటాయి. మొత్తం వేతనం నుంచి
#తగ్గింపులు తీసివేస్తే
ఉద్యోగి చేతికి ముట్టవలసిన నికర వేతనం కూడా ఇందులో తెలియపరుస్తారు.
#బిల్లు తయారైన
తరవాత కార్యాలయ అధికారి లేదా ఆర్థిక అధికారి సంతకం తీసుకొన్న తరవాత ఈ
#బిల్లును అడిట్
అధికారికి గానీ వేతన కార్యాలయానికి గానీ సమర్పిస్తారు. ఇక్కడ ఈ బిల్లు
#క్లెయిమ్్ను పరిశీలించి
ఆ మొత్తానికి చెక్కు ఇచ్చే ఏర్పాట్లు చేస్తారు. ఆ తరవాత ఆ డబ్బును
#ఎవరికంత ఇవ్వాలో
కార్యాలయ అధికారి చూసి సక్రమంగా పంచుతాడు.
 ఒక కార్యాలయంలో ఎంతో మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. కొందరు
#ఒకే తరహా
ఉద్యోగం చేస్తున్నా వేతనం స్కేలు ఒకటైనా వారి జీతభత్యాలు సమానంగా
#ఉండవు. అంటే
అనుభవం వల్ల ఇంక్రిమెంట్లు, ఇతర భత్యాలలో తేడాలుంటాయి.
ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి కింది విధంగా వేతనం లభిస్తుంది.
1. మూల వేతనం.
2. కరువు భత్యం
3. ఇంటి అద్దె భత్యం.
4. సిటి కాంపెన్సేటరీ భత్యం.
 ఇవే గాక ఉద్యోగ తరహాను బట్టి కొన్ని ఉద్యోగాలకు కొన్ని
#ప్రత్యేక అలవెన్సులు,
ప్రత్యేక వేతనాలు ఇస్తూ ఉంటారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స పొందిన
#ఉద్యోగికి ప్రత్యేక
131-
ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు ఇస్తారు. అట్లాగే కొంత మంది ప్రత్యేక విధలు,
#బాధ్యతలు
నిర్వహిస్తుంటారు. వారికి ప్రత్యేక వేతనం ఇస్తారు. ఉదా:- డాక్టర్లు,
#సి.ఐ.డి.లు, స్టెనోగ్రాఫర్లు.
కొంత మంది ఉద్యోగులకు వాహన భత్యం, వినోద భత్యం కూడా ఇస్తుంటారు.
 వేతన బిల్లులో ప్రతి ఉద్యోగికి ముట్టవలసిన మొత్తాలను వివిధ
#హెడ్్ల కింద నమోదు
చేయడానికి విడివిడిగా విభాగాలు ఉంటాయి. తగిన విభాగాలను భర్తీ చేయటం
#ద్వారా
ఉద్యోగి ఆదాయ వివరాలు వివరంగా తెలపవచ్చు. దీనినే స్థూల లేదా మొత్తం
#వేతనమంటారు.
 వేతన బిల్లులో నెల నెలకు కొన్ని మార్పులు జరిగే అవకాశముంది.
#సాధారణంగా జరిగే నెల
వేతన బిల్లును గత నెల వేతన బిల్లు ఆధారంగా తయారుచేస్తారు. కాని కరువు
#భత్యం పెరగడం
వల్ల, ఇంక్రిమెంట్స్ కలవడం వల్ల, కొత్త గ్రేడ్్లో వేతన శ్రేణి స్థిరపరచటం#వల్ల, పదోన్నతి వల్ల కొన్ని
మార్పులు వస్తుంటాయి. అదే విధంగా తగ్గింపులు విషయంలో కూడా మార్పులు
#వస్తాయి. రుణాలు
తీసుకొన్నందువల్ల, అడ్వాన్స్ తీసుకొన్నందువల్ల, మెడికల్ సెలవుల వల్ల, లేదా
#అర్థ వేతన
సెలవుల వల్ల, పూర్ణ వేతన సెలవుల వల్ల, సస్పెండ్ అయినప్పుడు, సెలవు
#తీసుకోకుండా
కార్యాలయానికి రాని సందర్భాలలో వేతనాలలో తగ్గింపులు మారుతూ ఉంటాయి.
తగ్గింపులు: ఆదాయాలకు సంబంధించిన ఖాళీలు పూర్తి చేసిన తరవాత తగ్గింపుల
విభాగాలు పూర్తిచేయ్యాలి. మొత్తం వేతనంలోని తగ్గింపులను సాధారణంగా కింది
#హెడ్ కింద
చూపిస్తారు.
1. ప్రావిడెంట్ పండ్ చందా.
2. ప్రావిడెంట్ పండ్ లోంచి తీసుకొన్న రుణం.
3. ఫామిలీ బెనిఫిట్ స్కిమ్ చందా (కుటుంబ సహాయనిధి)
4. జీవిత భీమా చందా (LIC తీసుకొంటే)
5. సహకార సంఘాలకు బాకి కింద తిరిగి చెల్లించవలసిన వాయిదా సొమ్ము.
6. వివాహానికి లేదా పండగలకు తీసుకొన్న అడ్వాన్సు
7. ముందుగా వేతనం తీసుకొంటే.
8. ఉద్యోగి ప్రభుత్వగృహంలో నివసిస్తుంటే దానికి సంబంధించిన బాడుగ.
9. ఆదాయపు పన్ను.
10. ఇతర రుణాలు.
 పై విధమైన తగ్గింపులు, ఇంకా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఏమైనా
#తగ్గింపులుంటే
స్థూలవేతనం నుంచి తీసివేసి ఉద్యోగికి రావలసిన నిరకవేతనాన్ని తరవాత
#చూపిస్తారు.
(పైన చెప్పిన వివరాలతో ఒక నమూనా వేతన బిల్లు ఇవ్వడం జరిగింది.)
వేతనబిల్లు తయారీలో అనుసరించవలసిన సూత్రాలు-కొన్ని సూచనలు:
 ఒక నాలుగో తరగతి నాన్ గజిటెడ్ ఉద్యోగుల వేతన బిల్లు తయారీలో
గమనించవలసినవి.
1. నిర్ణయించిన నమూనాలో ఈ వేతన బిల్లున (డూప్లికేట్లతో సహా) తయారు
#చేయాలి.
కార్యాలయంలో ఎప్పుడు తగినన్ని ఖాళీ వేతన బిల్లు ఫారాలు ఉండాలి. ముందుగా
#ఆఫీసు కాపీ
తయారు చేసి, తరవాత అడిట్ కార్యాలయానికి పంపవలసిన ప్రతి రాయడం
#మంచిది.
2. ఒక ఉద్యోగి వేతనాన్ని ఒకటికంటే ఎక్కువ హెడ్్ల కింద చూపవలసి
#వచ్చినప్పుడు రెండు
విడి వేతన బిల్లులు తయారుచేయాలి. ఉదా:- (ఒక విభాగంలో పనిచేసే ఉద్యోగి
#నెల మధ్యలో వేరే
132-
విభాగానికి బదిలీ అయితే)
3. ఈ బిల్లులో, బడ్జెట్్లో కేటాయింపు/అమోదించిన ఉద్యోగాలన్నింటిని, ఖాళీ
#ఉన్న వాటితో సహా
తెలపాలి.
4. ఏ ఉద్యోగికైనా సంవత్సరానికి మించి జీతం చెల్లించని పరిస్థితి ఉంటే
#అతని వేతనాన్ని రెగ్యులర్
నెల వేతన బిల్లులో క్లెయిమ్్ చేయరాదు. ఇది కాలం గడిచిపోయిన బిల్లు
#కాబట్టి, ప్రధాన
కార్యాలయం నుంచి బట్వాడా మంజూరు పత్రం అందిన తరవాత ప్రత్యేక వేతన
#బిల్లు ద్వారా ఆ
ఉద్యోగి వేతనాన్ని క్లెయిమ్ చేయాలి.
5. తక్కువ షార్ట్్క్లెయిమ్ ఉన్నట్లయితే దానికి కారణాలు తెలపాలి. (అంటే
#ఉద్యోగికి చెందవలసిన
మొత్తం కంటే తక్కువ క్లెయిమ్్ చేయటం). అదే విధంగా గడిచిన నెల మొత్తం
#కంటే ఎక్కువ
క్లెయిమ్ ఉన్నట్లయితే రిమార్కులు విభాగంలో కారణాలు తెలపాలి.
వేతన బిల్లును సమర్థిస్తూ, జతపరచవలసిన ఇతర పత్రాలు: కింది పేర్కొన్న
#పత్రాలను వేతన
బిల్లుతో జతపరచాలి.
1. హజరుకాని వారి స్టెట్్మెంట్: ఈ స్టెట్్మెటంట్్లో గత నెలలో హజరు కాని
#వారి విషయాలు
ఉంటాయి. ఖాళీ పోస్టుల పేర్లు, షార్ట్ క్లేయిమ్ వివరాలు, సెలవు
#తీసుకోకుండా గైర్ హజర్.
మెడికల్ సెలవులు మొ//వివరాలు.
2. ఆఖరు వేతన సర్టిఫికేట్: (L.P.C.) ఉద్యోగి ఒక కార్యాలయం నుంచి వేరొక
#కార్యాలయానికి
బదిలీ అయినప్పుడు, ఈ సర్టిఫికేట్్ను వేతన బిల్లుకు జతపరచాలి.
3. ింక్రిమెంట్ రావలసిన ఉద్యోగులందరి పేర్లు తెలుపుతూ ఒక ఇంక్రిమెంట్
#సర్టిఫికేట్
జతపరచాలి.
4. మంజూరైన ఉత్తరాల కాపీలు, సెలవు నమోదు ఉత్తరాలు, డబ్బుగా మార్చుకొనే
#సెలవు
అనుమతించిన ఉత్తరాలు మొ//జతపరచాలి.
5. మొదటిసారిగా ఉద్యోగంలో ప్రవేశించిన ఉద్యోగికి సంబంధించిన పత్రాలన్నీ
#ఒక ప్రత్యేక వేతన
బిల్లుతో జతపరచాలి.
 వేతన బిల్లును అంకెలలో అక్షరాలలో చూపాలి. ఖాళీలు, కొట్టి వేతలు
#లేకుండా
శుభ్రంగా ఉండాలి. ప్రతి ఉద్యోగి పేరు ఎదురుగా 20 పైనల రెవిన్యూ
#బిళ్ళతో నెలాఖరుకు కనీసం
వారం రోజులు ముందుగా అడిట్ ఆఫీసులో దాఖాల చేయాలి.
 పైన వివరించిన పద్దతి గెజిటెడ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
ప్రభుత్వోద్యోగి మొదటి క్లెయిమ్్:
 మొదటిసారిగా ఉద్యోగంలో ప్రవేశించిన ఉద్యోగి వేతన బిల్లును పైన
#పేర్కొన్న విధంగానే
తయారుచేయడం జరుగుతంది. సామాన్యంగా అట్లాంటి ఉద్యోగికి ప్రత్యేక బిల్లును
తయారుచేస్తారు. కొత్త ఉద్యోగి వేతన బిల్లును పాతవాటితో తయారుచేస్తే,
#అడిట్ అభ్యంతరాలు
వచ్చినప్పుడు మొత్తం బిల్లు అగిపోతుంది కదా!
133-
అతనికి సంబంధించిన వేతనాల పత్రాలు:
1. ఉద్యోగమిచ్చినట్లు తెలిపే పత్రం.
2. ఉద్యోగంలో ప్రవేశించినట్లు ఇచ్చిన నివేదిక.
3. పుట్టిన తేదీ సర్టిఫికేటు.
4. విద్యార్హతల సర్టిఫికేట్లు.
5. కులానికి సంబంధించిన సర్టిఫికేట్లు.
6. నివాస నిర్థారణ సర్టిఫికేట్లు.
138-
chapter 19
 వేతన బిల్లు చెల్లింపు-చెక్కులు ఇవ్వడం
పరిచయం: ప్రతి ఉద్యోగి నెలాఖరున తనకు రావలసిన జీతభత్యాలు పొందుతారు.
#ప్రతి
నెలాఖరున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేతనాల చెల్లింపు జరుగుతుంది.
#ప్రతి
కార్యాలయంలోను డ్రాయింగ్ అధికారి సిబ్బంది వేతనాల బిల్లు తయారుచేసి 25వ
#తేదీ లోగా ప్రీ
అడిట్ అధికారికి అంటే జిల్లా ట్రెజరీ కార్యాలయానికి అందజేస్తాడు. ఈ ప్రీ #అడిట్ అదికారి
బిల్లులోని వివరాలన్నింటినీ పరిశీలించి డ్రాయింగ్ అధికార్ల క్లెయిమ్్లను
#అంగీకరిస్తాడు. తర్వాత
ఈ అధికార్లు డ్రాయింగ్ అధికారికి ఆ మొత్తానికి బాంకర్ చెక్కు ఇస్తారు. #డ్రాచియింగ్ అధికారి చెక్కు
సమర్పించి, డబ్బుతీసుకొని, సిబ్బందికి వేతనం బట్వాడా చేస్తాడు. ఈ
#కార్యక్రమం ప్రతినెలా
అలవాటుగా ప్రతి కార్యాలయంలో జరుగుతంది.
కళాశాలలో చెల్లింపు: మాదిరి
 చెల్లింపు విధానం: చెల్లింపు చెక్కుద్వారా కావలసిన వస్తువులు/
#కావలసిన వివరాలు.
ఎ) వేతన బిల్లు ఫారాలు.
ఏ) మూలవేతనం, భత్యాలు, మినహాయింపుల వివరాలు.
సి) వేతన బిల్లు నమోదు పుస్తంకం (కార్యాలయ రికార్డు కోసం ఈ పుస్తకంలో
#అన్ని వివరాలను రాసి
ఉంచుతారు.)
డి) మినహాయింపు స్టెట్్మెంట్్ల ఫారాలు.
ఇ) కలాలు (నలుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ సిరాలవి)
ఎఫ్) పిన్నులు, ఫైళ్ళ దారాలు.
జి) దబ్బు ఇవ్వవలసిందిగా కోరాటానికి గాను అధికారిది, అడిట్్ అధికారిది,
#చెక్కు విభాగ ఆర్థిక
అధికారిది రబ్బరు ముద్రలు.
హెచ్) అడిట్ విభాగంలో చెల్లింపు నమోదు పుస్తకం.
ఐ) డిస్పాచ్ నమోదు పుస్తకం.
జె) చెక్కు పుస్తకాలు.
కె) చెక్కులు ఇచ్చినప్పుడు నమోదు చేసే పుస్తకం.
ఎల్) చెక్కులు పొందినప్పుడు నమోదు చేసే పుస్తకం.
ఎమ్) అక్విటెన్స్ పుస్తకం.
ఎన్) 20 పైనల రసీదు స్టాంపులు.
ఒ) రబ్బరు ముద్ర పాడ్.
పి) కాలుక్యులేటర్స్.
139-
వేతన బిల్లు చెల్లింపు-చెక్కులు ఇవ్వడం.
క్యు) బడ్జెట్ కాపీ-అకౌంట్ హెడ్ వివరాలు.
ఆర్) సెలవు వివరాలు.
ఎన్) హజరు వివరాలు మొదలైనవి.
సంబంధించిన సిబ్బంది:
ఎ) గెజిటెడ్ ఉద్యోగులు
1. సొమ్ము తీసుకొనే ముఖ్య అధికారి
2. అడిట్ అధికారి (పే అడిట్)
3. లెక్కల అధికారి
4. ఆర్థిక అధికారి
నాన్ గెజిటెడ్ ఉద్యోగులు
1. లోయర్ డివిజన్ (జూ.అసిస్టెంట్లు)/అప్పర్ డివిజన్ గుమాస్తాలు
#(సి.అసిస్టెంట్లు)
అకౌంటెంట్్లు 4
2. సూపరింటెండెంట్్లు 3
3. చెక్కు రాసేవారు 1
4. ఉత్తరాలను బయటికి పంపే గుమాస్తాలు 3
5. అటెండరులు 4
 కళాశాల ప్రిన్సిపాల్, వేతన బిల్లును అడిట్ అధికారికి అందజేస్తాడు.
#వేతన బిల్లు గుమాస్తా
వేతన బిల్లు ఫారాలను అన్ని వివరాలతో నింపుతాడు. ఈ మొత్తాన్ని కళాశాల
#బడ్జెట్్కు చెందిన
మేజర్్హెడ్, వేతన భత్యాల కింద జమ కట్టవలసి ఉంటుంది. వివరాలు అంటే
#వేతనం అన్ని
వివరాలూ ఫారంలో ఉంటాయి. ఇందులో నుంచి కొన్ని మినహాయింపులు అంటే
#ప్రావిడెంట్ ఫండ్
రుణం వాయిదా, ఇతర మినహాయింపులన్నింటినీ మొత్తం వేతనం నుంచి తగ్గించడం,
#జరుగుతంది.
వేతన మొత్తాన్ని అంకెలలోను, అక్షరాలలోను చూపుతారు. ఇందు మూలంగా
#కళాశాల ప్రిన్సిపాల్
పేరిట చెక్కు ఇవ్వవలసిందిగా అడిట్ అధికారిని కోరడం జరుగుతుంది. సొమ్ము
#తీసుకొనే
అదికారిగా కళాశాల ప్రిన్సిపాల్ తన సంతకం చేస్తాడు.
 అవసరమైన వివరాలు నింపిన తరవాత ప్రిన్సిపాల్ కార్యాలయం, ఈ
#బిల్లును అడిట్
కార్యాలయానికి పంపుతుంది. అడిట్ అధికారి బిల్లును పరిశీలించి అన్ని
#సవ్యంగా ఉంటే, బిల్లును
అంగీకరించి తన సంతకం పెడతాడు. ఈ బిల్లును ఆమోదించిన తరవాత ఒక
#టోకెన్్ నంబరు ఇచ్చి
బిల్లును చెక్కుల విభాగానికి పంపుతారు. ఇక్కడ చెక్కులు రాయవలసిన గుమాస్తా
#ఇవ్వవలసిన
మొత్తానికి చెక్కులను ప్రిన్సిపాల్ పేరిట రాస్తాడు.
 చెక్కుపుస్తకంలోని ఖాళీ చెక్కును నింపి, చెక్కు ఇవ్వవలసిన అధికారి
#అంటే ఆర్థిక అధికారి
సంతకం తీసుకొని, ప్రిన్సిపాల్్కు పంపుతారు. ఈ అర్థిక అధికారి అన్ని
#వివరాలను పరిశీలించిన
తరవాతనే సంతకం చేస్తాడు. (నమూనాకు ఒక ఖాళీ చెక్కు, ఇంకొక నింపిన
#చెక్కు జతరపచడం
జరిగింది)
 ప్రిన్సిపాల్ కార్యాలయంలో చెక్కు అందగానే అందిన చెక్కుల నమోదు
#పుస్తకంలో,
అకౌంటెంట్ జరుగుతుంది. ఈ ఖాతాలో నుంచి ప్రిన్సిపాల్ వేరే సొంత
#చెక్కుద్వారా డబ్బు
తెప్పిస్తాడు. అక్విటెన్స్ రిజిష్టర్్లో ఉద్యోగి సంతకం 20 పైనల రసీదు
#స్టాంప్్పై తీసుకొని ఖాతాల
విభాగం డబ్బు బట్వాడా చేస్తుంది.
చేక్కు: చెక్కు అనేది ఒక బాంక్్ను గాని లేదా ట్రెజరీని గాని, ఒక
#వ్యక్తికి లేదా సంస్థకు గాని
140-
లేదా సొంతానికి గాని అనుకొన్న మొత్తాన్ని ఇవ్వవలసిందిగా కోరుతూ ఇచ్చిన
#ఉత్తరువు, చెక్కు ఇచ్చే
వారి పేరిట ఖాతాలో డబ్బు నిల్వ ఉన్నప్పుడు మాత్రమే ఈ చెక్కు చెల్లదు.
చెక్కు రాసే వారి బాధ్యతలు: చెక్కులో రెండు భాగాలున్నాయని చెక్కులు
#రాసే ఉద్యోగి
గమనించాలి. `ఎ' భాగాన్ని "కౌంటర్ ఫాయిల్ " అంటారు. `బి' భాగం
#ఇవ్వవలసిన వ్యక్తికి ఇచ్చే
ముఖ్యమైన భాగం.
`ఎ' భాగం (కౌంటర్ ఫాయల్)
ఎ) తేదీ
బి) వ్యక్తి పేరు
సి) ఖాతా హెడ్
డి) చెల్లింపుకు కారణం
ఇ) అంకెలలో మొత్తం
`బి' భాగం:
ఎ) తేది
బి) చెక్కు ఇవ్వబడిన వ్యక్తి పేరు
సి) అక్షరాలలో మొత్తం
డి) అంకెలలో మొత్తం
ఇ) ఖాతా హెడ్
ఎఫ్) చెక్కు ఇచ్చిన అధికారి సంతకం.
 గుమస్తా జాగ్రత్తగా మొత్తాన్ని అంకెలలోను అక్షరాలలోను తప్పులు
#లేకుండా ఒకే విధంగా
రాయాలి. అన్ని మార్పులు సరైనవని నిరూపిస్తూ ఆ అధికారి సంతకం ఉండాలి.
#చెక్కు ఇస్తున్న
అదికారి హూదా రబ్బరు ముద్ర, కార్యాలయ ముద్ర చెక్కుపైన ఉండాలి.
142-
chapter 20
బడ్జెట్ అంచనాల తయారీ
 ప్రతి వ్యవస్థ అది ఏ ప్రమాణంలో ఉన్నప్పటికి తన ఆర్థికి
#కార్యకలాపాలను సంఘటిత
పరచుకోవడానికి, రాబోయే సంవత్సరానికి గాను సాధ్యమైనంతవరకు ముందే
#బడ్జెట్ అంచనాలను
తయారుచేసుకోవలసి ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే బడ్జెట్ అంటే ఒక
#నిర్ణీత కాలానికి
(సాధారణంగా ఒక సంవత్సర కాలం) సంబంధించిన ఆదాయ వ్యయ పట్టిక.
#అందువల్ల ఇందులో
ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థకు సంబంధించిన ఆదాయ వ్యయ వివరాలు
#ఉంటాయి.
 సాధారణంగా ప్రయివేట్ రంగలలో కొన్ని వ్యవస్థలు తప్ప ప్రభుత్వ
#వ్యవస్థలకు
సంబంధించినంతవరకు ఆర్ధిక సంవత్సరం ఏఫ్రిల్ ఒకటో తేదీన మొదలై మార్చి
#31న
ముగుస్తుంది. బడ్జెట్ తయారీని సాధారణంగా రాబోయే ఆర్ధిక సంవత్సర
#ఆరంభానికి ఆరునోలల
ముందే ప్రారంభిస్తారు. ఈ విధంగా సెప్టెంబర్ మాసం నుంచే బడ్జెట్
#ప్రతిపాదనలు అంచనాలు
తయారీ ఆరంభమవుతుంది. అందుకు వీలుగా వ్యవస్థకు సంబంధించిన ఖాతాలు,
#గత
సంవత్సరపు అంచనాలు, పునరాలోచించిన అంచనాలు, రాబోయే ఆర్థిక సంవత్సర
#అంచనాలు
మొదలైన వాటినన్నిటినీ బడ్జెట్ తయారీలో పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
#ఉదాహరణకు
కాకతీయ విశ్వవిధ్యాలయాన్ని తీసుకొంటే, 1985-1986 ఆర్థిక సంవత్సరానికి
#అంచనాలు
తయారుచేయాలంటే 1983-84 ఖాతాలు, 1984-85 బడ్జెట్, అంచనాలు, 1984-
1985లోను ఆ తరవాత పునరాలోచించిన అంచనాలు, 1985-1986 సంవత్సరానికి
#బడ్జెట్
అంచనాలు అవసరమని గ్రహించాలి.
 కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించినంత వరకు, ఖాతాల విషయంలో
విశ్వవిద్యాలయానికి వచ్చే ఆదాయాల్లో విద్యార్థులు చెల్లించే ఫీజులు,
#విద్యార్థులకు ప్రభుత్వం,
ప్రభుత్వేతర సంస్థలిచ్చే స్కాలర్్షిప్్లు, గ్రాంటులు, విశ్వవిద్యాలయం
#అభివృద్ధికి వివిధ
సంస్థలిచ్చిన వ్యయాల్లో ఉద్యోగులకిచ్చే వేతనాలు, విశ్వవిద్యాలయ అధీనంలో
#ఉన్న వివిధ
కార్యాలయాల ఖర్చులు, విశ్వవిద్యాలయ అబివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల
#ఖర్చులు
మొదలైన ఉంటాయి.
 రాబోయే సంవత్సరానికి చెందిన అంచనాలు తయారుచేయడానికి వీలుగా
#సాధారణంగా
ముందుగానే గడచిన సంవత్సరానికి సంబంధించిన వ్యయవివరాలను ముఖ్యంగా
#తప్పనిసరిగా
వచ్చే ఆదాయం, ప్రత్యేకంగా వచ్చే గ్రాంటులు, తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులు
#ప్రత్యేకంగా
చేయవలసిన పనులు మొదలైన వాటినన్నింటినీ తప్పనిసరిగా పరిశీలిస్తారు. గత
#సంవత్సర
అనుభవంతో ప్రస్తుత సంవత్సరంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని,
#రాబోయే
143-
సంవత్సరపు అవసరాలను గమనిస్తూ అంచనాలను తయారుచేస్తారు. విద్యార్థుల
#ఉపయోగం కోసం
ఇక్కడ కాకతీయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 1981-82 ఆర్థిక సంవత్సర
#అంచనాలను,
మిగతా సంబంధిత వివరాలను ఈయడం జరిగింది.
149-
chapter 21
కార్యాలయాల్లో లెక్కల విధానం
 విత్తవిషయాల్లో సమగ్రత కోసం, స్పష్టమైన అవగాహన కోసం
#నిర్దుష్టమైన ఆలోచన కోసం
ఆదాయ, వ్యయ లెక్కల వివరాల నిర్వహణ విషయాల్లో అత్యంత జాగ్రత్తలు
#తీసుకోవలసి
ఉంటుంది. అంతే గాకుండా, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినంత వరకు
#ప్రతి
విషయంలోనూ జవాబు దారీగా వ్యవహారించవలసి ఉన్నందువల్ల లెక్కల నిర్వహణ
#ప్రాముఖ్యం
మరింత. అదికంగా ఉంటుంది. లెక్కల నిర్వహణకు సంబంధించినంతవరకు ప్రతి
కార్యాలయంలోనూ ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న పుస్తకాలను దృష్టిలోకి
#తీసుకోవలసి ఉంటుంది.
1. నగదు పుస్తకం
2. లెడ్జర్ పుస్తకం
3. అడ్వన్సు రిజిష్టర్
4. ఆక్విటెన్స్ రిజిష్టర్
5. చెక్కుల రిజిష్టర్
6. ఖర్చు రిజిష్టర్
1. నగదు పుస్తకం:
 వివిధ సూచికలు కింద వరుస క్రమంలో దినవారీ ఆదాయ, వ్యయ
#వివరాలను తెలిపేదే
నగదు పుస్తకం. అందులో స్పష్టంగా ప్రతి పుటలోనూ ఒక వైపు ఆదాయ
#వివరాలను మరోవైపు
వ్యవవివరాలను పేర్కొనడం జరుగుతంది. ఆదాయ వివరాలకు సంబందించినంతవరకు
#అందులో
బాంకు ఖాతా, నగదు ఖాతాలను కూడా ప్రత్యేకంగా పేర్కొంటూ, చెక్కుల ద్వారా,
#నగదు ద్వారా,
వ్యయనిర్వహణ వివరాలు నమోదు చేయడం జరుగుతంది. ప్రతి వ్యవస్థా ఈ నగదు
#పుస్తకాలను
వివిధ స్థాయుల్లో వాటివాటికి సంబంధించిన కార్యాలయంలో ప్రత్యేకంగా
#నిర్వహింస్తూ కేంద్ర స్థాయిలో
సమగ్రమైన పుస్తకాలను నిర్వహిస్తుంది. వివిధ స్థాయిల్లో కాని, కేంద్రంలో
#కాని వ్యవస్థ అంతర్గత
వ్యవహరాలకు, బాహ్యసంబంధ విషయాలకు ప్రత్యేకంగా నగదు పుస్తకాలను
#రూపొందించవచ్చు.
ఉదాహారణకు కాకతీయ విశ్వవిద్యాలయం, విశ్వవిద్యాలయపు నగదు పుస్తకమనీ,
విశ్వవిద్యాలయపు నగదు పుస్తకంలో, ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, తిరిగి
#వసూళ్లు,
మినహాయింపులు. అడ్వాన్సులు, స్కాలర్్షిప్పులు, పరిశోధనా గ్రాంటులు, బైండింగ్
#ఛార్జీలు, ప్రవేశ
పరీక్షలు మొదలైనవాటికి సంబంధించిన ఫారాలు, పుస్తకాలు అమ్మకాలు, ఇతర
#ఛార్జీలు
150-
మొదలైనవి ఉంటాయి. విశ్వవిద్యాలయేతర నగదు పుస్తకంలో వివిధ రకాల
#అడ్వాన్సులు, విద్యార్థి
సంఘాల రుసుములు. క్రీడా రుసుం, గ్రంధాలయ రుసుం, లాబరేటరీ డిపాజిట్లు,
#ప్రత్యేక
చెల్లింపులు, గుర్తింపు కార్డు, సంక్షేమ విధులు, ఇతర విశ్వవిద్యాలయేతర
#రుసుములు, చెల్లింపులు
మొదలైనవి ఉంటాయి.
2. లెడ్జర్ పుస్తకం:
లెడ్జర్ పుస్తకం సాధారణంగా వివిధ అంశాల కింద చేసే ఖర్చు వివరాలను, ఖర్చు
#సరళిని
తెలుపుతుంది. వివిద హెడ్్ల కింద, జరిగే ఖర్చును నమోదు చేసి ఒక నిర్ణీత
#కాలంలో ఖర్చు
ఎక్కువగా అవుతున్నదా, తక్కువగా అవుతున్నదా అనే వివరాలను తెలుపుతుంది.
#బడ్జెట్్లో
పేర్కొన్న విధంగానే ఒక నిర్దుష్టమైన పద్ధతిలో ఖర్చు నిర్వహించడానికి.
#లెడ్జర్ పుస్తకం
తోడ్పడుతుంది. అదే విధంగా అడిట్ పరిశీలనకు కూడా లెడ్జర్ పుస్తకం ఎంతో
ఉపయోగపడుతుంది.
3. అడ్వాన్స్ రిజిష్టర్:
 కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల వివిధ అదికారిక పనుల నిమిత్తమై,
#వివిధ విషయాల
కింద చేయవలసిన ఖర్చుల కోసం ముందే చెలిలించే మొత్తం వివరాలను అడ్వాన్సు
#రిజిష్టర్్లో
నమోదు చేయడం జరుగుతుంది. ఈ అడ్వాన్సులు పనులను బట్టి వివిధ రకాలుగా
#ఉంటాయి.
ఒకే హెడ్ కింద ఖర్చుకు తీసుకొన్న అడ్వాన్సులు లేదా వివిధ హెడ్్ల కింద
#ఖర్చుల నిమిత్తమై
తీసుకొన్న అడ్వాన్సులు మొదలైన రకాలుగా ఉంటాయి. ఈ రిజిష్టర్ ద్వారా
#ఎవరు ఏ విషయంలో,
ఎప్పుడు, ఏ ఖర్చు నిమిత్తం ఎంత డబ్బు తీసుకొని, ఎప్పుడు లెక్కలు
#చూపెట్టడం జరిగింది అనే
విషయాలను పరిశీలించడానికి వీలవుతుంది. కార్యాలయ ఖర్చును అడ్వాన్సు
#చెల్లింపులను
నిర్దుష్టం చేయడం ద్వారా నియంత్రించడానికి ఈ రిజిష్టర్ తోడ్పడుతుంది.
4. అక్విటెన్స్ రిజిష్టర్:
 వివిధ ఖర్చుల నిమిత్తం లేదా ఉద్యోగుల జీతభత్యాలు నిమిత్తం నగదు
#రూపంలో గాని, చెక్కు
రూపంలోగాని చెల్లింపుల చేసి, అందుకు సంబంధించిన వ్యక్తుల నుంచి పైకం
#ముట్టినట్లుగా ఈ
రిజిష్టర్్లో సంతకం తీసుకోవడం జరుగుతుంది. చెల్లింపు చేసిన మొత్తాన్ని
#బట్టి రిజిష్టర్్లో రెవెన్యూ
బిళ్ల పై సంతకం తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల కార్యాలయానికి సంబంధించిన
#మొత్తం
చెల్లింపుల వివరాలను పరిశీలించడానికి వీలవుతుంది. కార్యాల౟లో అందుకు
#సంబందించిన
అదికారి అనుమతి లేనిదే ఏ చెల్లింపునయినా చేయడం జరగదు. చెల్లింపులకు
#ముందే అన్ని
రశీదులు పరిశీలించి, ఇదివరకిచ్చిన అడ్వాన్సులు-చెల్లింపులను పరిశీలించి,
#బాకీల చెల్లింపులను
కూడా పరిశీలించి, ఆ తరవాత చెల్లించవలసిన మొత్తం సరిచూసి, చెల్లించే
#సందర్భంలో అక్విటెన్స్
రిజిష్టర్్లో చెల్లింపు సంతకం తీసుకోవడం జరుగుతుంది.
5. చెక్కు రిజిష్టర్:
 కార్యాలయానికి బయటినుంచి లేదా వివిధ సంస్థల నుంచి, వ఼్యక్తుల
#నుంచి వచ్చే
చెక్కులను, డ్రాఫ్టులను చెల్లింపు పత్రాలను గ్రహించి ఈ రిజిష్టర్్లో
#నమోదు చేసిన తరవాత
దినవారీ చర్యగా బాంకు ఖాతాలో జమకట్టడం జరుగుతుంది. ఆ తరవాత నుంచి
#తీసుకొన్న
రశీదును రిజిష్టర్్లో జతపరచి వివరాలను నమోదు చేస్తారు. దీనివల్ల
#కార్యాలయానికి
బయటినుంచి ఏవిషయంలో చెల్లింపులు, ఎక్కడి నుంచి వస్తున్నాయో బాంకు
#ఖాతాలో సరిగా
157-
chapter 22
 ప్రతి ప్రభుత్వశాఖకూ అందులోని వివిద కార్యాలయాలకు దైనందిన ఖర్చుల
#కోసం కొంత
అత్యవసరనిధిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బడ్జెట్్లో ప్రత్యేకంగా దీనికోసం
#కొంత
మొత్తాన్ని కేటాయించినప్పటికి అందులో ఖర్చు వివరాల నీయడం జరగదు. ఒక
#ఆర్థిక
సంవత్సరంలో ఏదైనా కార్యాలయం నగదు రూపంలో గాని లేదా అరువు
#రూపంలోగాని ఏవైనా
అత్యవసరంగా కొనుగోలు చేసినట్లియితే తగిన రశీదులను చూపించి ఖర్చు పెట్టిన
#మొత్తాన్ని ఈ
`సవివరాలతో కూడిన అత్యవసర వ్యయబిల్లు' ద్వారా పొందవచ్చు. దీనినే
#సాధారణంగా పారిభాషిక
పదజాలంలో`పుల్లీ వోచెడ్ కంటింజెంట్ బిల్లు అని పిలుస్తారు. ప్రతి
#కార్యాలయంలో ఉండే చెల్లింపు
అధికారికి గాని, కార్యాలయాన్ని బట్టి ఏదో ఒక అధికారికి బాధ్యత
#ఒప్పచెప్పడం జరుగుతుంది.
అతని అనుమతి, అంగీకారం లేనిదే అందుకు సంబంధించిన కార్యాలయంలోని
#ఏ అధికారి కూడా
ఈ డబ్బును వ్యయం చేయడానికి వీలుండదు.
 సాధారణంగా ప్రతి కార్యాలయంలో `అత్యవసర' నిధి కింద కొంత
#అడ్వాన్సు రూపంలో
అవసరమున్నప్పుడు ఉపయోగించడం జరుగుతుంది. మళ్లీ అడ్వాన్సు తీసుకోవాలంటే,
#అంతకు
ముందు తీసుకొన్న మొత్తానికి తగిన వివరాలతో, డూప్లికేటులతో రశీదులను
#జతపరిచి పై
అదికారి అమోదం కోసం ఈ బిల్లును పంపుతారు. డూప్లికేట్ బిల్లులను రికార్డు
#కోసం
కార్యాలయంలో భద్రపరుస్తారు. పై అధికారి, ఆ బిల్లును పరిశీలించి అడిట్
#చేయడం
జరుగుతుంది. అది రుణ బిల్లు అయితే చెక్కు ఇవ్వడం, అడ్వాన్సు
#తీసుకొన్నట్లయితే దానిని
సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి కార్యాలయంలోనూ క్రమంగా జరిగే
#సాధారణ
ప్రక్రియ.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్మృతి కింద అంగీకరించిన కంటింజెంట్ ఛార్జీలు:
 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్మృతిలోని ఆరో భాగంలో 94 నుంచి121 వరకు
#పేర్కొన్న
ప్రకరణాలలో కంటింజెంట్ చార్జీల గురించి వివరించడం జరిగింది. ఉదాహరణకు
#ప్రతి
కార్యాలయం తనకు కావలసిన శుభ్రపరిచే సామాగ్రి, నీళ్లాకూజాలు, పుస్తకాలు,
#సర్వీస్ స్టాంపులు
తంతిచార్జీలు, చిన్న చిన్న రిపేర్లు, విద్యుచ్ఛక్తి ఖర్చులు, రవాణా
#ఖర్చులు, మొదలైన వాటికోసం
కంటింజెంట్ బిల్లులను ఉపయోగించవచ్చు. ఇందులో బడ్జెట్ మొత్తం, వాడకం
#వివరాలు,
మొదలైన వాటిలో ఒక కార్యాలయానికి మరొక కార్యాలయానికి తేడాలుండవచ్చు.
165-
chapter 24
ప్రభుత్వ కార్యాలయంలో ఫర్నీచరు
 కొనుగోలు పద్ధతి
 ప్రభుత్వ కార్యాలయాలలో, ఇతర కార్యాలయాల మాదిరిగా కాకుండా, ఏదైనా
#ఏదైనా వస్తువులు
కొనుగోలు చేసినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. నాణ్యత,
#ధర,
నిబంధనలు మొదలైన వాటిని ముందే పరిశీలించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
#వివిధ
కంపెనీలు స్టీలు బీరువాలు తయారుచేసి మార్కెటులో ప్రవేశపెడతాయి. కాబట్టి
#అందులో
సరయిన దానిని ఎంపిక చేయడం అంత సులవైన పని కాదు.
 స్టీలు బీరువా అవసరం, కావలసిన సైజు మొదలైన వాటిని పేర్కొంటూ
#కోరుతున్న సెక్షన్
అధికారి, కార్యాలయ ప్రధానాధికారికి మహాజరు సమర్పిస్తాడు. ఆ అధికారి
#దానిని పరిశీలించి
కార్యాలయ బడ్జెట్్ను ఇతర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
#తనకధికారమున్నట్లయితే
బీరువా కొనటానికి నిర్ణయం తీసుకొంటాడు. లేదా అవసరమున్న స్థాయిలే
#ఇంకా పైఅధికారికి
పంపుతాడు. ఆ తరవాత బీరువాను కేంద్ర గిడ్డంగి సంస్థనుంచి గాని, సప్లై
#డైరెక్టర్ జనరల్
కార్యాలయం వారి నుంచి గాని లేదా వారు అమోదించిన కంపెనీ నుంచిగాని
#ప్రత్యక్షంగా
తెప్పించుకోవచ్చు. అయితే కొన్ని పరిస్థితుల్లో వాటినుంచి
#తప్పించుకోలేనప్పుడు కొన్ని
నిబంధనలను పాటించి కొనుగోలు చేయవచ్చు.
 బీరువా కొనుగోలుకు అనుమతి లభించగానే పేర్కొన్న సంస్థల నుంచి
#తెచ్చుకోవడం
సాధ్యంకాదని తేలినప్పుడు, సంబంధిత అదికారి వివిధ కంపెనీల నుంచి
#స్వయంగా కొటేషన్లను
పిలవవచ్చు. సరఫరా చేయడలచుకొన్న కంపెనీల నుంచి ముందు వివిధ
#బీరువాలకు
సంబంధించిన పూర్తిసమాచారం కోరవచ్చు. ముఖ్యంగా బీరువా పరిమాణం, ధర
#పన్నులతో సహా,
కార్యాలయానికి రవాణా చేసే పద్ధతులు ఇతర చార్జీలు, గారంటీలు, సర్వీస్,
#రిపేర్లు,
అప్పగించడానికి తీసుకొంటున్న కాలం, ధర చెల్లించే విధానం బీరువా అమోదించిన
#ప్రమాణాలతో
ఉండా మొదలైన వాటికి సంబంధించిన సమాచారం ప్రత్యేకంగా అవసరం.
#కొటేషన్్
నిబంధనలననుసరించి. ఇచ్చిన తేదీలోగా సీలు చేసిన కవర్లలో సమాచారం
#పంపిన కంపెనీ
కొటేషన్లను నిర్మయించిన సమయంలో, తేదీలో, నిర్దేశించిన అదికారులు
#కెంపెనీ ప్రతినిధులు
ముందు సీలు చేసిన కొటేషన్ కవర్లను తెరచి అందరికన్న అతి తక్కువ ధరలో
#కావలసిన
ప్రమాణాలతో సరఫరా చేసే కంపెనీ బీరువాను అమోదింంచి, ఆ తరవాత
#కొనుగోలు ఆర్డర్లు జారీ
ఉంటుంది. కొటేషన్లను తెప్పించడంలో సాధ్యమానంత వరకు సరఫరా చేసే
#అన్ని కంపెనీలకు రాసి
ప్రచారం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఏ కార్యాలయమైన తమకు కావలసిన
#వస్తువులను
ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తెప్పించుకోవలసి ఉంటుంది.
166-
chapter 25
డిగ్రీ కోర్సు మొదటి సంవత్సరంలో
చేరటానికి తీసుకోవలసిన సూచనలు
 ఏ కళాశాలలో అయినా ఏదైనా డిగ్రీ కోర్సులో చేరాలంటే `ప్రవేశానికి'
#సంబంధించిన ఎన్నొ
నియమ, నిబంధనలను ముందే తెలుసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా కావలసిన
#అర్హతల
వివరాలు, మార్కులు, వివిధ సర్టిఫికేట్ కాపీలతో అప్లికేషన్్ను గడువులోగా
#దాఖలు చేయడం,
అందుకు తగిన ప్రవేశ రుసుం చెల్లించడం రిజర్వేషన్లు, కేటాయింపులను
#పరిశీలించడం మొదలైన
వాటినన్నిటినీ తెలుసుకొని వాటి సంబంధిత నిబంధనలననుసరించి కావలసిన
#చర్యలు
తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇంటర్్మీడియట్ పూర్తి చేసిన ప్రతి
#విద్యార్థి పై చదువులకు
పోవాలంటే ఈ కింది విషయాలలో శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది.
1. ఇంటర్్లో ఏ తరగతిలో ఉత్రీర్ణమవడం జరిగింది. తనకు అందుబాటులో ఉన్న
#ఏ కలాశాలలో
చేరటానికి అవకాశముంది.
2. తనకందుబాటులో ఉన్న ఏ కళాశాలలో ఏయే కోర్సులు ఉన్నాయి. అందులో
#తానే కోర్సును
ఎన్నుకోవాలి.
3. ఏ తేది నుంచి ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తులు లభిస్తాయి. ఏ
#తేదిలోగా తిరిగి
దరఖాస్తులను అప్పగించవలసి ఉంటుంది.
4. ప్రవేశానికి సంబంధించిన నియమ నిబంధనలేమిటి? చెల్లించవలసిన ఫీజులు
#ఏమిటి?
5. దాఖలు చేసిన దరఖాస్తులపై ఎప్పుడు నిర్ణయం తీసుకొంటారు. ఎంపికైన
#విద్యార్థుల
జాబితాను ఎప్పుడు పెడతారు. సీటు వచ్చినవారు ఎట్లాంటి ఫీజులు ఎప్పటి
#వరకు చెల్లించవలసి
వస్తుంది.
6. తరగతులను ఎప్పుడు ప్రారంభిస్తారు.
 అయితే దరఖాసుల గడువు అయిపోయిన తరవాత ప్రతి కళాశాలలోనూ
#ప్రత్యేకంగా
ఏర్పాటు చేసిన `ఎంపిక కమీటీలు' దరఖాస్తులను పరిశీలించి ముందు మార్కుల
#ప్రకారం
రిజిర్వేషన్ కేటాయింపులు నిబంధనల ప్రకారం జాబితాలను ఎంపిక తయారుచేస్తారు.
#ఈ విధంగా
అన్ని స్థాయులు పూర్తయిన తరవాత బి.ఎ. మొదటి సంవత్సరం చేరే విద్యార్థుల
#జాబితాను
రూపొందించి దాని ద్వారా విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది. జాబితాలో
#ఉన్న విద్యార్థి,
బి.ఎ.లోచేరటానికి కావలసిన ఫీజులు, ఇతర ఖర్చులు పరిశీలించి అందుబాటులో
#ఉన్నట్లయితే
చేరవచ్చు. చేరేముందు అన్ని బరిజనల్ సర్టిఫికేట్లనూ పరిశీలనకు పంపవలసి
#ఉంటుంది.
సర్టిఫికేట్లు ఫీజు చెల్లింపు రశీదులు పరిశీలించి పేరును రిజిష్టర్్లో
#ఎక్కించుకోవడం
167-
జరుగుతుంది. ఆ తరవాత నిర్ణయించిన తేదినుంచి బోధన ప్రారంబమవుతుంది. ఈ
#కింది
పేజీలలో ఒక నమూనా పత్రాన్ని, ఈయవలసిన సర్టిఫికేట్ల వివరాలు ఉంటాయి.
chapter 26
వివిధ గ్రామీణాభివృద్ధి సంస్థల కార్యక్రమాల
 అభ్యర్థుల సౌకర్యార్థం దరఖాస్తు
 ప్రక్రియలు
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే
#వారికి ఉద్యోగ
అవకాశాలను పెంచి వారి ఆదాయాన్ని పెంచడానికి, పరిశ్రమల అభివృద్ధి,
#వ్యవసాయాన్ని
ఆధునీకరించడం మొదలైన ఎన్నో విషయాల్లో సహాయ, సహాకారాలందించటానికి
#ఎన్నో సంస్థలు
పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన సమగ్ర గ్రామీణాభివృద్ధి
#పధకం, జిల్లా
గ్రామీణాభివృద్ధి సంస్థ, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ, షెడ్యూల్డ్ కులాల
#సహకార ఆర్థిక సంస్థ,
వెనుకబడ్డ కులాల సహకార ఆర్థిక సంస్థ, మహిళాభ్యుదయ ఆర్థిక సహకార
#సంస్థ మొదలైనవి
ముఖ్యమైన సంస్థలు. ఈ సంస్థలు ముఖ్యంగా రుణాలు, సబ్సిడీలు, ఇతర
#ఇతర పెట్టుబడులు,
సాంకేతిక సహాయం, ముడిసరుకు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు కల్పించే
#సౌకర్యాలను పొందాలంటే,
ఒక నియమితమ౅న పద్ధతిలో దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ప్రస్తుత
#అభ్యాసంలో
రుణాలు పొందటానికి పాటించవలసిన వివిధ పద్ధతులను వివరించడం జరిగింది.
 ఏ అభివృద్ధి సంస్థ అయినా సాధారణంగా తన కార్యక్రమాలను విస్తృత
#పరచడానికి తాను
ప్రవేశపెట్టిన సౌకర్యాలను గ్రామీణ ప్రాంతాలలో నివసించేవారికి అందచేయడానికి
#ఇతర సంస్థలతో
కలిసి పనిచేయవలసి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణాధికారులు, వి.డి.వో.లు
#సమితి విస్తరణ
అధికారులు, బి.డి.వో.లు మండల రెవెన్యూ అధికారులు మొదలైనవారు,
#సహకార సంస్థలు,
వ్యాపార బాంకులు, స్వచ్చంధ సంస్థలు మొదలైన సంస్థల రుణాల పంపిణీలో
#కలిసి
పనిచేయవలసి ఉంటుంది.
 సాధారణంగా ఈ అభివృద్ధి సంస్థలన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే
#రూపొందించడం వల్ల, కేంద్ర
స్థాయిలోనే ప్రయోజనం పొందవలసిన అభ్యర్థులను గుర్తించడానికి తగిన
#సూత్రాలను వివిధ
స్థాయులలో, వివిధ సంస్థలు పాటించి అమలు పరచవలసి ఉంటుంది. అభ్యర్థుల
#నుంచి
దరఖాస్తులను సేకరించి, వారికి రుణసౌకర్యం కల్పించి, వాటిని తిరిగి అనువైన
#పద్ధతిలో వసూలు
చేయడానికి సంబంధించిన ఎన్నో సూత్రాన్నాయి.
172-
దరఖాస్తు దశలు:
 గ్రామీణాధికారులు లేదా వి.డి.వో.లు మార్గదర్శక సూత్రాల ప్రకారం
#రుణ సౌకర్యాలను
గురించి గ్రామాలలో ప్రచారం చేసి ఉద్దేశించిన అభ్యర్థులను దరఖాస్తులను
#పెట్టుకోవలసిందిగా
ప్రోత్సహించడం జరుగుతుంది. గ్రామాధికారులు, వి.డి.వో.లు అభ్యర్థులకు
#ఫారాలివ్వడం, వారి
వద్దనుంచి అవసరమైన సమాచారాన్ని సేకరించి ఫారాలు నింపడంలో శ్రద్ధ
#తీసుకొని, విస్తరణ
అధికార్ల అభిప్రాయంకోసం పంపడం జరుగుతుంది. దరఖాస్తు ఫారాలలో అభ్యర్థికి
#సంబంధించిన
పూర్వాపరాలు, కుటుంబసభ్యుల వివరాలు, విద్య, వృత్తులు, ఆదాయం, పశుసంపద,
ఇంతకుముందున్న రుణ వివరాలు, కోరుతున్న పధకం వివరాలు, ఆర్థిక సహాయం
#మొదలైన
వాటికి సంబంధించిన వివరాలు ఉంటాయి. దరఖాస్తులో పేర్ఖొన్న సమాచారమంతా
#సత్యమ఼ని,
అందుకు భిన్నంగా ఉంటే ప్రభుత్వం తీసుకొనే చర్యకు బద్ధుడనై ఉంటానని
#ప్రకటిస్తూ ప్రతి
అభ్యర్థీ చేవ్రాలు చేయవలసి ఉంటుంది.
 అభ్యర్థి స్థిరచరాస్థుల గురించి, వ్యవసాయ సంపదల గురించి
గ్రామాధికారులు నిర్ధారణ
చేసిన తరవాత విస్తరణ అధికారులు తమకు సంబంధించిన అంశాలను పరిశీలించి
#తమ
అబిప్రాయాలను వివరిస్తూ బి.డి.వో.కు సిఫారసు చేస్తారు..బి.డి.వో.లు
#దరఖాస్తును స్వీకరించి తన
అభిప్రాయంతో పాటుగా ఒక అనుమతి పత్రాన్ని జత చేసి సంబంధించిన అభివృద్ధి
#సంస్థకు
పంపుతారు. కింది స్థాయలలో దరఖాస్తులను త్రోసిపుచ్చినట్లయితే అందుకు తగిన
#కార౟౟౟ణాలు,
వివరాలు, వివరణలు ఇచ్చి అభ్యర్థుల నుంచి అవసరమైతే తిరిగి దరఖాస్తులను
#స్వీకరించవలసి
ఉంటుంది.
 వివిధ అభివృద్ధి సంస్థలు అర్వులైన అభ్యర్ధుల జాబితాలను తయారుచేసి,
#అభ్యర్థి స్థాయి,
అతని పరిస్థితి, పధకం ప్రాధాన్యతలను బట్టి, అభ్యర్థులను ఎంపిక చేయడం
#జరుగుతుంది. ఆ
తరవాత ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలను వ్యాపార బాంకులకు గాని ఇతర
#సంస్థలకు గాని
అభ్యర్థుల వివరాలు, తాము కల్పించే సబ్సిడీ, ఇతర సాంకేతిక సహాయం మొదలైన
#సమాచారంతో
పాటు పంపుతారు. దరఖాస్తు నమూనాను అనుబంధలో ఇవ్వడమైంది.
 వ్యాపార బాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వివిధ అభివృద్ధి
#సంస్థలనుంచి వచ్చిన జాబితాను
వారు కోరుకున్న పధకాల వివరాలను పరిశీలించి వాటి ప్రాధాన్యతను,
#సాధ్యాసాధ్యాలను,
నియమనిబంధనలకు లోబడి ఉందా లేదా అనే అంశాలనూ, అభ్యర్థి ఇతర
#అర్హతలను జతచేసిన
సర్టిఫికేట్లనూ, సంస్థల సిఫారసులనూ పరిశీలించి, అభ్యర్థులను రుణాలకు
#అర్హులుగా
నిర్ధారించడం జరుగుతుంది. రుణ సౌకర్యం కల్పించే ముందు మరొక్కసారి బాంకు
#లేదా ఆర్థిక
సంస్థ అధికారులు, అభివృద్ధి సంస్థ అధికారులు, క్షేత్ర పరిశీలన జరిపి,
#అభ్యర్థులతో చర్చించి,
రుణ సౌకర్యం కల్పిస్తారు.
వివిధ బాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మరొక్కసారి డబ్బును అందజేసేముందు
#తమతమ
నియమనిబంధనలను అనుసరించి వేర్వేరు ఫారాలలో అభ్యర్థుల నుంచి మళ్లీ
#వివరాలను,
అవసరమున్న చోట జామీనును, వ్యక్తిగత పూచీలను స్వీకరించి రుణ వసతి
#కల్పిస్తాయి. చివరగా
సంబంధించిన అభివృద్ధి సంస్థలోని అధికారుల నుంచి ఏ స్థాయిలో కూడా
#ఎట్లాంటి అభ్యంతరాలు
లేనట్లయితే అభ్యర్థికి డబ్బు చేతికి వస్తుంది.
 వివిధ అభివృద్ధి సంస్థల నమూనా ఫారాలను విద్యార్థుల పరిశీలన కోసం
#జరిగింది.
             0 
</p></body></text></cesDoc>