<cesDoc id="tel-w-literature-novel-swarga2" lang="tel">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>tel-w-literature-novel-swarga2.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-13</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>స్వర్గంలో బందీలు</h.title>
<h.author>శంకర మంచి పార్ధసారథి</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - Book</publisher>
<pubDate>1985</pubDate>
</imprint>
<idno type="CIIL code">swarga2</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page 33.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-13</date></creation>
<langUsage>Telugu</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fiction"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>పేజి 28
 " ఆ ఇంటాయనకి ఆవిడ విషయంలో ఎక్కడలేని సహనంవచ్చివడు
తుంది. కిరాయి కట్టకపోయినా, ఇట్లాంటిపన్లుచేసినా కిక్కురుమనడు.
వాళ్ళకి వాళ్ళకి ఏం వున్నాయో వ్యవహారాలు మనకేంతెల్సు?"
 ఛెళ్ళున కంచీతో వీపు చరిచినట్లయింది అహల్యకి. వెళ్ళినానామాటలు
అనాలనుకుంది. కాని ఏదో బలహీనత,భయం,పౌరుషాలకిపోయి విరోధాలు
తెచ్చుకుంటే ఎలాగనే ముందుచూపు-
 కాస్సేపటికి ఎవరిపన్లనో వాళ్ళు మునిగిపోయారు.
 అనంతరామయ్య మాత్రం అరుగుపైన చతికిలపడ్డాడు.
 అహల్య పిల్లవాడిని వొళ్ళోవేసుక్కూర్చునుంది. వాడికి వొళ్ళు కాలి
వోతోంది. సన్నగా మూలుగుతున్నాడు.
 శిరీష స్నానానికి తోందరపెడుతోంది-ఇంట్లో నీళ్ళులేవు. బావిలోంచి
తోడితేచ్చుకోవాలి. క్రిందికి దింపితే పిల్లవాడు ఏడుస్తాడన్న భయంతో
తను కాస్సేపు నడుం వాల్చటం తీరని అవచారం జరిగిపోయినట్లు మిగతాకాపు
రాలవాళ్ళంతా తనవైపు దోషిని చూసినట్లు చూస్తారేమోనన్న భయం ఎక్కువగా
అనిపిస్తోంది.
 "ఈ పూటకి తడిగుడ్డతో మొహం తుడుచుకుని వెళ్ళమ్మా-నీళ్ళు లేవు"
అంది కూతురితో.
 "స్నానం చేయకుండా నేస్కూల్ కెళ్ళను"
 "మీరంతా నాప్రాణాలు తియ్యటానికి పుట్టుకొచ్చారు. ఈ వెధవపిల్లలు
పుట్టకుండావుంటే ఏటో ఒకవైపు పారిపోయుండేదాన్ని"
 కోపంలో అలా అన్నదేకాని పరిస్థితులపైన, కట్టుబాట్లపైన తిరుగు
బాటు చేసేందుకు కావలసినంత ధైర్యమనేఇంధనం తనవద్ద లేదని ఆమెకి
బాగాతెల్సు.
 పిల్లవాడిని క్రిందికిదింపి శరీషని చూస్తుండమని చెప్పి బక్కెటు
తీసుకుని బావి వద్ద కెళ్ళింది.
 వర్ధనమ్మ రొప్పుతూ నీళ్ళు తోడుకుంటోంది-వెనక నరసమ్మ
తయారుగా నిల్చుంది.
 అహల్య తనవంతుకోసం ప్రక్కగా నిల్చుంది.
 అంతలో శిరీష పెద్దగ అరిచింది.
 పేజి 29
 "అమ్మా తమ్ముడు బిగుసుకుపోతున్నాడే" అని
 అంతే. అహల్య బక్కెట్టుని అక్కడేవదలి రెండంగల్లో ఇంట్లోకొచ్చి
పడింది.
 జ్వరతీవ్రతచేత బలహీనంవల్ల బాబిగాడు బిర్రబిగుసుకు పోతున్నాడు.
గుడ్లుతేలేసి నల్లబడిపోయేడు. గుప్పెడులు గట్టిగాపట్టి పళ్ళకరుచుకుం
టున్నాడు.
 అహల్య ఘొల్లుమంది. పిల్లవాడిని చేతిలోకి తీసుకుంది "ఒరే
బాబూ-ఏవిట్రా-ఏవైపోతున్నావురా-నన్ను నువ్వూ అన్యాయంచేస్తావుట్రా"
 అనంతరామయ్య, ఆవెనక నకసమ్మ వచ్చారు.
 వర్ధనమ్మ మాత్రం చెక్కు఼చెదరకుండా నీళ్ళు తోడుకుంటోంది.
 అహల్య పిల్లవాడిని చేతిలో పుచ్చుకని ఘొల్లుఘొల్లున ఏడుస్తోంది.
 తల్లికొంగు పుచ్చుకుని భయంపల్ల శిరీషకూడా ఏడుపు మొదలెట్టింది.
 అనంతరామయ్య పిల్లవాడిని చూసి పెదవి విరిచి "ఎందుకైనామంచిది
ఇలా బయటికి తీస్కురామ్మా" అన్నాడు.
 దాంతో అహల్యకి గుండె ఫెడీల్ మని బ్రద్దలైంది.
 "ఒరే-బాబిగా నీకు కడుపునిండా పాలుగూడాపట్టలేకపోయాను.
నేనే చంపుకున్నారా-నిన్ను-పాపిష్టిదాన్నిరా"
 అంతా అయిపోయినట్లే చివరి ఏడుపుఏడుస్తోంది.
 సరిగ్గా అప్పుడే నరసమ్మ అనంత఼రామ఼య్యని ప్రక్కకినెట్టి ముందుకొచ్చింది
ఆమె చేతిలోని పిల్లవాడిని తన చేతుల్లోక్ తీసుకుని, ఒక్కక్షణం నిదానించి
చూసి, వాడ్ని భుజాన వేసుకుని చరచరా బయటికొచ్చింది.
 అహల్య ఏడుపువిని అక్కడ ప్రోగైన మిగతాకాపురాలవాళ్ళంతా ఆశ్చర్యంగా
చూడసాగేరు.
 ఆమె పిల్లవాడినలాగే భుజాన వేసుకుని వీధిలోకి వెళ్ళింది.
 అహల్య ఏడుస్తూనే ఆమెననుసరించింది.
 నరసమ్మ సరాసరి అక్కడ్నించి నాలుగిళ్ళవతల కొత్తగా బోర్డుకట్టిన
డాక్టరుదగ్గిరకెళ్ళింది.
 ఆ డాక్టరుపేరు సుధీర్. ముపైసంపత్సరాలపైగా వయసుంటుంది.
పావురాయిరంగు ప్యాంటులోక఼ి తెల్లసిల్కుషర్టునిదోపేడు-మెళ్ళో పాములా
వ్రేలాడుతున్న స్టెత్-నొక్కులనొక్కులజుట్టు గాలికిమొహంపైపడి విచిత్రంగా
కదుల్తున్నాయ్. ఎత్తు,దానికితగ్గలావు,విశాలమైన మొహం,దాంట్లో ఎదుటి
వారిని ఆకట్టుకునేవర్చస్సు-వీటన్నిటికిమించి విశాలమైన ఛాతీనికప్పిన
చర్మం క్రిందుగా కష్టాలని,కన్నీళ్ళని,దైన్యాన్ని,నిస్సహాయతని,చూసి
స్పందించే చిన్న గుండె-
 నింపాదిగాచూస్తే పైకి కన్నించే ఆకర్షణలు, పరిచయం పెంచుకుంటే
పైకి కనిపించని ఆకర్షణలు కనిపించితీరతాయ్.
పేజి 30
 నరసమ్మ, అహల్య వచ్చిన సందర్భం వీటన్నిటినిగమనించే వీలున్నది
కాదు కాబట్టి గమనించటం కుదురిందికాదు.
 వస్తూనే నరసమ్మ చేతిలో కొయ్యిముక్కలావున్న పిల్లవాడిని అక్కడ
బల్లపైపడుకోపెట్టి - "త్వరగా చూడండి -సమయం మించిపోతోంది" అంది
ఆదుర్దాగా.
పేజి 30
 సుధీర్ పిల్లవాడి నాడి, కళ్ళు పరీక్షచేసి, ఏదో అర్థమైనట్లు ఒక్క
పరుగులో లోనికెళ్ళి సిరంజీలోకి మందునెక్కించి, తెచ్చి,ఇంజక్షన్ చేసాడు.
 ఆశలేని ఆహల్య ఏడుస్తూనే వుంది.
 శిరీష ఏడుపుమాని నరసమ్మ ప్రక్కగానిలబడి డాక్టరువంక బాబిగాడి
వంక మార్చిమార్చి చూస్తోంది.
 ఇంజక్షన్ ఇవ్వటం అయ్యాక సుధీర్ ఆ బల్లప్రక్కనే మ్రోకాళ్ళపై
కూర్చుని పిల్లవాడి అరికాళ్ళు బలంగారుద్దుతూ-"ఎవరిపిల్లాడు-వయస్సెంత?"
అనడిగాడు.
 దానికి నరసమ్మే బదులిచ్చింది. "అదిగో వాళ్ళబ్బాయ్-రెండుమూడే
ళ్ళుంటాయ్-జ్వరతీవ్రతవల్ల వచ్చిందంటారా?" అనడిగింది.
 కాని అతను ఆ మాటలు వినిపించుకోనట్టు "ఇంతకుమునుపెన్నడైనా
ఇలా వచ్చిందా"అనడిగాడు.
 నరసమ్మ అహల్యవంక ప్రశ్నార్థకంగా చూసింది.
 ఆమె బదులిచ్చేలోపునే శిరీష "అబ్బే లేదండి-ఇదే ఫస్టుటైం" అంది
వ్రేళ్ళుత్రిప్పుతూ.
 సుధీర్ నవ్వేడు. అరికాళ్ళు రుద్దటం ఆపి పిల్లవాడివంక చూసేడు.
పేజి 31
 బాబిగాడి మొహంలో చావు చీకటి క్రమక్రమంగా తప్పుకుని యదా
స్థితికి వస్తున్నాడు.
 సుధీర్ లేచి నిల్చున్నాడు. నుదుటపట్టిన చమటల్ని చూపుడు వేలుతో
సుతారంగా తొలగించి లోనికెళ్ళాడు.
 బాబిగాడు మెల్లిగా కళ్ళు తెరిచాడు.
 నరసమ్మ అక్కడే నేలపైని చతికిలపడి ఏడుస్తున్న అహల్యతో "నీ కొడుక్కి
గండంతప్పింది. కళ్ళు తెరిచాడు -ఇలావచ్చి వాడిప్రక్కనకూర్చో" అంది.
 అహల్య ఒక్కవుదుటున పరిగెట్టుకొచ్చి పిల్లవాడిని చేతిలోకి తీసుకుని
గుండెలకద్దుకుంది.
 శరీష అక్కడ్నించి కదలి లోనికెళ్ళింది. సుధీర్ సిరంజీని వేడినీటితో
శుభ్రం చేస్తున్నాడు.
 శిరీష బుద్ధిగా ఒక్కప్రక్కనే చేతులుకట్టుకు నిలబడి అతడి చర్యలని
అత్యంత ఆసక్తిగా చూస్తోంది.
 "నీపేరేమిటి?" అడిగాడు సుధీర్ నవ్వుతూ.
 "శిరీష"
 "అబ్బో-చాలా చక్కని పేరే-ఎవరు పెట్టారు అమ్మా-నాన్నా?"
 "మా అమ్మ-"
 "అని నీకెలా తెల్సు?"
 ధైర్యం చిక్కిన అహల్య అక్కడకూర్చునే వాళ్ళిద్దరిసంభాషణని
ఆలకిస్తోంది.
 శిరీష రెండు క్షణాలు ఆలోచించి "మానాన్నకి క్యాంపులెక్కువ.
రోజూ ఇంటికి రాడు. అందుకని అమ్మే పెట్టుంటుంది" అంది.
 బయట్నించి అహల్యకూతుర్నిరమ్మనిపిలిచింది. కానిశిరీషకదలిందికాదు.
 సుధీర్ తిరిగి సిరంజీలోకి మందెక్కిస్తున్నాడు. అది చూసి శిరీషకి
భయం అన్పించింది "మళ్ళీ ఇంజక్షనా-ఎవరికి?"
 "ఈసారి-నీకు-" అన్నాడు టించర్ లో తడిపిన దూది ముక్కని
అందుకుంటూ.
పేజి 32
 శిరీష భయంతో బయటికొచ్చేసింది.
 బయటికొచ్చినడాక్టర్నిచూసి అహల్య పిల్లవాడినిపట్టుకుని లేచినిల్చుంది.
ఆమెని కూర్చోమని చెప్పి, రెండో ఇంజక్షన్ గూడాచేసేడు. చేస్తున్నప్పుడు
ఒక్కక్షణం పరీక్షగా ఆమెవంక చూసేడు.
 దేవాలయంలో ప్రతిష్టకై కష్టపడిచెక్కిన అమ్మవారి విగ్రహాన్ని చివరి
క్షణంలో మనసు మార్చుకుని వీధిలోక఼ి గిరాటేసినట్లు వెలాతెలాపోతున్న
ఆమెని పరీక్షగా చూసేడు.
 బరువైన ఆమె కనురెప్పలక్రింద, ఆమె మ్రోస్తున్న బరువులు, కళ్ళ
క్రింది చారల్లో మాడి మసైపోయిన ఆమె ఆశలు, మెళ్ళో బుసకొడుతున్న
పసుపుతాడు, వదనంలో జీవితం గురించిన ఆదుర్దా భయాలు, చిరుగులు,
పడుతున్న చీరె, అన్నిటిని క్షణంలోనే చూసేడు.
 అతడికేదో అర్థమైంది.
 మనసుపెట్టి సాటిమనిషిని చూడగల్గితే అన్నీ అవలీలగా అర్థమవుతాయ్-
 విచిత్రంగా, విరుద్దంగా ఆ క్షణంలో అతడికి ఆమెపైన కొండంత గౌరవం
కల్గింది-
 ఇంజక్షన్ ఇవ్వటంవల్ల బాబిగాడు ఏడుపు మొదలెట్టాడు.
 అహల్య కూర్చున్నదల్లా లేచి నిలబడి వాడ్ని భుజాన వేసుకుంది.
 ఇంజక్షన్ ఇవ్వటంవల్ల బాబిగాడు ఏడుపు మొదలెట్టాడు.
 "బాబు చాల బలహీనంగా వున్నాడు. జ్వరంగూడా బాగా వుంది. టెంపరేచర్
తగ్గటానికి మాత్రలిస్తాను. మళ్ళీ రేపు తీస్కురండి-జ్వరం పూర్తిగాతగ్గేక
ఎగ్జామ్ చేసి టానిక్కులు,కాప్యిల్సు వ్రాసిస్తాను" అంటూ లోనికెళ్ళి చిన్న
పొట్లంతెచ్చి ఆమెకందించేడు.
 అహల్యకి అప్పుడుగాని నరసమ్మ వెళ్ళిపోయిన సంగతి గమనించిందికాదు.
భక్తుడి ఆర్తనాదంవిని పరిగెట్టుకొచ్చి, పని పూర్తికాగానే అదృశ్యమైన
దేవుడిలా నరసమ్మ చెప్పాపెట్టకుండా జారుకుంది.
అహల్యకి పెద్ద సందిగ్ధపరిస్థితి ఎదురైంది-డాక్టరుఫీజు-ఎంతివ్వాలి అనికాదు
ప్రశ్మ-ఎలా ఇవ్వాలి అనేది సమస్య. ఏంచెప్పకుండా వెళ్ళిపోతే అనాగరికంగా
అసహ్యంగా వుంటుందేమో......
పేజి 33
 సుధీర్ చేతులుకట్టుకుని ఆమెవంక తదేకంగ్ చూస్తున్నాడు. ఆమెలో
జరుగుతున్న అంతర్యుద్ధం అతడికర్థమైంది.
 కాని అతడలాచూడటాన్ని ఆమె మరోలా అర్థంచేసుకుంది.
 "మాఫీజు ఎంతో చెబితే రేపొచ్చినపుడు ఇస్తాను" అంది తలదించుకుని.
 అతడు చిత్రంగా నవ్వి- " బాబుని ఇంకోక్షణం ఆలస్యంగాతెచ్చుంటే
నేనూ ఏఁచెయ్యలేకపోయేవాడిని-అదృష్ట దురదృష్టాలపైన నాకంతనమ్మకం
లేదు. స్వశక్తిపైన,కృషిపైన గొప్పనమ్మకం. మీరు థాంక్సు చెప్పినా అది
నాక్కాదు. ఆ పిల్లవాడిని ఇక్కడికితేవాలన్న వుద్దేశ్యంపుట్టిన ఆముసలావిడకి
చెప్పండి. ఇహ నా ఫీజంటారా-నేవైద్యంచేసేది డబ్బుకోసంకాదు. అలాగని
అందరికి వుచితంగాచెయ్యనుకొంతమందికి-మీలాంటివాళ్ళకి సహాయంచేస్తే
నాకదేతృప్తి. మరణశయ్యపైకెక్కినపుడు మనిషికి మిగిలేవి వెచ్చటి
జ్ఞాపకాలు,అనుభూతులేకదండి"
 అహల్య అతడివంక రెప్పవాల్చకుండా చూస్తూ అతడుమాట్లాడే ప్రతి మాటా
శ్రద్ధగా వింటోంది-
 "ఆరోగ్యవిషయాంలో ఎప్పుడూ అశ్రద్ధచెయ్యకండి-జీవితంలో దేనివిలువైనా
మనిషికి పోగొట్టుకున్నాకగాని తెలీదు. నన్నడిగితే చక్కటి ఆరోగ్యాన్ని
మించినసంపదలేదంటాను. రేపు అశ్రద్ద చెయ్యకుండాపిల్లవాడినిపట్రండి"
 అహల్య కదలి గుమ్మంవైపుగా వెళ్ళింది. తల్లివెనుకనే వెళ్ళబోతున్న
శిరీషని రెక్కపుచ్చుకునాపి "నువు మాత్రం నాకు ఫీజివ్వాలి. నిన్నొదల్ను"
అంటూ మ్రోకాళ్ళపైకూర్చుని మొహాన్ని ఆమె దగ్గరగా వుంచేడు.
 " అబ్బో నాకుతెల్సు-మా బళ్ళో అపర్ణవాళ్ళనాన్నగూడా అచ్చం
ఇలాగే అంటార్ట-అప్పుడది-ఇలా " అంటూ సుధీర్ బుగ్గపైనిముద్దెట్టి,
"ఇలా చేస్తేనే వాళ్ళ డాడి వదిలిపెడతార్ట. కాని మా నాన్న ఎప్పుడూ
అడగడు. ఎప్పుడూ క్యాంపులే"
 ఆమె వాగ్థోరణికి అడ్డువేస్తున్నట్లు అహల్య విసుగ్గా "పదపదస్కూలుకి
వేళయింది" అంటూ బయటికెళ్ళింది. శిరీష వెడుతూనే నిశ్శబ్దంగా గాల్లో
చేతినూపి తల్లిననుసరించింది.
పేజి 34
 అహల్య సగందూరంవెళ్ళి అప్రయత్నంగా వెనక్కితిరిగిచూసింది.
 సుధీర్ అక్కడే గడపలో నిలబడి చూస్తుండటం గమనించి కంగారు
కంగారుగా నడకవేగాన్ని పెంచింది.
 *** *** ***
 ఇంటికొచ్చేసినా అహల్య పన్లుచేసుకుంటోందేగాని, ఆ డాక్టరుగంభీర
మైన రూపం,మనస్సునితాకిన మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయ్.
 శిరీ౟ష స్కూలుకెళ్ళింది. మందుప్రభావంచేత బాబిగాడు నిద్రపోతున్నాడు.
అహల్యకి కాస్సేపటికే ఒక విషయం అర్థమైంది. అతడి మాటలు,రూపం
తనకి తెలీకుండానే, తన ప్రయత్నం లేకుండానే తనపైన ప్రభావం వేసాయ్.
స్పందనలు, లేక,బాధ,ఆవేదనల్లాంటి కిలుంపట్టిన మనస్సుకికాస్త పదును
పట్టినట్లు,మెరుగు వచ్చినట్లు......
 కాని వెనవెంటనే......
 ఛఛ-ఏవిటీ అప్రాచ్యపు ఆలోచన్లు తనెవరు-ఇల్లాలు-ఒక మగాడికి
భార్య-పసుపుతాడుకట్టించుకుని సమాజంలో పవిత్రమైన స్థానాన్ని సంపాదించు
కున్న మహాఇల్లాలు, ఇలా అసహ్యంగా ఇంకో మగాడి గురించి తప్పు... పెద్ద
తప్పు....
 కాని మనసు గ్రాయికంరాని పిల్లవాడితంతు పిల్లవెధవని రెండ్రోజులు
తిండిపెట్టకుండా ఎండగడితే,మూడోనాడు ఎదురింటికెళ్ళి చేయిచాపుతాడు.
కడుపుకాల్తున్఩వాడికదితప్పుకాదు. కడుపునిండినపెద్దలకది తప్పు.
 పెళ్ళయ్యాక మమతానురాగాలు, అనునయం, ఆప్యాయతలెరుగని అహల్య
మనస్సు కడుపు నకనకలాడుతోంది. దానికేదోకావాలి, వివాహం అదివ్వలేక
పోయింది. శరీరానికి హద్దులున్నాయ్. ఆంక్షలున్నాయ్. కాని మనసుకి లేవు
దాన్ని జయించటం అందరివల్లా అయ్యేపని కాదు. ఏ కొద్దిమందో వాళ్ళని వ్రేళ్ళ
పైని లెక్కించపచ్చు. విచిత్రంగా చాలామంది తాము మనసుని జయించేసామని
అపోహపడతారు. వాళ్ళకితెలీదు దాన్ని జయించటంఅనరు. పీకనొక్కి చంపెయ్యటం
అని అలా చంపేసుకున్నవాళ్ళ భౌతికప్రపంచంలో ప్రసిద్దులవుతారు.
 "అమ్మాయ్ నీకోసం ఎవరో కార్లోవచ్చారు చూడు" అనంతరామయ్య
గడపలోంచి గంట కొట్టినట్లు అంటున్న ఆ మాటతో అహల్య వులిక్కిపడి
ఆలోచన్లోంచి తెప్పరిల్లింది."
పేజి 35
 తనకోసరం వచ్చేదెవరు?వస్తే కిరాణాషాపువాడో,బియ్యం షాపువాడో
అయ్యుంటాడు. అంతకుమించి తనకోసం వచ్చేదెవరు౟?
 కాని గడపలోవున్న అనంతరామయ్య మొహం భక్తి గౌరవాలతో గంభీరంగా
వుంది. అప్పులవాళ్ళు తనింటికొచ్చినపుడు ఆయన చిరునవ్వుతో చిద్విలాసాన్ని
ప్రదర్శిస్తూ తమాషాగా చూస్తుంటాడు.
 ఆరోజు రమ వస్తానని చెప్పిన సంగతి తెల్లవార్లు గుర్తుంచుకుని, బాబి
గాడి గాభరాలో మస్తిష్కంలో మరుగున పడిపోయింది.
 అహల్య లేచి బయట కొచ్చి చూసింది.
 రమ అప్పటికే కారుదిగి నిల్చునుంది. ఎటువెళ్ళాలో,ఏంచెయ్యాలో తెలీనట్లు
అయోమయంగా చూస్తోంది. ప్రపంచాన్ని అర్థంచేసుకున్న ఆమె అనంతరామయ్య
ఇంటిముందర అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళనిచూసి నోరు వెళ్ళబెట్టి నిల్చుండి
పోయింది.
 ఆమె కారుదిగగానే గేట్లో ఎదురైంది వర్థనమ్మ మొగుడు. అతడిని అహల్య
ఇల్లెక్కడని అడుగుతుంటే అనంతరామయ్య స్పష్టంగా విన్నాడు. మరుక్షణం
ఆవార్తని అహల్య చెవినవేసి, ఆపైన రమ అందానికి ఆశ్చర్యపోతూ తెరమీది
బొమ్మలా ఫ్రీజయిపోయాడు.
 రమ అడిగిన ప్రశ్న విన్నవర్థనమ్మ఼మొగుడు ఆమెవంక ఒక్కక్షణంచూసి
"నాలాంటి మహానటుడ్ని పట్టుకుని అడగవలసిన ప్రశ్నఇదేనా"అన్నట్లు
కోపంగా, బాధగా సమాధానం చెప్పకుండానే హరిశ్చంద్ర నాటకంలో కాటి
సీనులోని పద్యాన్ని సన్నగా పాడుకుంటూ వెళ్ళివోయేడు.
 ఏంచెయ్యాలోతెలీక అలా రమనిల్చుండగా అహల్య బయటికొచ్చింది. ఆమెని
చూడంగానే ఆరోజు ఆమెవస్తానని చెప్పినసంగతి క్రితంరోజు జరిగిన సంగతులు
ఒక్కసారిగా గుర్తుకొచ్చినాయ్ అహల్యకి.
 "అలానిల్చుండిపోయావేమే లోపలికిరా" అంటూ ఆహ్వానించింది.
 రమ నిల్చున్న చోట్నించికదిలి లోనికొస్తోంది.
 ఆమె తెల్లటి సిల్కు చీరెకట్టుకుంది. దానిమీద జరీపూవులు అందంగా
నైపంగా అల్లబడివున్నాయ్. తెల్లటిపిస్త్రీ స్లీవ్ లెస్ బ్లౌజ్. దాంట్లోంచి
స్పష్టంగా కనిపిస్సున్న నల్లరంగు బ్రా,కాళ్ళకి ఖరీదైన చెప్పులు ఆమె అలా
నడిచి వస్తుంటే రమలాలేదు. ఆకాశపు అంచుల్లోంచిదిగి నడిచివస్తున్న
రతీదేవిలా అప్సరసలావుంది.
పేజి 36
 ఆమె గేటుదాటి లోపలికొస్తూనే "ఇదేంఇల్లేబాబూ ఆ వోనరెపడో ఒక
సారి చూపించు ఓ నమస్కారం పెడతా" నంది.
 సరిగ్గా అదే సమయానికి అనంతరామయ్య ప్రీజులోంచి రిలాక్సయ్యి
"నేనేనండి యజమానిని" అన్నాడు చాలా నమ్రతగా.
 అతడి వ్యాపారధోరణికి ముచ్చటపడి చేతులెత్తి నమస్కరించింది.
 అనంతరామయ్య మొహమాటంతో మెలికలుతిరిగిపోయేడు. తిరిగి అతడు
తేరుకుని చూసేసరికి రమని అహల్య లోనికితీసుకెళ్ళింది, అతడు ద్వారం
ప్రక్కనే జవానులాగా జపమాల త్రిప్పుతూ నిల్చుండిపోయేడు.
 లోపలికి అడుగుపెట్టిన రమ ఆ గదిని, పరిసరాలనీ, వస్తువుల్ని పరీ
క్షగా అటూ ఇటూ తిరిగి చూస్తోంది.
 "అసలు నువ్వొస్తావన్నమాటే మర్చిపోయాను. ప్రొద్దున పిల్లాడికి వాతం
కమ్మి హడావుడి పెట్టేడు. దాంతో నామనసు మనస్సులో లేకుండాపోయింది.
ఇలా కూర్చో" అంటూ చెక్కకుర్చీని తెచ్చి ఆమె ప్రక్కగా వుంచింది.
 కాని ఆమె కూర్చోలేదు. బాబిగాడి మంచంవైపుగా వెళ్ళి నిద్రపోతున్న
వాడిపైకి వొంగి పరీక్షగా చూసి "ఇప్పుడెలావుంది?" అనడిగింది.
 "డాక్టరు వద్దకి తీసుకెళ్ళాను ఆయనెవరో చాలామంచివాడు. దేవుడిలా
పిల్లావాడిని దక్కించేడు. అలానిల్చుండిపోయావ్ కూర్చోవే"అంది మళ్ళీ.
 "పిల్లాడు అంత బలహీనంగా వున్నాడేమే. తిండి పెట్టటంలేదా అంత
పొదువు పనికిరాదమ్మా కాస్త తింటూ వుండాలి" అంది చలోక్తిగా.
 అహల్య అదోలానవ్వి " ఎంతలిన్నా వాడంతే నా పోలికొచ్చింది" అంది
సమర్థింపుగా.
 రమ మిత్రురాలివంక చిలిపిగాచూస్తూ" నీపోలికేంకాదు-ఇద్దరుపిల్లలు
పుట్టినా పుష్టిగా పెళ్ళికానిపిల్లలా వున్నావ్" అంది ఆమె చూపులు అహల్య
గుండెలపైన,నడుంపైన గుచ్చుకుంటున్నాయ్.
పేజి 37
 "సర్లే-అన్నీ రౌడీమాటలు నువ్వూను. ఇంకాఅప్పటి ధోరణిమారింది
కాదు" అంది అహల్య బాబిగాడి మంచంపైని కూర్చుంటూ.
 రమ కుర్చీలో కూర్చుంది.
 "అవునూ-మీవారు అప్పుడే ఆఫీసుకెళ్ళిపోయారా-ఏఆఫీసులోపని-
ఆఫీసరా" అనడిగింది ఆసక్తిగా.
 "ఇన్సూరెన్సు కంపెనీలో ఆఫీసరు ఎప్పుడూ ఆఫీసుధ్యాస తప్ప వేరే
వ్యాపకమే వుండదాయనకి, అద్సరే ఈ వూరొచ్చి ఎన్నేళ్ళయిందే" సంభాష
ణని ఇంకోవైపు మళ్ళిస్తున్నట్లుగా అడిగింది అహల్య.
 "మూడేఴళ్ళయింది. అవునే మీ ఇంట్లోవాళ్ళు అప్ఫుడు నిన్ను `చిన్నా'
అని పిల్చేవాళ్ళు కదూ! నేనూ అలాగే పిల్చేదాన్ని గుర్తుందా"
 "అవును ఇప్పటికి మావాఴళ్ళంతా `చిన్నా' అనే అంటారు"
 రమ ఆసక్తిగా చిన్ననాటి ప్రశ్నలు పరంపరగా అడిగేస్తోంది.
 "ఇపుడు విజయవాడలో మీవాళ్ళెవరయినా వున్నార్టే. కృష్ణలంకలో
ఆయిల్లు,ఆడాబా,ఆసాయంకాలాలు, ఆచల్లగాలులు, ఆ సంభాషణలు ప్చ్-
ఏవిటోనే ఆరోజులే ఎంతో బాగున్నాయో అనిపిస్తుంది అప్పుడప్పుడు.
 "మా నాన్నగారు పోయారు, అమ్మమంచంలోవుంది అన్నయ్యదగ్గర.
ఆ ఇల్లు నాన్నపోగానే అమ్మేసారు ఇప్పుడక్కడ ఎవ్వరూలేరు. అప్పుడప్పుడు
అనిపిస్తుంది. ఒక్కసారి విజయవాడవెళ్ళి ఆరోడ్లు, మనస్కూలు మనం చదు
కున్న క్లాస్ రూంలు, ఆ మాష్టర్లు అన్నిటిని చూసి రావాలనిపిస్తుంటుంది"
 " అయితే నీకూ అనిపిస్తుంటుందన్నమాట. ఒక్క నాకేనేమో ఆ పిచ్చి
అనుకున్నా ఒకసారి నువ్వూ నేనూ అంతే. ఈపిల్లల్ని మీవారికప్పచెప్పెయ్యి
ఇద్దరంవెళ్ళి రెండ్రోజులుండి విజయవాడఅంతా చెడతిరిగివద్దాం. ఈమధ్యనోసారి
మద్రాసునించి వస్తూ అక్కడ దిగి కొన్ని గంటలున్నానంతే అబ్బోచాలా మారి
పోయింది. వూరేకాదు మనుషులుకూడా. సిటీ వాతావరణం వచ్చేసింది.
ఒసేచిన్నా నీకు గుర్తుందా?"
 రమ తనమనస్సులో ఇన్నాళ్ళు భద్రపరుగుకున్న చిన్ననాటి తీపిగుర్తుల
తాళపత్ర గ్రంధాన్ని తెరచి చదువుకుంటోంది.
పేజి 38
 "ఏమిటి?"
 "అదేనే మన క్లాసులో వెనకబెంచీలో పడుకుని గురకపెట్టినిద్రపోమే
వాడు, ఆకుర్రాడు. ఆ అబ్బాయిపేరు ..... ఆ రామలింగేశ్వర్రావు. లావుగా
నల్లగా బొగ్గుబస్తాలా వుండేవాడు"
 "అవున్లే-ఇంతకీ అతడికేమైంది?"
 "అబ్బే ఏంకాలేదే. ఒకసారి బొంబాయిలో కనిపించాడు.
 "బ్యాంకులోఆఫీసర్ట-పెద్దజీతంట. నేగుర్తుపట్టిపలకరించానుగాని అతడికి
గుర్తు రావటానికి చాలాసేపుపట్టింది. మిమ్మల్నెక్కడా చూసినట్లులేదండి
అన్నాడు స్వచ్చమైన తెలుగులో-అవున్లే నువు స్కూల్లో మెళుకువగావున్న
దెప్పుడు,ఇపుడు బ్యాంకులో గూడా నిద్రపోతున్నావా అని జోగ్గా అడిగేసాను.
ప్రక్కనున్న అతడిభార్య నవ్వేసిందిగాని, అతడేవన్నాడో తెలుసా?""
 "ఏవన్నాడు-కోపగించుకున్నాడా"
 "అబ్బేలేదే మనం అనుకున్నట్టే అన్నాడు. ఏవిటోనండి ఆరోజులే
హాయిగావుండేవి. కడుపునిండాతినొచ్చి, కంటినిండా నిద్రపోయేవాడిని.
ఇ఼ఇప్పుడేవిటో సంపాదించుకుంటున్నా మ఩శ్శాంతిలేదు-విచిత్రంగా ఇపుడతనిక఼ిి
ఇప్పుడోవిటో సంపాదించుకుంటున్నా మనశ్శాంతిలేదు-విచిత్రంగా ఇపుడ
తనికి రాత్రిళ్ళు నిద్రపట్టదుట. డాక్టరు అదేదో జబ్బన్నాట్ట. మందులువాడు
తున్నాట్ట, మొగల్రాజపురంకొండలావుండేవాడా- మెగలిపొత్తులా చిక్కిశల
మైయేడు-కాని జీవితం భలే చిత్రమైందికదా"L
 "అబ్బ చాలా విషయాలు గుర్తుంచుకున్నావే వాడెవడో నాకింతపరకు
నిజంగా గుర్తురానేలేదు"
 "అవునే నాకదేవిటో ఫోటో తీసినట్టు అన్నీ అలా గుర్తుండిపోతాయ్
ఆ స్కూలు,ఆ మాస్టర్లు, వాళ్ళని మనం ఎలా ఏడిపించేవాళ్ళం, ఆ మొగ
పిల్లలు, మీ ఇల్లు, మీ అమ్మగారు ఆవిడ ఆప్యాయత, మా అమ్మ, ఆవిడ
అవసలు, నాన్న రాక్షసత్వం...."ఆమె గొంతుక్కేదో గతకాలపుచేదుగుర్తు
గరాళంలా అడ్డుపడింది. మాట ఆగిపోయింది. కళ్ళు తడి అయినాయ్.
 అహల్య విచిత్రంగా ఆమెవంక చూసింది. మనిషికి సంపద, స్పందన
రెండూ వుండవని, ఏదో ఒకదాన్తో రాజీపడాల్సి వుంటుందని ఆమెనమ్మిక.
 "ఇపుడు మీ అమ్మగారెక్కడుండే?" అనడిగింది అనునయంగా రమని.
పేజి 39
 రమ కళ్ళు సిల్కు కర్చీఫ్ తో సుతారంగా అద్దుకుని"అన్ని కష్టాలనుభ
వించి ఏ ఆడది ఎన్నాళ్ళు బ్రతికుండగలదే ఎప్పుడోపోయింది అదేనాబాధ.
పాపిష్టినాన్న బ్రతికున్నాడు. ఆవిడ బ్రతికున్నంతకాలం ఇంటికిరాక,తిండి
పెట్టక జీవితాన్ని దుర్భరంచేసి చంపేడు. అలాంటివాడు నిక్షేపంలావున్నాడు.
దేవతలాంటి అమ్మ పోయింది-"
 "మీ నాన్న ఎవరివద్దవుంటున్నాడు?"
 "ఇరవైనాలుగ్గంటలూ తాగుతూ, చేసిన తప్పుల్ని మత్తుమాటున మర్చిపోవా
లని చూస్తున్నాడు. ఆ వుంచుకున్నదాని పంచన పడుంటున్నాడు."
 అహల్య ఏంమాట్లడకమౌనంగా వుండిపోయింది. మధనపడే మనస్సుకి
మౌనం ఒకమందు.
 కాస్పేపటికి రమ తేరుకుని చిరునవ్వుతో "నీతోచెప్పుకోవాల్సినవిచాలా
వున్నాయ్ కాస్త కాఫీ అన్నా పెట్టియ్యవే తాగుతూ మాట్లాడుకుందాం" అంది.
 ఆమాట వినగానే రమ రాకలోని మాధుర్యం చప్పున చల్లారిపోయినట్లని
పించింది. అహల్యకి తన చీకటి సంసారం ఎక్కడ బహిర్గతమవుతుందోనని
భయపడింది.
 "అయ్యో!ఈ నెలసరుకులు అదేవిటో అప్పుడే అయిపోయినాయ్. కాఫీపొడి,
పంచదార లేదే అందితలొంచుకుని బాధని, భయాన్ని ఆమెనించిదాస్తున్నట్లు.
 "రమ ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. "పోనీ ప్లాస్కుగానీవుందా"
అనడిగింది హోటల్నించి తెప్పించే వుద్దేశ్యంతో.
 "లేదే!నిక్షేపంలాంటిది మొన్నే పిల్లపగులగొట్టింది"
 రమ ఇంకేదో అనేలోపున ద్వారం ప్రక్కననిల్చున్న అనంతరామయ్య తల
లోనికిపెట్టి "ఫ్లాస్కు నాదగ్గిరుందమ్మా" అనటం మాయమవటం ఇంకోక్షణంలో
ఫ్లాస్కుని భుజానపేసుకుని గడపలోనిల్చుని "ఎన్నికాఫీకావాలి" అని
అడుగుతున్నాడు.
 రమకి ఒక్కక్షణం అనుమానంమేసింది. వీడునిజంగా ఇంటి యజమానా లేక
అహల్య భర్త ఆఫీసు బంట్రోతా అని మరుక్షణం అనంతరామయ్య సైకాలజీ
అర్థంచేసుకోగలిగింది. ఆమెకది పెద్దకష్టమైన విద్యేంకాదు. అర్థంచేసుకున్నాక
ఆడించటం ఆమెకి గొప్ప సుఴళువు.
పేజి 40
 " అహల్యకేమధ్యలో ఇబ్బందిగావుంది. ఆమెవచ్చింది తనింటికి కాఫీ
ఇవ్వాల్సిన బాధ్యత తనది. తనదగ్గరేమో డబ్బుల్లేవు అందుకే వూరుకుంది కాని
వచ్చిన అతిథేకాఫీకావాలని అడిగింది ఇంటియజమాని బజారెళ్ళి తెస్తానంటు
న్నాడు. వాడికేమో అద్దెడబ్బులే఼ఇంతవరకు ఇవ్వలేదు చొరవగా మీడబ్బులతో
తెమ్మంటే ఏవంటాడో,అలాకాక రమచేత ఇప్పిస్తే ఏంబాపుంటుంది?"
 అహల్య ఇంకా ఆలోచిస్తూనేవుంది రమ పర్సుతీసి ఇరవైకాగితంతీసి
ఆయనకందిస్తూ "మిమ్మల్ని శ్రమపెడుతున్నాం నిజానికి కార్లోవెళ్ళిరావచ్చుకాని
చిన్నాకొడుకు నిద్రపోతున్నాడు అంచేత"
 ఆ మాటలకి అనంతరామయ్య నొచ్చుకున్నాడు.
 "అలా అనకండి-మీరేంనాకు పరాయివాళ్ళా, అహల్యనాకు మరదల్లాంటిది
నువు అహల్యకి అక్క౟఼య్యవి. ఇందులో పరాయివాళ్ళెవరు-ఆడబ్బువుంచండి
ఆహల్యపరిస్థితి నాకు తెలీందేంకాదుగా, ఆపిల్లని అవస్థపడనిస్తానా క్షణంలో
తెస్తా కాఫీ" అంటూ గేటుదాటి రోడ్డెక్కాడు.
 ఆయనటువెళ్ళగానే రమ స్నేహితురాలివంక అనుమానంగాచూసింది.
ఆమె తనవద్దనుంచి ఏదో దాస్తోందని అర్థమైంది. కాకపోతే ఆయన " అహల్య
పరిస్థితి నాకు తెలీందేంకాదుగా" అనెందుకంటాడు?
 "చిన్నా-నిన్నోమాటడుగుతాను నిజం చెపుతావా" అంది రమ అనునయంగా
 "ఏవిటే అది అడిగెయ్యి దానికి సందేహం దేనికి?"
 "చిన్ననాటి స్నేహానికి బలం ఎక్కువంటారు. ఆ స్నేహంతో,చను
వుతో అడుగుతున్నాను. ఏం అనుకోకు. నిజంగా మీవారు ఆఫీసరేనా
నిన్ను బాగా చూసుకుంటాడా"
 అహల్య ఆమెవంక అయోమయంగా చూసింది. " ఎందుకలా అడుతున్నావ్.
నేను ఆఫీసరుపెళ్ళాంలాలేననా-ఇల్లు ఆఫీసరుగారిఇల్లులా లేదనా
అంతేనా?"
 "అవునే నేనేది నాలో దాచుకోలేను క్షమించు. నువ్వు ఆఫీసరుభార్య లాగా
లేవు సరికదా, నిన్ను చూస్తుంటే చాలా దారుణమైన, దీనమైనస్థితిలో వున్నావని
పిస్తోంది. చిన్నా! నీ బాధేవిటో చెప్పవా? చెప్పకూడనిరహస్యమా"
 ఆకాశం నల్లని మబ్బులతో నిండున్నపుడు చల్లనిగాలివీచటంతప్పు.
చల్లగాలినితాకి ఆ మేఘాలు కుంభవృష్టినికురిపిస్తే వాటినినిందించటం సరికాదు.
కష్టాలతో, దైన్యంతో కరుడుగట్టిపోయిన అహల్య మనస్సు స్నేహితురాలి చల్లని
అనునయానికి కరగకుండా వుండలేకపోయింది.
పేజి 41
 అహల్య పమిట అడ్డం పెట్టుకుని దుఃఖించటం మొదలెట్టింది. మెల్లగా
మొదలైన ఆ దుఃఖం కట్టలుతెంచుకుని, ఎన్నో ఏళ్ళుగా ఆమెలో గూడుకట్టుకున్న
బాధని కడిగేసేటంతగా మారింది.
 రమ కుర్చీలోంచిలేచి ఆమెకి దగ్గరగా వచ్చి భుజంచుట్టూ చెయ్యివేసి
ఆమెని సముదాయించాలని ప్రయత్నిస్తోంది.
 అహల్య వెక్కి వెక్కి చిన్నపిల్లలా ఏడుస్తోంది.
 సరిగ్గా ఆసమయంలోనే అనంతరామయ్య కాఫీతెచ్చేడు లోనికిరాబోయి
అక్కడి వాతావరణం గంభీరంగా వుండటంచేత గడపలోనేనిల్చుండిపోయేడు.
 రమ వెళ్ళి ప్లాస్కు అందుకుంది. లోనికెళ్ళి దాన్లోకాఫీని మూడుగ్లాసులలో
పోసి,ఒకగ్లాసుతెచ్చి గడపలో నిల్చున్న అనంతరామయ్యకి అందించింది.
 ఆయన దాన్నందుకుంటూనేమర్యాదకి "అబ్బే నాకెందుకమ్మా ఇప్పుడే
తీసుకున్నా" అంటూనే గ్లాసునందుకున్నాడు గ్లాసందిస్తూ రమ కావాలనే తన
చేతిని అతడిచేతికి తాకించింది.
 అనంతరామయ్య శరీరంలో నిద్రపోతున్న ముసలినరాలు జివ్వున కదిలాయి.
 "అహల్యా నేను స్నేహితులం. ఒకేవూరివాళ్ళం ఒకేస్కూల్లో చదూకున్నాం
నిన్న అనుకోకుండా రోడ్డుపైకలిసేం అదీ చాలా సంపత్సరాలతర్వాతతీరుబడిగా
కబుర్లు చెప్పుకుందామని ఇలావచ్చేను. నేనూ ఈవూళ్ళేనేవుంటాను.
 అనంతరామయ్య ఆమె చెపుతున్న ప్రతిమాటా చాలా భక్తిగా వింటున్నాడు
మధ్యమధ్యలో కాఫీని చప్పరిస్తున్నాడు.
 "అహల్యకి మీరు బాగాకావలసినవాళ్ళేనన్నమాట. ఇంతగొప్ప స్నేహితురాల్ని
పెట్టుకుని అంతలా అపస్థలు పడటం ఏంబాగాలేదు. మీరొచ్చేరుగాఇహ నాకేం
దిగుల్లేదు"ఇన్నాళ్ళు ఆమెభారాన్ని తనేమోసినవాడిలా గొప్పగా అన్నాడు.
పేజి 42
 అహల్య ఏడుపుని సంభాళించుకుంది. కళ్ళు తుడుచుకుంది.
 రమ ఖాళీప్లాస్కు తెచ్చి అనంతరామయ్యకిచ్చి అతడిచేతిలోని గ్లాసు
నందుకుంది.
.
 ఆమెవుద్దేశాన్ని అర్థంచేసుకుని " వస్తానమ్మా నాకు పన్లున్నాయ్.
ప్రక్కనే నేనుండేది వెళ్ళేటప్పుడొసారి వచ్చివెళ్ళండి మాఇల్లూ చూద్దురుగాని
 రమ అలాగేనన్నట్లు అలవోకగా నవ్వింది. ఆనవ్వుని తల్చుకుంటూ
నాలుగు సంవత్సరాలు బతికెయ్యగలడు. అంతగొప్పగా నవ్వింది.
 అనంతరామయ్య వెళ్ళిపోయేడు.
 రమ లోనికొచ్చి రెండుగ్లాసుల్లోను, ఒకటి అహల్యకందించి "ఈకాస్త
కాఫీ త్రాగు. కష్టాల్లోంచి కాపాడేది కన్నీళ్ళుకావు ధైర్యం ఒకానొకప్పుడునేనూ
నీలాగే ఏడుస్తూ నిద్ర, తిండి లేని ఎన్నో చీకటి రాత్రిళ్ళు గడిపాను.
ఎవ్వరూ
నన్నోదార్చలేదు.కన్నీళ్ళు తుడవలేదు. నాకునేనే ధైర్యం చెప్పుకున్నాను.
అసలీ మనుషులే అంత కష్టాల్లో వున్నప్పుడు కల్సిరారు, సుఖాలలోవున్న
ప్పుడు మాత్రం భాగంకావాలంటారు మొన్నేమయిందో తెలుసా?"
 అహల్య కళ్ళు ఎర్రగా కుంకంపూవుల్లాగా వున్నాయ్. గ్లాసులోనికాఫీని
కాస్త కాస్త చప్పరిస్తూ రమ చెపుతున్నకబుర్లని శ్రద్దగా వింటోంది. ఆమె
రాకతో తనకేదో ధైర్యంవచ్చనట్లనిపించింది అహల్యకి- "ఏవైంది" అనడిగింది
ఆసక్తిగా,
 "నాల్రోజులనాడు మానాన్నవచ్చాడు నా అడ్రస్సు ఎలా సంపాదించాడో
గాని మొత్తానికివచ్చాడు ఆరోగ్యంపాడైంది ఆపరేషన్ చేయించుకోవాలి
అయిదువేలిమ్మని కూర్చున్నాడు"
 "ఇచ్చేవా?"
 "లేదు-పైగా ఆపరేషన్ చేయించుకుని బతికి ఇంకెంతమంది బ్రతుకులు
పాడుచెయ్యాలని అడిగేను. నీకు అనారోగ్యం అదృష్టంలాంటిది త్వరగా చని
పొమ్మని సలహాగూడా ఇచ్చేను. ఏడ్చి పెడబొబ్బలు పెట్టాడు. బయటికి
గెంటి తలుపేసాను."
 పేజి 43
 "అలా ఎందుకుచేసావే ఎంతైనా తండ్రికదా" అంది అహల్య నొచ్చు
కుంటున్నట్లు.
 " అయిదువేలు నాకోలెక్కలోనికికావు. ఇవ్వొచ్చు. కానీ వయసులో
వున్నప్పుడు తన సుఖం తనుచూసుకుని భార్యాపిల్లల్ని తిండిపెట్టిక,వాళ్ళ
గురించి పట్టించుకోక అమ్మనిచంపేసిన ఆహంతకుడికి డబ్బులెలాఇచ్చేది.
నాకు మనుసొప్పలేదు"
 అహల్య చేతిలోగ్లాసు క్రిందవుంచుతూ అతి సహజంగా అంది.
 "ఇప్పుడు నేనూ మీ అమ్మ పరిస్థితిలోనే వున్నానే"
 "చిన్నా!" రమ నమ్మలేనట్లుగా అరిచింది.
 " అవునే ఇందాక నీకష్టమేమిటని అడిగావుకదూ ఇంకేంఅడక్కు.
అప్పుడు మీఅమ్మ ఎన్నెన్ని కష్టాలనుభవించిందో తెల్సుగా వాటికి రెట్టింపు
అనుభవిస్తున్నాను. పిల్లవాడికి రోగంపస్తే మందిప్పించటానికి డబ్బుల్లేవు
తింటానికి తిండిగింజల్లేవు,చెప్పుకోటానికి మనుషుల్లేరు"
 "నిజంగా మీవారు ఆఫీసరేనా?"
 "ఆఫీసరేకాని ఏమిటి లాభం. బతక఼ని బిడ్డ బారెడని"
 "అంటే వేరే ఇంకెవరితోనైనా...."
 "వాళ్ళాఫీసులో పన్చేసే దాంతో వుంటార్ట"
 "అంటే అస్సలు ఇంటివైపేరాడా, కావలసినవన్నీ తెచ్చిపడెయ్యడా?"
 "ఆ సుగణం వుంటే ఇక నాకుబాధేముంది?ఎప్పుడో ఆయనకి బుద్ది
పుట్టినపుడు వస్తుంటారు. అదికూడా నాపైన, పిల్లలపైన ప్రేమతోకాదు. నేనే
దైనా కానిపని చేస్తున్నానేమోనని వింక్వయిరీకి"
 "ఆ వచ్చినపుడు నిలదీసి అడగవా నాగతి, నాపిల్లల గతి ఏంకానని
నిగ్గదీయవా?"
 "అలానిగ్గదీసి అడిగితే మళ్ళీ ఈఛాయలక్కూడా రారేమోననిభయం
అందుకే బతిమాలుకుంటూ కాళ్ళావేళ్ళా పడతాను. అంతకన్నా నేనేం చెయ్య
గలను చెప్పు"
 రమ రెండుక్షణాలు మౌనంగా కూర్చుంది. ఆపైన అన్నది "చిన్నా
నేనోమాటడుగుతాను చెపుతావా? నువ్వూస్త్రీవే అవతల నీమొగుడు వుంచు
కున్నదీ స్త్రీయే. అది మగాడిని కట్టెయ్యగలిగింది. నువ్వెందుకు చెయ్యలేక
పోతున్నావ్ ఎప్పుడన్నా఼ఆలోచించావా?"
పేజి 44
 అహల్య అక్కసుగా అంది" శరీరాన్ని,అందాన్ని అడ్డం పెట్టుకుని
బతకేవాళ్ళకి ఆ రహస్యాలు,చిట్కాలు తెలుస్తాయ్ కానిమనకెలా తెలుస్తాయ్
తెల్చినా ఆ పన్లు మనం చెయ్యలేంగదా"
 వెంటనే రమ బదులిచ్చింది"బహువచనం వుపయోగించి, నన్ను నీ
జాబితాలో వేసుకోకు నేనెవరికి భార్యనుకాను"
 "అంటే పెళ్ళే చేసుకోలేదా. మరైతే నిన్న నీతోపాటు కార్లోవున్న
అతను ...."
 రమ తాపీగా చెప్పింది "మొగుడు కాదు. భర్తంటే అర్థం భరించేవా
డయితే ప్రస్తుతం అతడేభర్త. కాని కేవలం పసుపుతాడు ముళ్ళేసిన వాడే
భర్తంటే మాత్రం అతను నా మొగుడుకాడు"
 ఆహల్యలో క్షణంక్రితంలేని భయంమొదలైంది. ఈమాట చుట్టుపక్కల
ఎవరైనా వింటే ఏవనుకుంటారు?తనపరువేంగాను?
 "ఏవిటే ఆలోచిస్తున్నావ్ భయంగావుందా?"
 "అబ్బే అదేంకాదు పోనీ అతడ్ని చేసుకోలేకపోయేవా?"
 "చేసుకుందామనే అన్నాడు కాని నాకేఇష్టంలేకపోయింది. తాళికట్టించు
కుని బానిసలా పడుండటం నాకిష్టంలేదు. నాకు స్వేచ్ఛకావాలి స్వాతంత్ర్యం
కావాలి. ఇంకో విషయం అప్పుడే మొగాడుభయభక్తులతో పడుంటాడు. తాళి
కట్టించుకుంటే తలపైకెక్కి కూర్చుంటాడు."
 "కావచ్చు నీకు రక్షణేది. బ్రతుక్కు గ్యారంటీ ఏది?అతడిక్కావలసింది
నీవద్దవున్నంతకాలం నీ చెప్పుచేతల్లో పడుంటాడు. ఆ తర్వాత నీగతేంగాను?"
 రమ చిలిపిగా నవ్వింది-
 చిన్నా!నువు సాంప్రదాయ ప్రకారం తాళికట్టించుకుని ఒక బడుద్దాయికి
భార్య వయ్యావు. నాకు వుంటున్ననవ్నీ ఇప్పుడు నాకున్నాయా?"
 కంచీతో చెళ్ళున చరిచినట్లు అడిగిన ప్రశ్నకి ఏంబదులివ్వాలో అర్థం
కాలేదు ఆహల్యకి కాసేపు
పేజి 45
 "ఇవన్నీ లేకపోయినా నలుగురిలో నాకు పరువుంటుంది. అదిచాలదా?"
అంది చూపుల్ని బాబిగాడిప౅కి తిప్పుతూ.
 రమ గంభీరంగా అంది"ఆత్మని చంపుకోవటం వ్యభిచారం కన్నా
అసహ్యమైనపని అసలునన్నడిగితే వ్యభిచారం తప్పుకాదంటాను."
 అహల్య భయంగా స్నేహితురాలి వంకచూసింది.
 "నీకో విషయం చెపుతా. నేను మద్రాసులో వుంటున్నప్పుడు ప్రక్కభాగంలో
మీనాక్షని ఒక ఇల్లాలుండేది. మొగుడు పెద్ద ఆఫీసరు లక్షణమైన సంసారం నాతో
కలివిడిగా, స్నేహంగా వుండేది. అరమరికలులేకుండా అన్నీ చెప్పేది. వాళ్ళా
 యనకి సెక్సుధ్యాస చాలాతక్కువట దగ్గిరకొస్తే అతగాడి దగ్గర అసహ్యమైన,
భయంకరమైన దుర్వాసనవస్తుంటుందిట. మరెలా భరిస్తున్నావ్ అనడిగితే ఏం
బదులిచ్చిందోతెలుసా?"
 "ఏవన్నది-తాళికట్టించుకున్నాకతప్పదుగదా-అనా"
 "కాదు-ఆ కాస్సేపు -కొద్దిక్షణాలు,ఎదురింటిమేడపైని స్టూడెంటు
కుర్రాణ్ణి తల్చుకుంటూ అన్నిటిని భరిస్తుందిట......దీన్నేవంటారు మీసంసారుల
భాషలో"
 అహల్య ఇష్టంలేట్లు అసహ్యంగా మొహంపెట్టి- "పోన్లేవే-ఇంకేవన్నా
కబుర్లు చెప్పు-"
 రమ ఆమె మాట పూర్తికాకుండానే "ఇవ్వన్నీ నేనుచేస్తున్నపనిని
సమర్థించుకోటానిక్కాదుచెప్పేది. వ్యభిచారాల్లో చాలారకాలున్నాయని, కేవలం
శారీరక వ్యభిచారాన్ని మాత్రమే తప్పుపట్టి వాళ్ళని వెలివెయ్యటం తప్పంటాను.
దేవుడు ఒక్కోమనిషికి ఒక్క అవకాశం ఇస్తాడు. చక్కటి గొంతుకున్న గాయకు
రాలు కచేరీలుచేసి సంపాదించటలేదా? తెలివితేటల్ని,చదువుల్ని అడ్డం
పెట్టుకుని ఆడవాళ్ళు సంపాయించుకోవటంలేదా?నటనా సామర్థ్యంవున్న
వాళ్ళు నటించి బతకటంలేదా? మరి అలాంటప్పుడు అందంగావున్న ఆడది
దాన్నడ్డంపెట్టుకుని బతికితే తప్పేమిటంటాను?"
 ఆమె వాగ్ధోరణికి ఆహల్య చాలా ఆశ్చర్యపడి, కాస్త భయపడింది కూడా
ఆమె ఏదోఅనబోయినంతలోనే రమ మళ్ళీమాట్లాడటం మొదలెట్టింది-
 "అసలు నేనిలా తయారవటానిక్కారణం ఎవరోతెల్సా ఓ మగాడు
నమ్మి చెడిపోయిన వాళ్ళుండరంటారు కాని ప్రపంచంలో పతితురాలనిపించు
కున్న ప్రతి ఆడది నమ్మిచెడిందే. అందుకే నాకు మొగాళ్ళంటే కసి,పగ,
ద్వేషం అన్నీను వాళ్ళని నాచుట్టూ తిప్పుకోవాలని,నా చెప్పుచేతల్లో వుంచేసు
కోవాలని అనుకున్నాను సాధించాను ఎంతటిమొగాడైనా తలుపుగడియపెట్టేక
నా సర్వెంటు.ఏంచెయ్యమంటే అది చేస్తాడు. కాళ్ళుపట్టమంటే మహదానం
దంగా చేస్తాడు.బయటి ప్రపంచానికి అతడు పెద్దప్రభుత్వ అధికారి కావచ్చు
సినిమా నిర్మాతో,నటుడో కావచ్చు. ప్రజానాయకుడు కావచ్చు, పులిలాంటి
పోలీసు ఆఫీసరు కావచ్చు. కాని నాకునాలుగ్గోడలమధ్యన ఆకాస్సేపు నాబానిస
భృత్యుడు,పెంపుడుజంతువు నాకాపవరుంది కాని నీతాళికాపవరుందాఅహల్యా
పేజి 46
 అహల్యకి పౌరుషం ముంచుకొచ్చింది "లేదు. వుండాలనిగూడా మేం
అనుకోం. భర్తంటే దేవుడిక్రిందలెక్క ఆయన్ని పూజించుకుంటాం."
 రమ పగలబడి పెద్దగానవ్వింది "ఎంత అమాకత్వంలోవున్నావే!భర్తని
దేవుడని భావించి నువ్వుపూజిస్తానంటే, ఆదేవుడు ఇంకో ఇల్లు చూసుకుని
వెళ్ళిపోయాడు. అక్కడ సేవలందుకుంటున్నాడో,చేస్తున్నాడో ఆ అస్సలుదేవుడికే
తెలియాలి"
 సరిగ్గా అదేసమయానికి నిద్రపోతున్న బాబిగాడులేచి ఏడుపుమొదలెట్టాడు.
అహల్య కూర్చన్నదల్లాలేచి వాడ్ని భుజానవేసుకుని గదిలో పచార్లుచేస్తోంది.
 రమ చటుక్కున వెళ్ళి ఆమంచంపైన వెల్లకిలా పడుకుని రెండుచేతుల్ని
తలక్రింద పెట్టుకుని పైకప్పు వంకచూస్తూ-
 "అవునే చిన్నా అసలుపెళ్ళంటే ఏవిటే?" అనడిగింది
 శిరీష స్కూలునించి వచ్చేపేమిటంటాను?"
 ఆమె వాగ్ధోరణికి ఆహానేవుంది.
జ్వరం తగ్గినట్లుగాలేదు. సాయంత్రం గూడా ఒకసారి డాక్టరుకి చూపిస్తే?
ఆలోచించుకుంటున్న అహల్యకి స్నేహితురాలి ప్రశ్న అర్థంకాక కాస్తచిరాకుని
తెప్పించింది." పెళ్ళంటే ఏమిటేవిటి నీమొహం ఆడా,మగల దాంపత్య జీవితానికి
మొదటిమెట్టే వెళ్ళంటే"
 రమ చెప్పటం మొదలెట్టింది.
 "పెళ్ళంటే ఒక వొప్పందం, ఆడదానిక్కావలసిన తిండి,బట్ట,వసతి,రక్షణ,
గౌరవం వగైరాలు అందిస్తానని మొగాడు-అతడిక్కావలసినసుఖాన్ని సంతోషాన్ని,
అందించి,అతడితోనే జీవితాంతం వుంటానని ఆడది పెద్దమనుషుల ముందు
(బంధుమిత్రులు) ప్రమాణంచేసి ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దాన్ని
ఎగ్రిమెంటు, కాంట్రాక్టు అందాం, బయట ఓ ఇద్దరివ్యక్తుల మధ్యనైనా ఏదైనా
ఒప్పందంకుదిరితే ఎగ్రిమెంటు వ్రాసుకుంటారు. కాని పెళ్ళికి అటువంటి
రాతకోతలులేవు కాబట్టి మతాన్ని, సాంప్రదాయాల్ని; ఆచారాలని గూడా
పట్టుకొచ్చి తాళిబొట్టుకట్టే విధానాన్ని ఏర్పాటుచేసేరు. ఁఅంటే తాళిబొట్టు
ఎగ్రిమెంటు డాక్యుమెంటులాంటిది"
పేజి 47
 అహల్య పచార్లాపి నిల్చుండిపోయి తదేకంగా ఆమె వంకే చూస్తోంది.
రమకింత విశ్లోషణాశక్తివుందనిగాని, ఇన్ని విషయాలు తెల్సనిగాని ఆమె
వూహించిందికాదు పైగా ఆమె చెపుతున్న విషయంగూడా తనకి చాలా
ముఖ్యమైనదిగాను, అన్పించి చాలా ఆసక్తిగా వినసాగింది.
 ఆమెలో ఆసక్తినిగమనించి రమ మరింతవుత్సాహంగా చెప్పుకుపోతోంది.
"అలా ఒప్పందం కుదుర్చుకన్న ఇరుపక్షాల్లో ఏపక్షంవాళ్ళు దాన్ని అతిక్రమిం
చినా రెండోవారికి అతడిపై చర్యతీసుకునే అధికారంవుంది. కావాలంటే
ఆ కాంట్రాక్టుని రద్దుచేసుకునే అధికారం గూడా వుంటుంది. కాని వివాహ
విషయంలో ఆ సదుపాయం లేదు. ఇపుడు నీ భర్తేవున్నాడు. మీరిద్దరూ చాలా
పవిత్రంగా అగ్నిముందు,పెద్దలముందు ప్రమాణాలుచేసేరు. కాని అతడు
ఆ వప్పందాన్ని వుల్లంఘించి, నీకు తిండి,బ఼ట్ట, రక్షణ,సుఖం ఏదీ ఇవ్వక
తను మాత్రం వాటన్నిటిని బ౟యటెక్కడో అనుభ౟ిస్తున్నాడు. ఇపుడు నీ
పరిస్థితేమిటి?అతడు నీ మెళ్ళోవేసిన ఆ లైసెన్నుబిళ్ళలాంటి తాళికి విలువే
మిటిస?అతగాడు దేవుడెలా అవుతాడు? నీపిల్లల భవిష్యత్తుమాటేవిటి?
ఆరోజు మీ వెళ్ళినాడువచ్చి అక్షింతలేసిన ఆపెద్దలుండి ఏవిటి వుపయోగం?
అయినా ఇంకా అతడే దేవుడనినమ్మి మూర్ఖంగా కూర్చోటం చీకటిగదిలో
కూర్చుని భగవద్గీతకోసం వెదుకులాడినట్లుంది. చీకట్లోవున్న మనిషికి
కావలసింది వెలుగు-గీతలు,రామాయణాలు కావు.
 ఆమె చేవుతున్న ప్రతిమాటా యధార్థమని అహల్యకి తెల్సు. కానిపైకి
వొప్పుకోటానికి ఏదో పిరికితనం, భయం నరాల్లో జీర్ణ్ంచుకున్న సాంప్రదా
యాలమత్తు....
పేజి 48
 " నువ్వే నా పరిస్థితిలోవుంటే ఏంచేసేదానివి?" అనడిగింది అహల్య
రమని
 రమ పడుకున్నదల్లా లేచికూర్చుంది. సూటిగా అహల్యవంకచూస్తూ-
"ఏవిటన్నావ్ నేనునీస్థితిలో వుంటేనా అస్సలు నాకీ పరిస్థితే ఏర్పడేదికాదు.
కారణం మొగాడ్ని ఎలాఆకర్షించాలో, ఆపైన ఆకర్షణమాటున కట్టిపడేయ్యాలో
నాకుబాగాతెల్సు ఆడదానికి కావలసింది పతిభక్తికాదు ఆకర్షణశక్తి భూదేవితో
ఆడవాళ్ళనెందుకు పోలుస్తారో తెల్సా భూదేవిలా ఆకర్షణశక్తిని పెంచుకుని
బతికిబాగుపడమని. ఁఅంతేగాని సహనంఅని, నాఖర్మ, ప్రారబ్ధమని కూర్చున్నా
వంటే చివరికి నీకు పిల్లలికి మిగిలేది శూన్యం"
 "నన్నేంచెయ్యమంటావ్ చెప్పు"
 కాలంమారింది. కాలంతోపాటు మగవాడి ఆలోచనా ధోరణిగూడా
మారింది దానికి తగ్గట్టు ఆడదికూడా పద్దతుల్ని ఆలోచనలని మార్చుకోవాలి
అంతేకాని సీతనిప్పుల్లో దూకిందికాబట్టి నేనూ పతివత్రనేకాబట్టి నేనూ
నిప్పుల్లో దూకుతానంటే మాడిమసైపోతావ్. అది సత్యకాలం, పురాణ
కాలం. ఇది పిదపకాలం, పైత్యకాలం" ,
 "సరేలేవే ఇంతకీ నన్నేంచెయ్యమంటావ్?"
 "నిన్నేంచెయ్యమంటానో నేచెప్పను. కాని ఇందాకనువ్వన్నట్లుగా నీ
స్థానంలో నేనుంటే ఏంచేసుండోదాన్నో మాత్రం చెపుతాను.
 అని రమ సన్నగా నవ్వింది.
 *** **** **** ****
 సాయంత్రం అయింది.
 రమ కాస్సోపుకబుర్లు చెప్పివెళ్ళిపోయింది.వీలున్నప్పుడు మళ్ళీవస్తానంది.
శిరీష స్కూలునించివచ్చి ప్రక్కింటివాళ్ళింటికి ఆడుకోటానికెళ్ళింది.
బాబిగాడికి ఇందాక఼టికన్నా వొళ్ళుప్రేలిపోతోంది. మళ్ళీఒకసారి డాక్టరుదగ్గరిక
వెళ్ళాలనివుంది. కాని డబ్బుల్లేకుండా మాటిమాటికివెడితే ఏవన్నా అనుకుం
టాడేమో నన్నభయం.
పేజి 49
 ఆలోచిస్తూండగానే అనంతరామయ్య వీధిలోకెడుతూ గడపముందు
ఆగేడు " మీ ఫ్రెండు వెళ్ళిపోయిందా అబ్బోబాగా శ్రీమంతురాలే వాళ్ళాయనకి
ఏవిటిపని?" అనడిగాడు ఆసక్తిగా.CrflLlVUl?" అనడిగాడు ఆసక్తిగా.
 అహల్యకి ఏంచెప్పాలో అర్థంకాకకాస్సేపు తటపటాయించి- "ఏదో
చెప్పిందండి గుర్తులేదు. కాంట్రాక్టులుకాబోలు"
 "అదే-అటువంటిదేదో అయ్యుండాలి. అద్సరే-శేషగిరి ఈమధ్యనగాని
వచ్చేడా... చూడు-అప్పుడే ఇరవైతారీఖు వచ్చేసింది. ఇంతవర్కు అద్దె
డబ్బులివ్వలేదు. పైగా మొన్న యాభైరూపాయలు గూడా ఇచ్చేనా? నేనూ
అద్దెలపైనే బ్రతికేవాడ్ని. ఏదో ఒకనెలంటే సర్లెమ్మని వూరుకున్నా. ఇలా
అయితే నాక్కుదర్దు-" గొణుక్కుంటూ వీధిలోకి వెళ్ళిపోయేడు.
 అహల్య ఆశ్చర్యపడింది. కొన్నిగంటలక్రతం తనంతతానేవెళ్ళి కాఫీ
పోయించుకొచ్చిన అనంతరామయ్యేనా ఇతడు? రమ తనింటికిరమ్మంటే
రాకుండా వెళ్ళిపోయిందన్న దుగ్దకావచ్చు. కాకపోతే ఆమె అందాన్ని
ఆకర్షణని చూసి, ఆశ్చర్యపడి ఆకళ్ళతోనే తనని చూడాల్సివచ్చినందుకు
బాధకావచ్చు.
 అహల్య ఆక్షణంలోనే నిర్థారించుకుంది. ఆకర్షణనిమించిన సమ్మోహన
శక్తి ఇంకోటిలేదని.
 కాస్సోపటికి అహల్య గదికితాళంపెట్టి సుధీర్ క్లినిక్ వైపుగావెళ్ళింది.
జనంతో రద్దీగా వుంది. అహల్య ఓపిగ్గా తనవంతు వచ్చేవరకు కూర్చుంది.
ఆమెని చూడంగానే అతడు వెంటనేగుర్తించి " ఎలావుందిబాబుకి" అనడి
గాడు.
 "అహల్య పిల్లవాడిని బల్లపై పడుకోపెట్టింది.
 "జ్వరం తగ్గినట్లుగా లేదు. ఇప్పుడేనిద్రలేచాడు-ఎందుకైనా మంచిదని
తీసుకొచ్చాను " అంది.
 "గడ్ -టెంపరేచర్ బాగావుంది ... అవునూ-మీ పేరేమిటి?"
 `అహల్య' తలొంచుకుని చెప్పింది మెల్లిగా.
 "మళ్ళీ ఇంజక్షనిస్తా- కాని తెల్లవారేలోపు వుదయం వచ్చినట్లుగా
ఇంకోసారి వచ్చేసూచన్లు కనిపిస్తున్నాయ్. ఒకవేళ అలా జరిగితే ఏం
సందేహించక, ఎంత అర్థరాత్రయినా తీసుకురండి. పైగా మేడమీదేనే
నుండేది. గేటుప్రక్కన కాలింగ్ బెల్లుంది.... "
పేజి 50
 అహల్య అలాగేనన్నట్లు భయంగా తలూపిందిి.
 అతడు ఇంజక్షన్ చేసి, వేరే మాత్రలు కాగితంలోకట్టి ఇచ్చేడు.
 "ఏం భయంలేదు ధైర్యంగా వుండ఼ండి అన్నాడు.
 ఆ మాటలు పిల్లవాడిగురించో లేక తన భవిష్యత్తుగురించో అర్థం
కాలేదు అహల్యకి.
 విచిత్రంగా అతడ్ని చూస్తుంటే మాటలు వింటుంటే కొంతధైర్యం
కలుగుతోంది.
 అతడిచ్చిన పొట్లం అందుకుని అహల్య చేతులు జోడించింది.
 ఇంటికొచ్చేసరికి వాకిట్లో శేషగిరి నిల్చున్నాడు.
 పదిరోజులనాడు వెళ్ళి అదేరావటం స్కూటరు వాకిట్లోనే పార్కుచేసి
ప్రక్కనే నేల్చుని సిగరెట్టు తాగుతున్నాడు.
 దూరాన్నించే భర్తని చూసింది అహల్య ఒక్కసారిగా ఆమెలో ఏదో
అలజడి ప్రశాంతంగావున్఩నీటిలోకి చిన్నరాయివిసిరినట్లు.... అదిసంతోషమో,
కోపమో,జుగుప్సో,ధైర్యమో ఇతిమిద్దంగా తేల్చుకోలేకపోయింది.
 శేషగిరి గండుచీమల్ని మింగినట్లు అసహనంగా వున్నాడు. మొహం
కోపంవల్ల ఎర్రబడింది.
 ఆడదానికి సహనంఎక్కువ. అహల్యకి ఇంకా ఎక్కువ. అయినా
ఆక్షణంలో ఆ పరిస్థితిలో ఆమెలో కోపం బుసబుసమని పొంగింది. అతి
కష్టంపైని ఆపుకుంది. కళ్ళు ఎర్రబడ్డాయ్. గుప్పిట్లోని తాళంచెవిని అతడి
కందిస్తూ " తలుపుతియ్యండి లోపలికెళ్ళి మాట్లాడుకుందాం" అంది.
 శేషగిరి అడుగు ముందుకెయ్యకుండా "నీ నౌకర్ననుకున్నావా తలుపు
తెరు" హుంకరించాడు.
 "చేతిలో పిల్లడున్నాడు"
పేజి 51
 "తాళం పెట్టినప్పుడు అడ్డురాని పిల్లాడు, తీసేటప్పుడు అడ్డొచ్చాడా?
నంగనాచిలాగా కబుర్లు"
 అహల్య ఇంకేంమాట్లాడలేదు. మాట్లాడినా వుపయాగంలేదని అసలు
ఇక మాట్లాడేందుకు ఇంకేంలేదని ఆమెకర్థమైంది. తనపైన తనకే అసహ్యం
అనిపించింది. అతికష్టంపైని క్రిందికివొంగి, భుజానవున్నపిల్లవాడ్ని ఒకచేత్తో
గట్టిగా అదిమివుచ్చుకుని, మరోచేత్తో తాళంతిప్పి తలుపుతెరిచింది.
 ఒక వుదుటున శేషగిరి విసురుగా ఆమెనిదాటుకుంటు లోనికెళ్ళాడు.
ఆమె నుదుట పట్టిన చెమటని కొంగుతో తుడుచుకుని లోనికెళ్ళి పిల్లవాడిని
మంచంపైని పడుకోపట్టింది.
 శేషగిరి అప్పటికే పైనించి లెదర్ బ్రీఫ్ ని క్రిందికితెచ్చి దుమ్ముతుడు
స్తున్నాడు. అహల్యకి అతడెందుకొచ్చేడో అర్థమైంది మళ్ళీ కాస్సేపట్లో
వెళ్ళిపోతాడనిగూడా అర్థమైంది.
 "నిన్నుటినింటి బాబిగాడికి జ్వరం .... వుదయం వున్నట్లుండి బిర్ర
బుగుసుకుపోయేడు. ఆ నర్సమ్మగారు సమయానికి దేవుడిలావచ్చి డాక్టరు
దగ్గిరకి దగ్గరుండి తీసుకెళ్ళింది. ఇంజక్షనిచ్చి, మాత్రలిచ్చాడు-జ్వరం
తగ్గకపోవటంచేత ఇపుడు మళ్ళీ వెళ్ళొస్తున్నా" తను చెపుతన్న ఏ ఒక్కమాటా
అతడు వినటంలేదని గ్రహించి మాట్లాడటం ఆపేసింది.
 శేషగిరి పాత కర్చీఫ్ తో బ్రీఫ్ కేసుకున్నదుమ్ముధూళిని తొలగించే
కార్యక్రమంలో పూర్తీగా మునిగిపోయేడు.
 అహల్య నిల్చున్నచోట్నించికదలి అతడికి చేరువగావచ్చి నిలబడింది.
అతడి భుజాన్ని తట్టింది. శేషగిరి ఆమెవైపు ఏమటన్నట్లుగా చూసేడు-
 " నేచెప్పినమాట విన్నారా"
 " ఏవిటది?"
 " పిల్లాడికి బాగోలేదన్నసంగతి"
 అతడు లేచి నిలుచున్నాడు. చేతిలోని భ్రీఫ్ ని ప్రక్కనేవున్న టేబిలుపై
వుంచేడు. " బాగుండకపోతే డాక్టరుదగ్గిరకితీసుకెళ్ళావుగా, ఇంజక్షన్ చేసాడు.
ఇంకేంకావాలి?"
 "నేనంత అవస్థపడ్డానో అడగరేం?"
పేజి 52
 "పరాయివాళ్ళకోసం,వాళ్ళపిల్లలకోసంపడ్డావా?నీపిల్లలకోసం నువుపడుంటావ్.."
 " అంటే వీళ్ళు మీ పిల్లలుకారా?"
 ఆ మాటకి శేషగిరి జవాబివ్వలేదు. ప్యాంటు, షర్టు విప్పి టవలుచుట్టు
కుని స్నానానికి బయల్దేరుతున్నాడు.
 అతడి మౌనం,నిర్లిప్తం ఆమెలో కోపాన్ని,అక్కసుని పుట్టించేయ్.
ఆ గుండెల్లో ఏదో ఆక్రోశం, ఆక్రందనలు...మనిషిలోని సాధుస్వభావాన్ని
ఎవరో పీకనులిమిచంపేసి, మొండి స్వబావానికి, తిరుగుబాటు దోరణికి
స్వాగతంపలికేక్షణం .....
 శేషగిరి స్నానం చేసివచ్చి చకచకా దుస్తులు ధరించి చేతిలోకి బ్రీఫ్
కేస్ తీసుకున్నాడు.
 అహల్య ఆదుర్ధాగా అడిగింది "వెళ్ళిపోతున్నారా" అని
 "వూరెడుతున్నా-రెండ్రోజుల్లో వస్తా"
 ఆమె గబగబావెళ్ళి అతడికెదురుగా నిలబడింది "ఇంట్లో తినటానికి
లేదు. ఆ కిరాణా షాపువాడు డబ్బులిస్తేనేగాని సరుకులివ్వనన్నాడు. చేతిలో
ఒక్క఼రూపాయిగూడా లేదు. పిల్లవాడికి బాగాలేదు"
 "ఆఫీసుపని-అర్జెంటుగా వెళ్ళాలి.
 "డాక్టరు ఈ ఒక్కరాత్రికి జాగ్రత్తగా వుండమన్నాడు. నాకేదో భయంగా
వుంది. ఒక్కత్తిని-వుండిపొండి, రేపురాత్రికి వెడుదురుగాని"
 "చెప్పానా ఆఫీసువనుందని, తప్పదు"
 అహల్య పిల్లవాడిని అలా భుజానవేసుకునే ఏడుస్తోంది. మాట్లాడు
తోంది"ఏవండి పిల్లలకన్నా ఎక్కువా వుద్యోగం కాదనకండి" చెయ్యి పుచ్చు
కుని బ్రతిమాలబోయింది.
 అతడు విసుగ్గా చెయ్యిని విదిలించుకుని " వాడికి వొంట్లో ఏరోజు
బావుందని పుట్టినప్పట్నించి అంతేగా దరిద్రుడు "
 అహల్యకి బాధనిపించింది.అశుభంలా గోచరించింది. "ఛ఼ఛ అలా అన
కండి వాడికోసం మనంఏంచేసామని కడుపునిండాపాలుగూడాపట్టలేక
పోయాం. వాడు కాదండి దరిద్రుడు మనం మనిద్దరం"
పేజి 53
 శేషగిరి చెప్పులు తొడుక్కున్నాడు.
 "పెళ్ళాం పిల్లలన్న అప్యాయత లేకుండా పోయింది. ఎందుకిలాచేస్తున్నారో
అర్థంకాకుండా వుంది. మీసుఖానికి, సౌఖ్యానికి అడ్డుగావుంటే మా ముగ్గుర్ని
ఒక్కసారి పీకనులిమి చంపెయ్యండి అంతేగాని ఇలా కాస్త కాస్త చంపకండి"
 "ముఖ్యమైన పనిమీద వెడుతున్నాను. వెనకాల నసపెట్టకు, రెండ్రో
జుల్లో వచ్చోస్తా" గడపదాటబోతున్నాడు.
 అతడు ఆగేపరిస్థితిలేదని ఆమెకర్థమైంది. సాయంత్రం రమ చెప్పినట్లుగా
అవతలున్న ఆకర్షణశక్తి చాలా గొప్పది తనదగ్గిర ఆకలేగాని ఆకర్షణబొత్తిగా
లేదు. "కనీసం డబ్బులన్నా ఇచ్చివెళ్ళండి . నేతినకపోయినా పిల్లలకైనా తిండి
పెట్టలేకపోతే మనం మనుషులంకాము"
 "ఆ ఇంటివాడ్ని అద్దెఅడగమని సలహాఇచ్చేపుటగా వున్నదంతా వాడి
కిచ్చేసాను నాదగ్గిరేంలేవు"
 అహల్య చేతిలోని పిల్లవాడిని చటుక్కున అతడి కాళ్ళవద్దవుంచి,
శేషగిరిని గట్టిగా వాటేసుకుంది. ఘొల్లుఘొల్లుమని ఏడుస్తోంది.
 శిరీష గోడవారగా నిల్చుని ఏడుపు మొదలెట్టింది. నేలమీది పిల్లవాడు
గుక్కలుపట్టేడు.
 "ఇలా చేస్తేనే బ్రతకలేనండి-ఈ పిల్లలికి తిండి ఎక్కడ్నించి తెచ్చి
పెట్టేది నావల్లకాదండి-"
 శేషగిరి భార్య భుజాలుపట్టి బలంగా ప్రక్కకినెట్టేడు. ఆమె వెళ్ళి
గోడకి `ధడ్' మని గుద్దుకుంది. కాళ్ళ ముందున్న పిల్లవాడినిదాటి గుమ్మం
దాటి వీదిలోకెళ్ళి స్కూటల్ స్టార్టుచేసి వెళ్ళివోయేడు.
 3
 ----
 సృష్టి యావత్తూ నిద్రలో జోగుతోంది.
 అహల్య మంచంపైని గోడనానుకుని కూర్చుంది జుట్టుపోయలుపాయలుగా
విడిపోయి భుజాలపైనించి క్రిందిజారిపడుతున్న నల్లటి జలపాతంలావుంది.
కళ్ళనుంచి జారిపడిన కన్నీళ్ళు చెక్కిళ్ళపైబడి ఎండిపోయి రెండు సన్నపాటి
కాలిబటల్లా కనిపిస్తున్నాయ్ ఆవేదనచేత నల్లగాను, ఆకలిచేత నీరసం
గానూవున్న ఆమె వదనం మురికిగుంటలో చంద్రబింబంలా వుంది.
 శిరీష మంచం ప్రక్కగా చాపపైని పడుకునుంది. నిద్రలో లేతపెద
వుల్ని చిత్రంగా తిప్పుతోంది.
 కాసేపు తల్లి అన్నం పెడుతుందేమోనని ఆశగా ఎదురుచూసింది.
పుస్తకాలన్ని ముందేసుకుని హోంపర్కంతా వుర్తిచేసుకుంది. చక్కటి చిన్న
మొగ్గల్లాంటి కళ్ళు నిద్రరాకని సూచిస్తున్నట్లు ఎర్రబడ్డాయి.
 "అమ్మా ఆకలేస్తోందే అన్నం పెట్టవా" అనడిగింది తల్లిని.
 అహల్యకి అలా అడుగుతుందని తెల్సు. నాలుగు రోజులనాడు కిరాణా
షాపుకెళ్ళి వాడ్ని గంటసేపు బ్రతిమాలితే పౌతడబ్బులు, ఇప్పటివి మొత్తంగా
వారంరోజుల్లో ఇస్తాననిపించుకుని, వొట్లుప్రమాణాలు చేయించుకుని ఆషాపు
వాడిచ్చిన అయిదుకిలోల బియ్యం మధ్యాహ్నంతో నిండుకున్నాయ్. అంచేత
మధ్యాహ్నంనించే అహల్య ఆలోచిస్తోంది. బియ్యందొరికే మార్గంఏదైనా వుం
దాని, రాత్రయ్యేసరికి, బియ్యందొరకలేదు గాని, పిల్లకి చెప్పేందుకు మంచి
అబద్దం దొరికింది.
 అన్నం అడిగిన శిరీషని రెక్కపట్టిదగ్గిరకి తీసుకుంది. కళ్ళనిండానీళ్ళు
తెచ్చుకుంది.
 "ఏంటమ్మా అన్నం అడిగితే ఏడుస్తున్నావెందుకు?" అమాయకంగా
అడిగింది.
 అహల్య తననుతాను సంభాళించుకుని తయారుగావుంచుకున్న అస్త్రం
లాంటి అబద్ధాన్ని ప్రయోగించింది.
 " తమ్ముడికి వొంట్లో బాగోలేదుగా జరం వచ్చిందికదా అందుకని ఈ
రాత్రిక నేను నువ్వూకలిసి అన్నంతినకుండా వుపవాసముంటే తెల్లవారేసరికి
వాడిజ్వరాన్ని తగ్గించేస్తానని దేవుడు చెప్పాడమ్మా అందుకని అన్నంవండలేదు.
 "శిరీష కళ్ళు పెద్దచేసి తల్లివంక ఆశ్చర్యంగా చూసింది. పవిత్రమైన
ఆ పసిగుండెల్లో తమ్ముడిపైన అవ్యాజమైన ప్రేమ పాలపొంగులా వచ్చింది.
అయితే అన్నంవొద్దులేమ్మా పాపంతమ్ముదికి జొరంతగ్గేకే తిందాం" అనేసి
చరచరా వెళ్ళి రెండుగ్లాసులనీళ్ళు గడగడాతాగి పడుకునిద్రపోయింది.
 అహల్యకి శరీరంపై చర్మాన్ని చీలుస్తున్నంత బాధనిపించింది. గోరు
ముద్దలు తినిపించాల్సిన తల్లి ఘోరంగా అబద్దాలు తినిపిస్తోంది.
పేజి 55
 ఆలోచిస్తున్న అహల్యకి నిద్రముంచుకొస్తున్నట్లనిపించి మంచంపైనించి
దిగి గ్లాసుతోచల్లటి నీళ్ళు తీసుకుని మొహంపైని చిలకరించుకుని తిరిగివచ్చి
శిరీష ప్రక్కగావొదిగింది.
 ఏవిటి విపత్కర పరిస్థితి? ఎందుకిలా కష్టాలు ఒకదానివెనుకమరొకటి
శిఖరంపై నుంచి రాళ్ళు విసురుతున్నట్లుగావచ్చి తగుల్తున్నాయ్? తనేం పాపం
చేసింది? తనూపిల్లలు కడుపునిండాతిని, గౌరవంగా బ్రతకాలన్న ఆశతప్పించి,
భోగభాగ్యాలుకావాలన్న దురాశ తనకులేదే? అయినా ఆ చిన్న ఆశగూడా
తీరక జీవితం ఎందుకిలా ఎడారిలా తయారైంది?
 ఈమధ్యననరసమ్మ ఒక సంగతి చెప్పింది. దేవుడు ఎపరినైతేఎక్కువ
ప్రేమిస్తాడో వాళ్ళకే కష్టాలెక్కువపెడతాట్ట బంగారాన్ని నిప్పుల్లో కాల్చి
నట్లు మనిషిని కష్టాల్లోకాల్చి అతడిలో ఏ మూలోవున్నా వుండకూడని లక్ష
ణాలన్నిటిని-పిరికితనం, మొహమాటం,దురాశ,ఈర్ష్య-అన్నిటిని హరింప
చేసి, స్వచ్చమైన బంగారంలాంటి మనిషిగాతీర్చిదిద్దుతాట్ట సమాజానికి పని
కొచ్చే వ్యక్తిగాచేస్తాట్ట. అందుచేతనే ప్రపంచచరిత్రలో ప్రసిద్దులుగా వాసికె
క్కిన ప్రముఖులందరిజీవితాలని పరిశీలిస్తే కనిపించేది-పోరాటం-జీవితమధ
మం. ఇలాగని గుళ్ళో పురాణంచెప్పే పంతులుగారుచెప్పేట్ట.
 ఆ విషయం తనకెందుకుచెప్పిందో అప్పుడర్థంకాలేదు. కొద్దికొద్దిగా
ఇప్పుడర్థం అవుతోంది.
 దేవుడికి తనంటే ఇష్టమా? అందుకేనా ఈ అవస్థలు తనలోవున్న
భయం,పిరికితనాలువదలిపెడతేగాని ఈ కష్టాలుతీరవా? అవును రమగూడా
చెప్పింది పిరికితనంవదుల్తేనేగాని నువు బాగుపడవు అని.
 పిరికితనంవదలి ధైర్యంగాతనేంచెయ్యాల్ట-ఆవిషయంమాత్రం చెప్పింది
కాదు-ఈగారివచ్చినప్పుడు అడగాలి. అయితే నేచెప్పినవన్నీ చేస్తున్నావా
అని ఎదురుప్రశ్న వేస్తుంది.
 ఆడదానికి ఆకర్షణశక్తికావాలని చెప్పింది. మొగుడ్ని఼చెప్పుచేతల్లో
వుంచుకోవాలంటే ఏంచెయ్యాలో చెప్పింది. నీమొగుడ్ని కట్టిపడేసుకోవాలంటే
వీటన్నీటిని తు.చ. తప్పకుండా పాటించమంది.
పేజి 56
 కాని అసహ్యంగా ఆమాటలెలాఅనేది-ఆపన్లెలాచేసేది-
 కొంపతీసి ఇదేనా పిరికితనంఅంటే-
 దీన్నేనా వదిలెయ్యమని చెప్పేది-ఏవిటో రోజులు బాగోలేకపోతే
ఎవరేంచెప్పినా,ఎపరేంఅన్నా చేదుబిళ్ళ మ్రింగినట్లు...
 అన్నట్లు బాబిగాడికి మందుబిళ్ళవెయ్యనేలేదు. మతిమరుపు ఇదొకటి
మధ్యలో-
 పడుకున్నదల్లా చివుక్కునలేచి, గూట్లోవున్నపొట్లంవిప్పి మాత్రతీసు
కుని, మంచంవద్దకెళ్ళింది.
 దూరంగా ఎక్కడో కుక్క ఏడుస్తోంది. మెయిన్ రోడ్డుపైనించి లారీ
శబ్తంచేసుకుంటూవెళ్ళింది. పేరుతెలీనిపక్షివికృతంగాఅరుస్తోంది. చెట్లమధ్య
నించి.
 పిల్లవాడిపైని దుప్పుటిని తొలగించి తట్టిలేపాలన్న వుద్దేశ్యంతో అతడ్ని
తాకింది.
 వొళ్ళుజల్లుమంది. గుండెవేగం హెచ్చింది.
 బాబిగాడి వొళ్ళు చల్లగా నీళ్ళకుండలావుంది. బిగదీసుకుపోయి కొయ్య
ముక్కలాగూడావుంది.
 అహల్య ఆత్రంగా "ఒరే నాన్నా- బాబీ" అంటూ కదిపిచూసింది.
 వాడిలో చలనం లేదు నోరుతెరచేవుంది. కళ్ళుగూడా సగంతెరచుకునే
వున్నాయ్ ప్రాణం కళ్ళల్లోంచి జారుకుందా, లేక పాలకోసం పరితపించే ఆ
లేత పెదవుల మధ్యనించి రాలిపోయిందో చెప్పటంక఼ష్టం.
 అలాగే ఆఖరిశ్వాస తీసేముందు ఆకళ్ళు తెరుచుకున్నది. పాలుకుడప
లేక ఆపిచ్చితల్లిని కళ్ళారా చూద్దామనాలేక ఆచిన్న నోటితో ఆఖరుసారిగా
"అమ్మా నాగురించి బాధపడకు. నీగురించి బాధపడు కన్నీళ్ళుపెట్టు"
అని చెప్పాలనోగూడా చెప్పటంకష్టం. ఆ ఆఖరిక్షణంలో ఆచిన్న చిలకగూడు
వదలి వెళ్ళిపోయిన ఆక్షణంలో ఆ పాలగుండెలో ఏబాధ కలుక్కుమందో,
ఏ భావం తళుక్కుమందో ఎవరికి తెలుస్తుంది?
 ఆ చిన్఩ప్రాణి ఆ చీకట్లోంచి, ఆ గదిలోంచి ప్రాపంచక భంధాల్లోంచి
బయటపడి సృష్టిస్థితి లయకారుడైన ఆవిశ్వతేజస్సులో విలీనంకావటానికి
వెళ్ళిపోయింది.
పేజి 57
 కాని ఆ తల్లి ఆమసకవెల్తురులో, ఆచేతుల్లో కొయ్యముక్కలా వున్న
కొడుకుని చూసుకుని అలా అనుకోలేదు ప్రాణంవుందికాని వుదయంవచ్చిన
ట్లుగా మళ్ళీ వాతంకమ్మింది. సుధీర్ చెప్పినట్లే జరిగింది. వెంటనే అతడి
వద్దికు తీసుకెళ్ళాలి అదే ఆలోచన.
 నిజంగా ఆక్షణఁలో నిజం ఆమె కనిపట్టగలిగుంటె ఆ ఇంట్లోంచి,
రెండుశవాలు వెళ్ళుండేవి.
 అహల్య పెద్దగా అరిచింది. భయంతో,బాధతో, ఆదుర్ధాతో `బాబూ'
అని, శరీరంలోమిగిలున్న వోపికనంతా ప్రోగుచేసి నరాల్లోకెక్కించి అరి
చింది. కంఠనాళాలు పెట్లిపోయేటట్లు, రోమాలునిక్కబొడుచునేటట్లుగా
అరచింది.
 ఆమెకేక ఆ చీకటిరాత్రి నిశ్శబ్దాన్ని ఖండఖండాలుగా చీల్చివేసింది.
సముద్రగర్భంలోంచి వువ్వెత్తున లేచిన తరంగం ఆకేకవింటే భయం
తో చప్పున పడిపోయి దాక్కుంటుంది.
 ఆకాశంలో స్వేచ్చగా విహారంచేస్తున్న విహంగంవింటే, దగ్గిర్లోవున్న
చెట్టుగుబురుల్లో దూరి మళ్ళీ బయటికిరావటానికి సాహసించకపోవచ్చు.
 ప్రకృతికాంత, కాలపురుషుడిచేతుల్లో పరవశిస్తున్న ఆ మధురక్షణంలో
ఆమె చెవిలో ఆ కేకబడుంటే భయంతో కాలపురుషుడ్నేకాదని కదలిపోయేది.
 ఒక తల్లి కడుపుచించుకుని, నరాలుతెంపుకుని ఆర్తిగా పెట్టే ఆకేకలో
ఆ బలంవుంది-
 అహల్యపెట్టిన ఆ పొలికేకని ఆ ఆవరణలో అందరూ విన్నారు.
తలుపులు తీసుకుని, బయటికొచ్చింది మాత్రం-ఇద్దరే ఇద్దరు- నరసమ్మ
అనంతరామయ్య.
 నరసమ్మ రెండే రెండు అంగల్లో ఆమెని సమీపించింది.
 "ఏవైదమ్మా-మళ్ళీ ఏవైంది?" అనడిగింది.
 అహల్య ఏంబదులుచెప్పకుండానే పిల్లవాడిని ఆమెకందించింది. అక్కడే
గడపలో కూలబడి పెద్దగా ఏడుస్తోంది.
 నరసమ్మ పిల్లవాడిని రెండుచేతుల్లో పుచ్చుకుని తేరిపారి పరీక్షగా
చూసింది. మొదటి చూపులోనే ఆమెకి పరిస్థతి అర్థమైంది. తనచేతుల్లో
వున్నది వాతంకమ్మిన పిల్లవాడుకాడని, ప్రాణాల్లేనిశవమని ఇట్టే అర్థం
చేసుకుంది.
పేజి 58
 కాని ఆ విషయం చెప్పలేదు.
 నరసమ్మ కెంతో అనుభవముంది. ఎంతమంది చావుపుట్టుకలు
చూసిన మనిషి. ఏమాట ఎప్పుడూ, ఎలా ఎవరి ద్వారా చెప్పించాలో
ఆమెకితెల్సు. అందువల్లనేప్రాణంలేని ఆ పిల్లవాడిని భుజానవేసుకుని
ఇంకోమాట మాట్లాడకుండా సుధీర్ ఇంటివైపుగా కదిలింది.
 అహల్యగూడా లేచి ఆమె వెనకే పరిగెత్తింది.
 అనంతరామయ్య అలాగే నిల్చుని తన జోక్యం అవసరమా కాదాని
ఆలోచిస్తున్నాడు.
 నరసమ్మ గబగబావెళ్ళి సుధీర్ ఇంటిముందాగింది తలుపుని దడదడ
మని బాదింది ఆ తర్వాత గేటు ప్రక్కగా కనిపిస్తున్న కాలింగ్
బెల్లునినొక్కి పట్టింది.
 మేడపైని లైట్లు వెలిగాయ్. కాస్సేపటికి సుధీర్ క్రిందికిదిగొచ్చాడు.
నైట్ గౌన్్ వేసుకునున్నాడు. నిద్రలోంచి లేచినట్లు కళ్ళు మత్తుగావున్నాయ్.
 "ఎవరు" అనుకుంటూ వచ్చేడు.
 నరసమ్మ కాస్త ముందుకొచ్చి భుజంపైని పిల్లవాడిని చేతుల్లో పట్టు
కుని చూపిస్తూ "మేమేబాబు, వుదయంవచ్చాంకదూ-మళ్ళీ పిల్లవాడికి ముంచు
కొచ్చింది. కాస్త చూడు" అంది.
 అహల్య కాస్త వెనగ్గానిల్చుని అతడేంచెబుతాడని ఆత్రంగా ఎదురు
చూస్తోంది.
 సుధీర్ కి పిల్లవాడిచెయ్యి పుచ్చుకోగానే అర్థమైంది. కళ్ళు పరీక్షగా
చూసేడు. గుండెలపైన చెవు పెట్టి విన్నాడు ఎక్కడా చలనంలేదు.
 సుధీర్ పెదవి విరిచి "ప్చ్-చాలా ఆలస్యమైంది...." అని మాత్రం
అన్నాడు.
 నరసమ్మ పిల్లవాడిని తిరిగి భుజలపై వేసుకుని చేతిలోవున్నగుడ్డని
అతడిపై నిండుగా కప్పింది.
 అహల్య ఒక్కగంతులో సుధీర్ వద్దకొచ్చి "ఁఅంటే...అంటే...."
ఏదో అడగబోయింది.
 నరసమ్మ దారిదీస్తూ " బాధపడకమ్మా - ఇవన్నీ రుణానుబంధాలు-
ఏవిటో మొగుడుచూస్తేఅలా- పిల్లల్ని చూసుకుని బ్రతుక్కొస్తోంది పిచ్చిపిల్ల-
ఇప్పుడీ వుపద్రవం-అంతా ఖర్మ" అంటూ నడక సాగించింది.
పేజి 59
 అర్థం చేసుకున్న అహల్య అక్కడే కుప్పలాకూలిపోయింది."నన్నెంత
అన్యాయం చేసావురా నేనెలా బ్రతికేదిరా-ఒరే-నాకేంచెప్పివెళ్ళావురా"
 నిశ్శబ్దంగావున్న ఆవీధిలో ఆమె ఏడుపు వికృతంగా ప్రతిధ్వనిస్తోంది.
ఏడుపువల్ల ఆమె గుండెలు పగిలిపోయేలావున్నాయ్ రెండుచేతుల్లో మొహాన్ని
కప్పుకుని దీనంగా, హీనంగా ఏడుస్తోంది.
 సుధీర్ ఒక్క఼క్షణం ఆలోచించేడు. డాక్టరుగా అతడెన్నో చావులు
చూసేడు. ఎన్నోశవాలని పరపరాకోసేడు. మొదట్లో భయంఅనిపించిందిగాని
ఎప్పుడూ బాధనిపించలేదు.
 కాని ఈరోజు ఎందువల్లనో గుండెల్లో తుమ్మముల్లు గుచ్చుకున్నట్లు
ఏవిటోగా అనిపించింది. అప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిల్లినాయ్.
 అతడు ఇంకేం ఆలోచించకుండా చొరవుగావొంగి రోడ్డుపై కూర్చుని
ఏడుస్తున్న ఆమె భుజాలు పట్టుకుని సుతారంగా పైకి లేవనెత్తాడు.
 అహల్య లేచి నిల్చుంది.
 "ఏడవకండి ప్లీజ్ మనం మానవమాత్రులం. ఏంచెయ్యగలం. మీ
బాధనినేతీసెయ్యలేను. నాకుతెల్సు కాని అలా ఏడవకండి మీరలా
ఏడుస్తుంటే నాకు ఏడవాలనిపిస్తోంది" ఆమాటలు ఁఅంటున్నప్పుడు అతడి
గొంతు బొంగురుపోయింది.
 అహల్య ఏడుస్తూనే తలెత్తి అతడివంక చూసింది. నియాన్ లైటు
కాంతిలో అతడికళ్ళల్లో తడి తళుక్కునమెరిసింది.
 విచిత్రంగా ఆమెకి దుఖం అధికంఅయింది. ఆ క్షణంలో, ఆ బాధలో
ఆమెక్కావలసింది అనునయం, దైర్యం తనని దగ్గరకు తీసుకుని పొదివి
పట్టుకుని `బాధపడకు ధైర్యంగావుండు' అన్చెప్పే వ్యక్తికావాలి.
 ఆపని వివాహిత అయిన ఆడదానికి భర్త నేరవేర్చాలి. కాని ఆమె
భర్త అక్కడలేడు. ఎక్కడున్నాడో తెలీదు వున్నా చేస్తాడన్నగ్యారంటీలేదు.
 తనకోసం తనబాధని దుఖాన్ని చూడలేక సుధీర్ కన్నీరు కార్చటం
గొప్పవిషయంగా అనిపించింది.
పేజి 60
 సుధీర్ జేబులోంచి కర్చీఫ్ తీసి ఆమెకళ్ళు తుడిచాడు.
 ఆమె అభ్యంతరం పెట్టలేదు.
 ఆమెని మరింత దగ్గరగా తెచ్చుకున్నాడు.
 అమె అభ్యంతరం చెప్పలేదు.
 ఆమె అతడ్నించి విడిపించుకోవాలన్న ప్రయత్నమేచెయ్యలేదు. అసలా
ధ్యాసే లేదు. చాలా సహజమైన విషయంగా అన్పించింది ఆ క్షణఁలో వాళ్ళి
ద్దర్లో ఏ ఒక్కరికి ఆశ్లీలమైన కోర్కెలుగాని, అసహ్యమైన ఆలోచన్లుగాని
లేవు. బాధపడే మనస్సుకి ఓదార్పుకావాలి దాన్నందించటమే అతడుద్దేశం.
 కాని చూసేవారికి ఆదృశ్యం అసభ్యంగా, అసహనంగా కనిపించవచ్చు.
ఆ దృశ్యాన్ని అర్థంచేసుకోవాలంటే మనిషికి మానసిక ఔన్నత్యంకావాలి.
 అనంతరామయ్య కదిలేడుకాబట్టి చీకట్లోంచి కళ్ళుచిట్లించి మరీచూసేడు.
అర్థమైనట్లు తలూపేడు.
 నరసమ్మ మాత్రం సుధీర్ వంక భక్తిగా, ప్రేమగా సెభాష్ అన్నట్లుగా
చూసింది. అప్పటికే పిల్లవాడిని గేటుప్రక్కగాపడుకోబెట్టి ప్రక్కనే కూర్చుం
దామె.
 సుధీర్ అహల్యని మెల్లిగా నడిపించుకొచ్చి నరసమ్మ ప్రక్కగాకూర్చో
పెట్టేడు. ఆమె మళ్ళా పిల్లవాడిపైబడి ఘొల్లుమని ఏడుస్తోంది. కన్నీళ్ళు
బాధని కడిగేస్తాయ్. అంచేత ఎవ్వరూ ఆమెని ఓదార్చాలని ప్రయత్నించ
లేదు.
 డాక్టరు రాకని గమనించిన అనంతరామయ్య అతడి ప్రక్కగా
నిలబడ్డాడు.
*** ***** ****** ****
      0 
</p></body></text></cesDoc>