<cesDoc id="tel-w-commerce-banking-save" lang="tel">
<cesHeader type="text">
<fileDesc>
<titleStmt>
<h.title>tel-w-commerce-banking-save.txt</h.title>
<respStmt>
<respType>Electronic file created by</respType>
<respName>Central Institute for Indian Languages, Mysore</respName>
<respType>transferred into Unicode and CES format by</respType>
<respName>"Unicodify" software by Andrew Hardie</respName>
</respStmt></titleStmt>
<publicationStmt>
<distributor>UCREL (on behalf of CIIL)</distributor>
<pubAddress>Department of Linguistics, Lancaster University, Lancaster, LA1 4YT, UK</pubAddress>
<availability region="WORLD"></availability>
<pubDate>03-08-13</pubDate>
</publicationStmt>
<sourceDesc>
<biblStruct>
<monogr>
<h.title>పొదుపు</h.title>
<h.author>పెమ్మరాజు భానుమూర్తి</h.author>
<imprint>
<pubPlace>India</pubPlace>
<publisher>Unknown - Book</publisher>
<pubDate>1990</pubDate>
</imprint>
<idno type="CIIL code">save</idno>
</monogr></biblStruct></sourceDesc></fileDesc>
<encodingDesc>
<projectDesc>Text collected for the CIIL Corpus, subsequently integrated into the EMILLE/CIIL Monolingual Written Corpora.</projectDesc>
<samplingDesc>Simple written text only has been transcribed. Diagrams, pictures and tables have been omitted. Sampling begins at page 37.</samplingDesc>
<editorialDecl><conformance level="1"></conformance></editorialDecl>
</encodingDesc>
<profileDesc>
<creation><date>03-08-13</date></creation>
<langUsage>Telugu</langUsage>
<wsdUsage>
<writingSystem id="ISO/IEC 10646">Universal Multiple-Octet Coded Character Set (UCS).</writingSystem>
</wsdUsage>
<textClass>
<channel mode="w">print</channel>
<constitution type="composite"></constitution>
<domain type="public"></domain>
<factuality type="fact"></factuality>
</textClass>
<translations></translations>
</profileDesc>
<revisionDesc></revisionDesc>
</cesHeader>

<text><body>

<p>-3-
 పొదుపు
 ఈనాడు ఎక్కడ చూచినా వినబడే మాట యిది.
అయితే ఈ మాట ఎందుకు వినబడుతోంది? ఈ మాటకు
ఎంత విలువ ఏముంది? అని ప్రతివారూ ఆలోచించవలసిన
అవసరం; ఆచరించవలసిన అవసరం ఎంతయినా వుంది.
 అందువలన ముందు పొదుపు అంటే ఏమిటో
తెలుసుకుందాం!
పొదుపు:
 పొదుపు అంటే తెలియనిదేంకాదు. అందరికీ తెలిసిన
విషయమే! అయినా ఎవరూ అలా వుండలేకపోతున్నారు.
అందువల్లనంటే, అది కేవలం వారి బలహీనత అనే చెప్పాలి.
 మనం జీవించాలి. జీవించడానికి అనువైనవి కొన్ని
వున్నాయి. ఆహారం, ఇల్లు, గుడ్డలు, మొదలైనవి.
-4-
 ఈ మూడు ప్రతివారికీ అవసరం. ఇందులో బీద
భాగ్యవంతులన్న తేడా మాత్రం లేదు.
 ఉన్నవారు అన్నీ వేసుకు తింటే, లేనివాడు గంజి
తాగుతాడు.కలిగినవాడు మేడలో వుంటే, లేనివాడు
గుడిసెలో వుంటాడు. ధనవంతుడు సిల్కు వస్త్రాలు కట్టుకుంటే
బీదవాడు చిరిగిన గుడ్డలు కడతాడు, అంతేకాని ఇవి అందరికి
అవసరమే.
 ఈ అవసరాలు తీర్చుకోవాలి. తీర్చుకోవలసిన బాధ్యత
ప్రతివారిమీద వుంది. అందుకు డబ్బు అవసరం.
 "డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు" అన్న విషయం
మనం నిత్యం వింటూనే వుంటాం. ఆఖరికి భగవంతుడుకూడా
ధనవంతుల వశమే.
 అందుచేత ప్రతి మానవుడూ జీవించాలి. జీవించాలంటే
జీవించటానికి అవసరమయ్యే వాటినన్నింటిని మనం ప్రొగు
చేసుకోవాలి, అందుకు డబ్బు అవసరం.
 డబ్బును ప్రతివాడూ సంపాదిస్తూనే ఉంటాడు. డబ్బు
సంపాదించడం అంత కష్టమైన పనికాదు. కష్టపడిన ప్రతివాడు
డబ్బు సంపాదించవచ్చు.
 అయితే డబ్బు సంపాదించిన ప్రతివాడూ సుఖపడలేక
పోతున్నాడు ఎందుకని? డబ్బువలన జీవితానికి
అవసరమయ్యే
-5-
వస్తువులను కొనుక్కోవచ్చుగదా! ఆ వస్తువులతో
సుఖంగా జీవించవచ్చుగదా! మరి ఎందుకు సుఖపడలేక
పోతున్నారు.
 ఈ విషయాన్ని గురించి మనలో చాలామందికి
అనుమానం వుంది. కాని ఎవరూ దానిని గురించి ఆలోచించనే
ఆలోచించరు. ఆలోచించకుండా బాధపడతారు. కొంతమంది
అలా బాధపడుతూనే ఉంటారు.
 మరికొంతమంది ఆ బాధలను సహించలేక విపరీతంగా
అప్పులు చేస్తారు. ఆ అప్పులతో మరీ బాధ. వడ్డీలతోపాటు
వడిగల గుర్రాలు కూడా పరుగెత్తలేవట అంటే. ఈ అప్పులూ
తీరవు. అతని సంపాదన అంతా వడ్డీలకే సరిపోతుంది.
 అసలు ఈ బాధ ఎందుకు వస్తుంది? అది కొంతవరకూ
ఖర్చులు ఎలా పెట్టుకోవాలో చేతకాక కావచ్చు. కొంతమంది
అవసరపు ఖర్చులకు అలవాటుపడి వుండవచ్చు. లేకపోతే
ఆదాయానికి మించిన ఖర్చుచేయడం వలన కావచ్చు.
 అని ఖర్చులు తగ్గించుకోమని, ఖర్చులకోసం భయపడి
అనేక విధాలుగా బాధపడమనికాదు. ఆ మాటకొస్తే ఖర్చుల
కోసం భయపడటం వెర్రితనమవుతుంది.
 ఖర్చులు ఎక్కువకాకుండా చూచుకోవడం ఒక పద్ధతి.
 ఒక్కొక్క సమయంలో ఆ ఖర్చులు తప్పవు. అటువంటి
-6-
సమయాలలో ఏం చెయ్యాలి? ఖర్చులను తగ్గించుకోవడానికి
వీలున్నంతవరకూ తగ్గించుకోవడం మంచిది.
 అలా తగ్గించుకోవడానికి వీలులేనప్పుడు ఆదాయాన్ని
అధికం చేసుకోవడం మరొక మార్గం.
దీపం వుండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి:
 ఈ మాట ఎంత నిజం! దీపంవుండగానే యిల్లు చక్క
పెట్టుకోవాలి. దీపం వెలుతురులో అన్ని వస్తువులు చక్కగా
కనబడతాయి. అందువలన మనకు ఎటువంటి కష్టమూ
లేకుండా శుభ్రంగా సర్దుకోవచ్చు.
 అలాగే మనం డబ్బు సంపాదిస్తున్నాం. డబ్బు
సంపాదిస్తున్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా వుండాలి. అలా
జాగ్రత్త పడకపోతే, చాలా యిబ్బందులు పడవలసి వుంటుంది.
 మనం డబ్బు సంపాదించాం. సంపాదించినదంతా
ఖర్చు చేస్తున్నాం. రేపన్న సంగతి అసలు ఆలోచించడం లేదు.
 గోపాలం కూడా సరిగా ఇలానే చేసేవాడు. అందువల్ల
తరువాత చాలా బాధలు పడ్డాడు.
-7-
గోపాలం కథ:
 గోపాలం కథ ప్రతివారూ తెలుసుకోవలసివుంది.
ఎందుకంటారేమో? గోపాలం కథ వలన మనం ఒక నీతి
నేర్చుకున్న వాళ్ళం అవుతాము.
 గోపాలం పెద్ద నాయకుడేమీ కాదు. సామాన్యుడే.
ఒక ఆఫీసులో చినన గుమాస్తా- జీతం నెలకు తొంభై
రూపాయలు వస్తాయి.
 తొంభైరూపాయలంటే ఏమంత ఎక్కువకాదు. అయినా
గోపాలానికి అతని కుటుంబానికి ఆ వచ్చే తొంభైరూపాయలు
చాలా ఎక్కువ. భార్యా, ఒక చిన్న ఆడపిల్ల, తను ఈ
ముగ్గురు మనుష్యులకూ తొంభైరూపాయలు సరిపోవా!
ఎక్కువ.
 అయితే ఏం - గోపాలానికి యిప్పుడు డబ్బు
సరిపోకుండా వుంది. ఎందుకని అనవసరపు ఖర్చులు
ఎక్కువయ్యాయి.
 నాటకాలపై మోజు కలిగింది. చిన్న వేషం వేశాడు.
చూచిన నలుగురూ బాగుందంటే బాగుంది అన్నారు. ఇంకేం
గోపాలం తను గొప్ప నటుడ్ని అనుకున్నాడు.
 స్వంతంగా ఒక నాటకం వేయాలని అనుకున్నాడు.
నలుగురినీ పోగుచేశాడు. వాళ్ళందరికీ కాఫీలు - మిగతా
-8-
ఖర్చులు. శాంతి కాఫీ ఼హో఼ల్్లో అరవై రూపాయలకు పైగా
దాటిపోయింది. ఇంకా చిల్లరమల్లర ఖర్చులు - మొత్తం తడిసి
మోపుడయింది.
 చివరకు నాటకం వేశారు. ఎలాగైతేనేం నాటకానికి
డబ్బులిచ్చి చూచేదెవరు? ఎక్కడైనా చూస్తారేమోగాని ఈ
తెలుగుదేశానికి మాత్రం ఆ అలవాటు లేదు. అందుచేత
గోపాలం వేసిన నాటకానికి మాత్రం డబ్బు రాలేదు.
 ఆ నాటకంలో పెద్ద వేషం గోపాలానిదే! అయితే ఆ
వేషంలో అతను బాగాలేడు. నాటకం పూర్తయింది. ఎనిమిది
వందల అప్పు మిగిలింది.
 దాంతో గోపాలం తలక్రిందులయ్యాడు. డబ్బుకుడబ్బు
పోయి శనిపట్టినట్లయింది అతని పని. పాపం ఏం చేస్తాడు.
హంసను చేద్దామని అతని ప్రయత్నం కాని అది కాకి అయి
వూరుకుంది.
 గోపాలం కుటుంబఝనికి కష్టాలు ప్రారంభమయ్యాయి.
వచ్చే జీతాన్ని అపిపులవాళ్ళు ఆఫీసువద్దనే వడ్డీల క్రింద జమ
వేసుకున్నారు. అప్పులు అప్పులుగా మిగిలిపోయాయి. ఇంటికి
పది రూపాయలు కూడా తేలేకపోతున్నాడు. ఆ పది
రూపాయలతో నెలరోజులు ఎలా గడుస్తుంది.
 కాగా చిల్లరబాకీలు అతని ప్రాణాన్ని తీసివేస్తున్నాయి
-9-
కొన్ని రోడ్లు వెంట అతను నడవనే నడవడు. ఎందుకని
అంటారేమో ఆ బం,ార్లలోగల కొట్లువాళ్ళు పీక్కుతింటారని.
 చూశారా!చిన్న ఒక్క పొరపాటువలన గోపాలం
ఎన్ని బాధలకు గురి అయ్యాడో!
 ఇటువంటివి అంటే గోపాలంవంటి వాళ్ళు అనేకమంది
మన మధ్య వున్నారు. వారు యిటువంటి పనులు మానివేస్తే
వారి సంగతి అలావుంచి, అతనిమీద ఆధారపడి బ్రతుకుతున్న
వాళ్ళందరూ సుఖపడతారు.
 ఒక్క నాటకాల అన్నమాట యేమిటి, ఇటువంటివి
చాలా వున్నాయి. పేకాట, సారాయి త్రాగడం, బ్రాకెట్టు
యిటువంటి వాటివలన ఎన్నో కుటుంబాలు
నాశనమవుతున్నాయి. అవసర ఖర్చులు తగ్గించుకోమనిగాదు, అవసరం
అన్న దానిని మనం తప్పకుండాకొనాలి. దానికోసం మనం
ఖర్చు చేయాలి.
 అయితే దేనికోసం మనం ఖర్చు చేయాలి? మనకు
అవసరమైన వాటి కోసం మాత్రమే మనం ఖర్చు చేయాలి.
ఆ అవసరాలుకూడా మనకు, మన జీవితానికీ, మన
కుటుంబానికి సంబంధించినవై వుండాలి.
 ఇప్పుడు మనకు అవసరమైన వాటిని గురించి
ఆలోచిద్దాం.
-10-
మనకు అవసరమైనవి:
 అయితే అన్ని ఖర్చులు మానివేయమని యెవరూ
అనరు.
 మనకు మన కుటుంబానికి అవసరమైనవి కొన్ని
వుంటాయి. వాటిని ఎవరూ కాదనరు.
 అటువంటి అవసరమైన కొన్నివస్తువులను గురించి
మనం తెలుసుకుందాం.
 ఆహారము
 గృహము
 వస్త్రము
 ఈ పై మూడు అందరికి కావాలి. ఇవి కనీస
అవసరాలు. ఇవి లేకుండా ఎవరికీ గడవదు.
 ఆహారం మనకు ఎంతో అవసరం. మన శరీరానికి
కావలసిన శక్తిని యిచ్చేది. అదే " తిండి వుంటేనే కండ,
కండ కలిగినవాడే మనిషి" -
 శరీరానిక ఒక ఆచ్చాదన అవసరం. ఇటు ఎండ,
వానలనుండి కాపాడటానికి, అందంగా వుండటానికి వస్త్రాలు
ఎంతో అవసరం.
 ఇకపోతే యిల్లు. ఏది వున్నా లేకపోయినా మనిషన్న
వాడికి వసతి అనేది చాలా ముఖ్యం.
-11-
 ఈ మూడు ముఖ్యమైన వాటి కోసం మానవుడు
నిరంతరం బాధపడుతూ వుంటాడు.
 తనకు వచ్చిన ఆదాయంతో సుఖమైన జీవితం కావాలి.
అపుడే మనిషి సుఖపడతాడు.
 అయితే సుఖమైన జీవితం ఎలా సిద్ధిస్తుంది? ఇదేమీ
బ్రహ్మ విద్య కాదు. అందరకూ లభ్యపడేదే అయితే
అందుకోసం మనం కొద్దిగా ప్రయత్నం చేయాలి. మనంచేసే బహు
చిన్న ప్రయత్నంవలనే మన జీవితాన్ని మనం సుఖవంతం
చేసుకోగలం.
 సుఖ జీవితం కోసం మనం చేయవలసిన ముఖ్యమైన
పని ఏమిటి? అన్న విషయం మనం తెలుసుకుందాం.
 అన్నిటికంటె ముఖ్యమైన విషయం పొదుపు. పొదుపు
అంటే వున్న అవస఼రమైన వాటిని ఆపుచేయడంకాదు.
అనవసరపు ఖర్చు తగ్గించుకోడం. అందువలన కొంత డబ్బు
మిగులుతుంది. ఆ డబ్బు మరో ముఖ్యమైన ఖర్చుకు పనికి
వస్తుంది.
 కృష్ణమూర్తికి యింకా పెళ్ళి కాలేదు. బి.ఏ.వరకూ
చదువుకున్నాడు. మొన్ననే పాసయినట్లుకూడా తెలిసింది.
అందువలన వెంటనే బెడవాడలో ఉద్యోగం దొరికింది.
 నూట పాతిక రూపాయలు అతనికి జీతం. అతనికి
-12-
ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియదు. అనవసరం
ఖర్చుచేసేవాడు. రోజు మార్చి రోజు సినిమాకు వెళ్ళేవాడు. ఒక్కడు
కాబట్టి అతనికి ఏమీ యిబ్బంది లేదు. అతను ఆడింది ఆట,
పాడింది పాట.
 ఇప్పుడతనికి పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కలిగారు.
కాని ఇదివరకు అలవాటయిన అనవసరపు ఖర్చులు మానలేక
పోయాడు.
 అందువలన అతను అప్పుల పాలయ్యాడు. అప్పుల
వారి బాధ ఎక్కువైంది. అతనికి మనశ్శాంతి తక్కువైంది.
 ఇలా ఎవరూ చేయకూడదు. అది అంత మంచి పని
కాదు. ఎందుకంటారేమో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి.
కాని దుఃఖమయం చేసుకోకూడదు.
 ఈవేళ మనం సంపాదిస్తున్నాం సంపాదించే డబ్బును
జాగ్రత్తగా ఖర్చు చేయడం నేర్చుకోవాలి.
 రామారావు అలానే చేశాడు. రామారావుకు వంద
రూపాయల వరకూ వస్తుంది. నెలకు వందరూపాయల వరకూ
వస్తుంది. నెలకు అతడు వంటరివాడు అయినా జాగ్రత్తగల
వాడు అందుచేత వచ్చిన వంద రూపాయలను అనవసరంగా
ఖర్చు చేసేవాడు కాదు. నెలకు నలభై రూపాయల వరకూ
మిగిల్చేవాడు.
-13-
 పెళ్ళి అయింది భార్య కాపురానికి వచ్చింది. ఒక
ఏడాది గడిచింది. ఒక పిల్లవాడు. రోజులు గడిచాయి.
కుటుంబం పెరిగిపోయింది. ఇప్పుడు రామారావు కుటుంబంలో
ఎనిమిదిమంది సభ్యులు. రామారావు ఒక్కడే సంపాదించాలి
ఎనిమిదిమంది ఆ వంద రూపాయలతో బ్రతకాలి.
 అయినా రామారావుకు యిబ్బంది లేదు. అతనికి ఏ
బాధాలేదు.
 ఎందుకో తెలుసా? అతను పొదుపరి కావడమే. ఎంతో
అవసరం అనుకుంటేనేగాని అతను ఏ వస్తువూ కొనడు.
 ఈ రోజున మనం చేసే పొదుపు, రేపటి మన పిల్లలకు
పొదుపు అన్న విషయం అతనికి తెలుసు.
 అంతా అదే విధంగా వుండాలి. మనకు ఏది
అవసరమో వాటి కోసమే మనం ఖర్చు చేయాలి. ఈ రోజున
వుంది కదా అని అనవసరపు ఖర్చులు చేస్తే రేపటి రోజున
మనమే చాలా బాధపడవలసి వుంటుంది.
 కొందరు మరొక తప్పు పని చేస్తున్నారు. దాన్ని
పూర్తిగా తప్పు పని అనడానికి వీలులేదు. వారి కుతూహలం
వారిచే అలా చేయిస్తుంది.
 ఏమీ లేదు పక్కింటి పుల్లయ్యగారు మల్లు పంచె
కట్టుకున్నారు. ఎదురు వీధిలో వుండే మునసబు చౌదరిగారు
-14-
పొందూరు సిల్కు దోవతి ధరించారు. అటువంటివి తను
కూడా ధరించాలి అని తలుస్తారు కొందరు.
 అలా అవసరపడటం మంచిది. దాని కోసం కృషిచేసి
కష్టపడి సంపాదించి కొనుక్కుని తమ కోరికను తీర్చుకోవడం
కూడా మంచిదే. అయితే అంత అవసరం ఏమి వచ్చింద఩ి?
ఎవరో ఏదో చేశామని మనం చేస్తూ కూర్చుంటామా? పులిని
చూసి నక్కలు వాత పెట్టుకున్నట్లు అవుతుంది.
 మరికొందరు ఎవరికో వున్న వస్తువు వంటిది తమకు
వుండాలని అనుకుంటారు. అనుకోవడమైతే అనుకుంటారు.
కాని అందుకోసం కష్టపడరు. ఎక్కువ డబ్బును
సంపాదించలేరు. ఉన్న దానిలోనే ఖర్చు చేస్తారు మిగిలిన డబ్బు ఇంటికే
సరిపోదు అందుకోసం యెక్కడో అప్పుతెచ్చి గడవటం ఆ
అప్పును తీర్చలేకపోవడం అప్పుల వాళ్ళచేత నానా మాటలు
పడటం ఎందుకొచ్చిన బాధ యిదంతా! వారు ధరించిన
గుడ్డలు ధరించకపోతే మనకు గడవదా!
 ఆ మాటకువస్తే అసలు గుడ్డలు కోసం ఎక్కువ ఖర్చు
చేయడం అంత మంచి పనికాదు. సామాన్యమైన గుడ్డలు
తక్కువ ఖరీదుగలి కొనడం మంచిది. ప్రభుత్వంవారు
ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర విక్రయశాలలో చవకగా
నాణ్యమైన గుడ్డలు అందమైన గుడ్డలు లభిస్తాయి. గుడ్డల కోసం
ఎక్కువ ఖర్చు చేయవద్దు.
-15-
 గోడలకు పెట్టింది, గుడ్డలకు పెట్టింది అసలు తిరిగి
రాదు అని మనకొక సామెత వుంది. దాని అర్దం యిదే.
 ఇక కొంతమంది సంగతి ఆలోచిద్దాం. కాఫీ
హోటళ్ళలో యిష్టం వచ్చినట్లు తింటూ వుంటారు. దానితో వారి
ఆకలి చచ్చిపోతుంది. సరైన ఆహారం లేకపోతే, శరీరానికి
శక్తి ఎక్కడ్నుండి వస్తుంది.
 కాగా మరొక నష్టం వుంది. తన పొట్ట కోసం
హోటలులో తింటున్నారు. తనమీద ఆధారపడివున్న వారి సంగతి
ఆలోచించడం లేదు. అందువలన కుటుంబం మొత్తం తిండి
కోసం బాధపడవలసి వస్తోంది.
 ఇటువంటి అదనపు ఖర్చులు చేయకుండా వుండాలి.
 అందువలన ఎంతో సుఖం వుంది. డబ్బు ఖర్చు కాదు.
ఆరోగ్యం చెడదు. కుటుంబం మన కోసం బాధపడదు.
ఉన్నంతలో:
 ఉననంతలో మనము నారాయణా
 ఉన్నతిగ వుండాలి నారాయణా
 అవును అది చాలా మంచిది. అంతా ఆ విధంగా
XHrakdl.
-16-
 ఆ విధంగా చేయాలంటే అందరరూ
సాధ్యపడుతుందా?
 తప్పక సాధ్యపడుతుంది.
 ఉన్నంతలో మనం సుఖంగా వుండాలి. అందుకు
కొన్ని మార్గాలున్నాయి. అవి అనుసరించ తగ్గవి. వాటిని
మనం అవలంభంచగలిగితే చాలు. మనం చాలా
సుఖమంతమైన జీవితం గడపగలం.
 మొదటికి మనకు కొన్ని అవసరాలు వున్నాయి.
వాటిని గురించి మనం తెలుసుకొన్నాం. ఆ అవసరాలు
ముందు తీర్చుకోవాలి.
 ఆహారానికి మనం ఖర్చు చేయాలి. అయితే ఖరీదైన
వస్తువులు మనం కొనరాదు. మనకు అందుబాటులో వుండేవి
చౌకగా వుండేవి, (ఆకు కూరలు మొదలయినవి) తాజా
సరుకులను మాత్రమే కొనాలి.
 జీవితావసరాలలో ఆహారం తరువాత ముఖ్యమైనవి
దుస్తులు.
 దుస్తుల కోసం ఎక్కువ ఖర్చు చేయడం అంత మంచి
పని కాదు.
 మనం వేడి దేశంలో వున్నాం. కనుక తెల్లని దుస్తులు
ధరించడం మంచిది.
-17-
 చేనేత సంఘంవారి విక్రయశాలలోనూ చేతి పరిశ్రమల
విక్రయశాలలోనూ చవకగా దొరుకుతాయి. గుడ్డ
నాణ్యంగానూ వుంటుంది. చూపులకు బాగానూ వుంటుంది. పోతే
మన్నిక సంగతి ఆశలు మనం చెప్పుకోనవసరం లేదు.
 కొందరు నైలాను దుస్తులు ధరిస్తారు. అది మంచిది
కాదు. దానివలన చాలా చెరుపులు వున్నాయి.
 1. శరీరానికి గాలిని తగులనియ్యదు.
 2. నిప్పుకు కరిగిపోయే గుణం నైలానుగుడ్డకు వుంది.
 3. నైలాన్ దుస్తులు ధరించినందువలన తామర,
 దురద మొదలైన వ్యాధులు రావచ్చునని
ఇటీ వలనే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
 ఇక స్త్రీల విషయంలో ఇది అసలు తగదు నైలానే
వస్త్రం శరీరంలోని అవయివాలను గోప్యంగా వుంచేలదు.
అందువలన శరీరంలోని అవయవాలన్నీ కొట్టవచ్చినట్లు
బయటకు అగుపిస్తాయి.
 గృహ విషయంలో ముందే చెప్పుకున్నాం. అదే
విషయం జాగ్రత్తగా మనసులో వుంచుకుంటే మంచిది. `ఎంత
చెట్టుకు అంత గాలి' అన్న విషయం అందరకూ తెలిసినట్టిదే.
-18-
 ఇంకా కొన్ని పద్ధతులు మనం అలవాటు చేసుకోవాలి.
అలా అలవాటు చేసుకొన్నందువలన ఎన్నో ఉపయోగాలు
వున్నాయి.
 1. వలుగురితో పాటుగా కాఫీ హోటళ్ళకు పోవడం.
 2. పొగతాగే అలవాటు.
 3. పేకాట.
 ఇటువంటి అలవాట్లను మనందరికీ రానీయకూడదు.
 ఈ విధంగా చేసినందువలన ఉన్నంతలో
సుఖపడవచ్చు.
 అయితే ఇక్కడ యింకొక ప్రశ్న వుంది.
 ఉన్నంతలో అందరూ సుఖంగా వుండవచ్చా?
 కొందరు సుఖంగా వుండలేకపోతున్నారు. అలా సుఖ
జీవనం సాగించుకోలేకపోవడానికి కారణం అనేకం
వుండవచ్చు. అనేక చెడు అలవాట్లకు లోనుకావడంవల్లగాని, లేక
చీట్లపేక, త్రాగుడు మొదలైన దురభ్యాసాలవలన కావచ్చు.
వీటివల్ల సుఖప్రదమైన జీవితాన్ని ఎవరూ గడపలేరు.
 అయితే - ఇటు ఏ విధమైన చెడు అలవాటులేనివారి
జీవితాలు మనం పరిశీలించకోవలసి వుంది. అలా
పరిశీలించినందువలన మనకు కొన్ని కొత్త సంగతులు తెలుస్తాయి.
-19-
రామయ్య కుటుంబం:
 రామయ్య కుటుంబం సరిగా అటువంటిదే.
 రామయ్య అప్పుడే పొలంనుంచి యింటికి వచ్చాడు.
తలపాగ విప్పదీసి ఒక మూలకు విసిరివేశాడు. మంచం మీద
ఉసూరుమంటూ కూలబడ్డాడు.
 అతని మనసు చాలా చికాకుగా వుంది ముఖం మాడి
పోయినట్లుగా వుంది. భార్యను పిలిచాడు. కాసిని మంచినీళ్లు
యివ్వమన్నాడు.
 ఆమె లోనికి వెళ్ళింది మంచినీళ్ళు తీసుకురావడానికని.
ఈ లోపల రామయ్య మనసు పరిపరి విధాలుగా పోయింది.
 రామయ్యను ఉదయం షావుకారు రంగయ్య నానా
మాటలూ అనిపోయాడు. అందువల్ల అతని మనసు పాడై
పోయింది. రంగయ్యకు అయిదు వందలు బాకీ వున్నాడు
రామయ్య. ఆ బాకీ కోసం రంగయ్య, రామయ్యను యిష్టం
వచ్చినట్లలా మాట్లాడిపోయాడు.
 రామయ్య చిన్న రైతు. ఉన్నది మూడెకరాల పొలం.
అతనికి ఇద్దరు సంతానం. పెద్దమ్మాయికి పోయిన మాఘ
మాసంలో పెళ్ళిచేశాడు. అప్పుడు డబ్బుకు కొంచెం ఇబ్బంది
వచ్చి షావుకారు రంగయ్య దగ్గరకు వెళ్ళి, అప్పు అయిదు
వందలు తెచ్చాడు.
-20-
 అలా రంగయ్య నానా మాటలు అనటంతో రామయ్య
పంటను అమ్మి అతని అప్పు తీర్చివేశాడు.
 అలా పంటను ముందుగా అమ్మడం చాలా తెలివి
తక్కువ పని అలా అమ్మినందువలన రైతుకు అనేక
విధాలైన నష్టాలు వున్నాయి.
 పంటకు ముందు ముందు బాగా రేటు పలకవన్చు.
గిరాకీ హెచ్చిందా అంటే నాలుగు డబ్బులు మిగలవచ్చు.
పంటను ముందుగా అమ్ముకుంటే ఈ సుఖం వుండదు ఈ
లాభం వుండదు. పంటను అమ్మేరోజున ఏ రేటు వుంటే అదే
రేటుకు కొంటాడు షావుకారు.
 రామయ్యకు ఈ విషయాలన్నీ తెలుసు. తెలిసి కూడా
ఏం చెయ్యగలడు? అందుకు మరి గత్యంతరం లేదు అవతల
పెళ్ళి - మాటలా!
 అయితే ఆ ఏడాది వర్షాలు సరిగా లేని కారణం వలన
పంట అనుకున్నంత దిగుబడి కాలేదు. అయినా అప్పు
తప్పదుగా!
 ఇంతలో అతని భార్య మంచినీళ్ళు తీసుకుని వచ్చింది.
రామయ్య ఆత్రంగా ఆ మంచినీరు తాగేశాడు.
 ఆమె ఇంకా అలాగే నిలబడి వుంది. కారణం ఏమిటి
అన్నట్లుగా ఆమెవంక చూశాడు.
-21-
 "వచ్చేది పెద్ద పండుగ కదా! అల్లుడ్ని ఇంటికి
తీసుకొద్దామని" అన్నది ఆమె.
 చిన్నవాడు "నాన్నా గుడ్డలు చిరిగిపోయాయి -
కొనిపెట్టు నాన్నా? `సరే' నంటాడు రామయ్య.
 "రేపు పుస్తకాలు కొనకపోతే బడికి రావద్దని మాష్టారు
అన్నారు నాన్నా" అని మళ్ళీ చెప్పాడు.
 ఇటువంటి కష్టాలలో రామయ్య ఏం చేయగలడు?
అతనికి ఏ విధమైన ఒడిదుడుకులు లేని జీవితం కావాలి. అందుకు
ఏం చేయాలి?
 అలాగే వరదరాజు జీవితం కూడాను; పిల్లలు ఎక్కువ
మంది. వారందరికీ చదువులు, తిండి, గుడ్డ - ఇవన్నీ
సమకూర్చాలి వచ్చే నూటయాభై రూపాయలు జీతం. ఎలా
సరిపోతుంది.
 ఈ విధంగా - ఇబ్బందులు పడుతున్న వారి విషయంలో
కొన్ని మార్గాలున్నాయి.
 ఆదాయాన్ని పెంచుకోవడం.
 సంతనాన్ని తగ్గించుకోవడం.
 పొదుపు చేసుకోవడం.
 ఒక్కొక్క విషయాన్ని గురించి వివరంగా, విపులంగా
తెలుసుకుందాం.
-22-
ఆదాయాన్ని పెంచుకోవడం:
 ఆదాయాన్ని పెంచుకోవాలి. గాని, వచ్చే మార్గాలేమీ
లేవు. కనుక ఖర్చులు అవసరమైన వాటిని కూడా
తగ్గించుకోవాలి అని కొందరనుకుంటారు. అలా అనుకోవడమేగాని
అది జరిగే పనికాదు? ఒకవేళ ఎవరైనా అలా అనుకోవచ్చు.
 ఎందుకంటారా! తిండి తినక తప్పదు. గుడ్డ
కట్టుకొనకా తప్పదు. పోతే ఇల్లు విషయం యిక చెప్పనవసరం
లేదు. అయితే ఖర్చులు తగ్గించుకోవాలి అని అనుకొనడం
మంచి పని. అలా కుదరదు. అప్పుడు ఏం చేయాలి.
ఆదాయాన్ని పెంచుకొనడం ఒకటే మార్గం.
 ముఖ్యంగా ఆదాయాన్ని పెంచడానికి అనేకమార్గాలు
వున్నాయి.
 1. మనకు అవసరమైన వస్తువులు కొన్ని వున్నాయి.
ఆ వస్తువులు అవసరమే. అయితే ఆడంబరం మాత్రం తగదు.
 ఉదాహరణకు వస్త్రాలు అందరికీ అవసరమే అయితే
ఖరీదైన సిల్కుగుడ్డలు ఆరోగ్యాన్ని చెడగొట్టే నైలాన్ గుడ్డలు
కొనరాదు.
 2. రెండవ విధంగా మనం ఆ ఆదాయాన్ని యెలా
వృద్ధి చేయవచ్చో చూద్దాం.
-23-
 మనకు కొన్ని చెడు అలవాట్లు అంటే చుట్ట, బీడీ,
సిగరెట్టు, కల్లు-సారాయి, పేకాట ఆడటం మొదలైనవి వుంటే,
ఇటువంటి వాటిని మనం పూర్తిగా తగ్గించివేయాలి.
 మనకు కొన్ని తీరిక సమయాలు వుంటాయి. ఈ
తీరిక సమయాలను మనం సద్వినియోగ పరచుకోవాలి. అలా
సద్వినియోగ పరచుకొనటం వలన మన ఆదాయం పెరిగే
అవకాశాలు చాలా వున్నాయి.
తీరక వేళల్లో:
 తీరిక వేళల్లో మనం చేయగల పనులు అనేకం
వున్నాయి.
 మధ్యాహ్న సమయాలలో సామాన్యంగా ఆడవారికి
పని వుండదు. వారు ఈ సమయాలలో పక్కింటి
అమ్మలక్కలతో కబుర్లు మొదలు పెడతారు. మధ్యాహ్న సమయమంతా
ఆ విధంగా వృధా అయిపోతున్నది.
 తీరిక సమయాలను సద్వినియోగ పరచుకొనవలసిన
బాద్యత స్త్రీలమీద వుంది.
 మధ్యాహ్న సమయాలలో చేయగల పనులను మనం
పరిశీలిద్దాం.
 1. అప్పడాలు, వడియాలు.
-24-
 2. లేసులు అల్లడం.
 3. విస్తళ్ళు కుట్టడం.
 4. ఒరుగులు తయారుచేసుకొనడం.
 5. అగ్గిపెట్టెలు చేయడం.
 6. కూరగాయలను పండించడం.
 7. ఇంటి తోట.
 8. పిల్లల చదువులు.
 9. బుట్టలు, చాపలు అల్లుకోవడం.
 10. మేజోళ్ళు, స్వెర్టర్లు అల్లడం.
 11. చారుపొడి, ఊరగాయ.
 వీటిలో ఒక్కొక్కదాన్ని గురించి విపులంగా
తెలుసుకుందాం.
అప్పడాలు - వడియాలు:
 ఈ రెండు ప్రతి ఇంటికీ అవసరం. అప్పడాలు,
వడియాలు వుంటే ప్రత్యేకంగా కూరలు లేకపోయినా గడిచి
పోతుంది. పోతే ఇవి రుచిగా కూడా వుంటాయి.
 వడియాలను, అప్పడాలను తయారుచేసే పద్ధతి చాలా
మందికి తెలుసు. ఆడవారిలో యించుమించు అందరికీ యివి
-25-
ఎలా తయారుచేయాలో తెలుసు - ఒక్క చదువుకున్న
ఆడవారికి ఈ విషయం తెలియకపోవచ్చు.
 మధ్యాహ్న సమయాలలో అమ్మలక్కలు కబుర్లకు
అలవాటుపడి, ఉపయోగపడే పనులు చేసుకోలేకపోతున్నారు
మన స్త్రీలు.
 అప్పడాలు, ఒడియాలు బజారులో దొరుకుతున్నాయి.
దీనికోసం ఎందుకు బాధపడడం - రెండు రూపాయలు పడేస్తే
దొరకవా! అనుకుంటారు కొంతమంది.
 లెక్కకు రెండురూపాయలు చాలా తక్కువే! అయితే
ఆ రెండు రూపాయలు సంపాదించడం ఎఁతో కష్టం. కాని
ఖర్చు చేయడం చాలా తేలిక.
 అప్పడాలు, వడియాలు మధ్యాహ్న సమయాలలో
తయారు చేసుకోవచ్చు.
 ఇలా తయారు చేసుకున్నందువలన ఇటు డబ్బు ఖర్చు
ఱెక్కువ వుండదు. అటు పరిశుభ్రంగా తయారు చేసుకోనూ
వచ్చు.
లేసులు అల్లడం:
 గృహాన్ని అలంకరించుకోవలసిన బాధ్యత ఇంటి
ఇల్లాలిపై
-26-
వుంటుంది. ఇల్లాలిని చూచి ఇల్లును చూడమని మనకు
సామెత వుంది. ఆ సామెతలో అర్ధం యిదే.
 ఇంటిని బాగా అలంకరించుకొన్నందువలన చాల
ఉపయోగాలు, లాభాలు వున్నాయి.
 కావలసిన వస్తువు సమయానికి దొరుకుతుంది.
 అందంగా వున్న చోట వస్తువులను అమర్చుకోవచ్చు.
 శుభ్రంగా సామానులు సర్దుకొన్నందువలన పురుగులు
దోమలు వుండవు.
 అలంకారం విషయం వచ్చినప్పుడు లేసులు మర్చిపో
రాదు.
 గుమ్మం తెరలు, కిటికి తెరలు మొదలైనవి యివి
అల్లుకోవచ్చు. లంగాలు, పరికిణీలు మొదలైన వాటి అంచులకు
లేసులు అల్లుకుంటే ఎంతో అందంగా వుంటాయి.
 లేసులు అల్లకం ఒక కళ. కళాత్మకమైన ఈ చి఩్న
కృషిని ప్రతి స్త్రీ తన తీరిక సమయంలో చేయడం మంచిపని.
విస్తళ్ళు:
 ప్రతిరోజూ అవసరమయ్యే వస్తువులలో విస్తళ్ళు కూడా
ఒకటి. ఇవి ప్రతి యింటికీ అవసరం.
 చాలా కుటుంబాలు విస్తళ్ళను బజార్లో కొంటున్నారు.
-27-
చాలా దండగ అని కొనేవారికి కూడా తెలుసు. తెలిసికూడా
చేస్తున్న తప్పు పని అది. దీనికి కారణం ఒకటే. బద్దకం
బద్దకం వలన అనేక నష్టాలు వున్నాయి. ఇంగ్లీషు భాషలో
ఒక సామెత వుంది.
 "పనిలేనివాని మనసు దయ్యాలకు నివాసం" అని.
 బద్దక జాడ్యాన్ని వదిలించుకుని ఉపయోగపడే పనులు
చేసుకోవడం అవలరచుకుంటే - ఇటు మీకు ఒక పని
చేస్తున్నామనే తృప్తి వుంటుంది. అనవసర ప్రసంగాలు వుండవు.
కాగా కుటుంబపు ఖర్చులు కొంత తగ్గుతాయి.
ఒరుగులు తయారుచేసుకోవడం:
 ఒరుగులు తయారు చేసుకోవడం చాలా అవసరమైనది
చాలా విధాలుగా మనకు సహాయకారి.
 అన్ని కాలాల్లోనూ కూరగాయలు చవుకగా లభ్యం
కావు. ఒక్కొక్క సమయంలో ఈ కూరగాయల ధరలు మరీ
విపరీతంగా వుంటాయి.
 కూరలేని తిండి తిండికాదనే అంటారు పెద్దలు.
కూరగాయలలో మన శరీరానికి కావలసిన అనేక విటమినులు
వున్నాయి.
 అందుచేత కూరగాయలు చౌకగా దొరికే కాలంలో
ఒక పని చేయడం మంచిది.
-28-
 ఎక్కువగా కూరగాయలు కొనడం - ఆ
కూరగాయలను ముక్కలుగా తరిగి ఎండబెట్టాలి బాగా ఎండిన తర్వాత
వాటిని ఒక డబ్బాలో గాని, సీసాలోగాని వేసుకోవాలి. అలా
అవి చాలాకాలం నిలువ వుంటాయి. ఒరుగులు యిటు
తినడానికి రుచికరంగానూ వుంటాయి. అటు కూరలు దొరకని
సమయంలో కూరగా ఉపయోగపడతాయి.
 ప్రతి కుటుంబమూ ఈ విషయం గుర్తుంచుకోవాలి
ఎందుచేతనంటే కూరలు లేకుండా ఎవరికీ గడవదు.
అందుచేత కూరల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తోంది.
అలా ఎక్కువ ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చుతో మన
అవసరాలను ఈ ఒరుగులు తీరుస్తాయి.
 ఈ విధంగా కొంత ఖర్చును మనం తగ్గించుకోవచ్చు.
అగ్గిపెట్టెలు:
 ఈ కాలంలో ఇంటి దగ్గర కూర్చుని కడుపులో చల్ల
కదలకుండా పనిచేసుకోవడానికి అనేక అవకాశాలు
వున్నాయి.
 మగవాడు బయటకు పోతాడు. అనేక విధాలుగా కష్ట
పడతాడు. కొంత సొమ్ము సంపాదిస్తాడు. ఆ సొమ్ముతో
తన కుటుంబాన్ని పోషిస్తాడు. ఇది సామాన్యంగా జరిగే
విషయం.
-29-
 అయితే ఒకరి సంపాదన-ఆ సంపాదనతో నలుగురు
బ్రతకడం - ఇది చాలా కష్టతరమైన విషయం.అందువల్లనే
మన దేశంలో అనేక కుటుంబాలు బీదతనంతో
బాధపడుతున్నాయి.
 మగవాడితో సమానంగా స్త్రీ కూడా కష్టపడితే -
ఇంక కావలసినదేముంది? అప్పుడు ఆ కుటుంబం సుఖ
సంతోషాలతో వెలుగొందుతుంది.
 కాని మన దేశంలో చాలామంది దీనికి యిష్టపడరు.
"ఆడవారు ఏమిటి - పనిచేయడమేమిటి?" అని.
 పని చేయడం ఎప్పుడూ తప్పు కాదు.
 కాగా - అది చాలా గౌరవప్రదమైనది.
 కొందరు ఆడవాళ్లు బయటకు వెళ్ళడానికి యిష్టపడరు.
అటువంటివారు కూడా కష్టపడి పనిచేయడానికి అనేక
అవకాశాలు వున్నాయి.
 మనకు స్వతంత్రం వచ్చింది. మన దేశాన్ని కచమనమే
పరిపాలించుకుంటున్నాం. మన దేశం చాలా బీద దేశమని
మనందరికీ తెలిసిన విషయమే.
 అందుకని మన ప్రభుత్వం వారు కొన్ని వధకాలను
తయారుచేశారు. ఆ మాదిరిగానే కుటీర పరిశ్రమలను, చేతి
వృత్తులను ప్రోత్సహించారు.
-30-
 అలా ప్రోత్సహించబడిన పరిశ్రమలలో దంపుడు
బియ్యం పరిశ్రమ, నేత పరిశ్రమ, అగ్గిపెట్టెలు పరిశ్రమ
మొదలైనవి చాలా వున్నాయి.
 అగ్గిపెట్టెలను అతికించడం, పుల్లలను పేర్చడం,
ఇటువంటివి చాలా చి఩్న పనులు. ఇవి ఆడవారు ఇంటి దగ్గర
కూర్చుని చేయవచ్చు.
 ఈ విధంగా చేయడం వలన తీరిక సమయాలు వృధా
కావు.
 కొంత ఆదాయం చేతికి అందుతుంది.
 మగవాని సంపాదనకు అండగా చేదోడు వాదోడుగా
వుంటుంది.
 అవునుమరి. వేనీళ్ళకు చన్నీళ్ళు కలిపినట్లు -
కూరగాయలను పండించటం:
 తీరిక వేళల్లో చేయదగిన పనులు అనేకం వున్నాయి.
 తీరిక వేళల్లోనేగాక మనం విధిగా చేయదగిన పనులు
కొన్ని వున్నాయి. అటువంటి వాటిలో కూరగాయలను
పెంచటం కూడా ఒకటి.
 మనం కూరగాయలను ఎఁదుకు పెంచాలి? నిజమే.
ఇది మంచి ప్రశ్నే. అందరికీ తెలిసిన విషయమే కూడా.
-31-
 మనం మన పని చేయటానికి అవసరమైన శక్తి కోసం
ఆహారాన్ని భుజించవలసి వుంది. విటమినులుగల ఆహారం
మంచి ఆహారం విటమినులు ఎక్కువగా కూరగాయలలో
వున్నాయి. అందుచేత కూరగాయలు మన ఆహారానికి ఎంత
అయినా అవసరం.
 "కూరలేని తిండి కూడా ఒక తిండేనా?" అని పెద్దలు
అంటూ వుంటారు. దానికి ఇదే కారణం.
 కూరగాయల కోసం ప్రతిదినం కొంత ఖర్చు చేస్తూ
వుంటాం. ప్రతి కుటుంబానికి నెలకు అయిదారు రూపాయల
వరకు కూరగాయల ఖర్చు తప్పక వుంటుంది.
 కొంచెం కష్టపడితే ఈ సొమ్మును మనం ఆదా
చేసుకోవచ్చు.
 ఆదా చేసుకోగలిగినదే ఆదాయం అవుతుంది.
 ప్రతి ఇంటికి ముందు భాగంలోగాని, దొడ్డిలోగాని
కొంచెం ఖాళీ స్థఴలం వుంటుంది పట్టణాలలో అన్ని ఇళ్ళకూ
ఈ సౌకర్యం వుంటుంది.
 ఈ విధంగా ఖాళీస్థలం వున్న యింటి యజమానులలో
చాలామంది ఖాళీ స్థలాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలేదు.
 ఖాళీ స్థలాలలో కూరగాయలను పండించుకొనడ఼ం
చాలా మంచిది.
-32-
 కూరగాయలను పండించడం చాలా తేలిక. మనం
చాలా తక్కువగా కష్టపడితే చాలు. రుచికరమైన,
పుష్టికరమైన కూరగాయలను పండించుకోవచ్చు. కాగా కొంత
సొమ్మును ఆదా చేసుకోవచ్చు.
 ఖాళీస్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. గడ్డి, గాదం, రాళ్లు
ఏరిపారవేయాలి. తరువాత మంచి విత్తనాలు జల్లాలి. రోజూ
నీళ్ళు పోయడం మాత్రం మరచిపోరాదు.
 మన ఇళ్ళలో సులువుగా పండించుకోడానికి వీలయిన
కొన్ని కూరగాయలు.
 వంకాయ,
 బెండకాయ,
 బీర,
 పొట్ల,
 చిక్కుడు,
 అరటి,
 తోటకూర,
 గోంగూర,
 కొత్తిమీర,
 మెంతికూర మొదలైనవి.
 ఈ విధంగా చేసినందువలన మనకు ఎన్నో
ఉపయోగాలు వున్నాయి.
-33-
 మొదటిది: మనకు ఇష్టమైన కూరగాయలను మనం
పండించుకోవడానికి అవకాశం వుంటుంది.
 రెండవది: రుచికరమైన, పుష్టికరమైన
కూరగాయలను పండించుకోవచ్చు.
 ఇక మూడవది: కూరగాయల కోసం ప్రతి నిత్యం
మనం వెచ్చించే డబ్బును ఆదా చేసుకోవచ్చు.
 అయితే ఇన్ని లాభాల కోసం, మనం ఏమైనా
ఎక్కువగా కష్టపడాలా అంటే అదీలేదు. కష్టం చాలా తక్కువ
ఫలితం అధికం.
ఇంటి తోట:
 మరొకటి ఇంటి తోట. ప్రతి ఇంటికి ఒక తోట
వుండటము అవసరం. ముందు, వెనుక భాగాలలో ఖాళీస్థలంలేని
వాళ్ళుకూడా కుండీలలోనైనా తోటను పెంచటం అవసరం.
 తోట చాలా అవసరం అని చెప్పుకున్నాం. ఎందువలన
తోట అవసరమో చెప్పుకోవలసివపుంది.
 తోట వలన పరిశుభ్రమైన చల్లని గాలి లభిస్తుంది.
 ఆకర్షణీయంగా వుంటుంది. గృహానికి అందాన్నిస్తుంది
పగలంతా అనేక రకాలైన వృత్తులలో కష్టపడి పనిచేసినవారికి
ఈ యింటి తోట, ఆహ్లాదాన్నొసగుతుంది.
-34-
 తోటను పెంచుకోవాలి అనుకొన్నప్పుడు, వ్యవసాయ
శాఖాధికారులను కలుసుకుని వారి అభిప్రాయాన్ని కూడా
తీసుకోవడం ఎంతైనా అవసరం.
 తోటలో అనేక రకాలైన మొక్కలను నాటవచ్చు.
 పూలమొక్కలు, కూరగాయల మొక్కలు, వైద్యానికి
పనికివచ్చే చెట్లు - మొదలుగాగలవి మనం పెంచుకోవచ్చు.
 తీరిక వేళలయందు చేసే ఈ కృషి వలన కొంత
ఆదాయం సమకూరుతుంది.
పిల్లల చదువులు:
 పిల్లలున్న యిల్లు ఆనందనిలయం. పిల్లలులేని యిల్లు
బోసిగా వుంటుంది.
 పిల్లల చదువులు, పెద్ద సమస్యే - ఎందుకంటారా!
వారికి బాద్యత తెలియదు. ఆడుతూ పాడుతూ కేరింతలు
కొడుతూ సరదాగా తిరుగుతూ వుంటారు దానిమీద వుండే
శ్రద్ధ చదువుమీద వుండదు. ఈ రోజున చదువుకొనక గాలికి
తిరుగుతూ వుంటే, రేపు బాధపడేది వారే. బాధపడేది వారే
అయినా అందుకు పూర్తి బాధ్యులు తల్లిదండ్రులే.
 ఈ విషయం ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి తెలుసు.
 అందుకోసమే అయిదో ఏడు రాగానే బడికి
పంపిస్తున్నారు.
-35-
బడిలో సరిగా చదువుతాడో, చదవడో అని యింటి
దగ్గర ఒక మాష్టారుచేత ప్రైవేటుకూడా చెప్పిస్తున్నారు.
 పిల్లల చదువుల విషయంలో శ్రద్ధపేరుతో ఈ విధంగా
కొంత డబ్బు ఖర్చు అవుతోంది.
 అయితే ఈ పద్ధతి చెడ్డది అనడం కాదు. ఇంతకంటే
మంచి పద్ధతులున్నాయి.
 రోజూ పాఠశాలలో చెప్పిన పాఠాలను యింటి దగ్గర
చదివిస్తే - ఇంక ప్రైవేటు మాష్టారు ఎందుకు?
 తల్లిదండ్రులు బద్దకిస్తే ప్రైవేటు మాష్టారు కోసం పది
రూపాయలు ఖర్చు-అందువలన పిల్లల చదువుల విషయంలో
తల్లిదండ్రులే శ్రద్ధ వహిస్తే చాలా మంచిది.
 ఇల్లాలు చదువుకుని ఉన్నట్లయితే ఈ బాధ్యత ఆమె
తీసుకోవడం చాలా మంచిది.
బుట్టలు - చాపలు అల్లడం:
 ఇది చాలా మంచి పని. ఉపయోగమైన పని. ప్రతి
ఇంటికి చాప, బుట్ట, చేట, విసనకర్ర - ఇవి చాలా అవసరమైన
వస్తువులు ఈ వస్తువులు లేకుండా గడపటం చాలా కష్టం.
 ప్రతి ఇంటిలోనూ ఇవి వుంటాయి. వీటికోసం పరాయి
వారిమీద ఆధారపడివుంటూ, డబ్బును ఖర్చు చేస్తున్నారు
చాలామంది.
-36-
 ఇవి మన ఇళ్ళ దగ్గర అల్లుకోవడం మంచిది.
పల్లెటూళ్ళలో చాలా మంది స్త్రీలు ఈ పనులు చేస్తారు.
నాగరికత మోజులో ఈ పనులకు పట్నవాసులు
అసహ్యించుకుంటున్నారు.
 పల్లెసీమల఼లో చివరకు ముఖ్య విషయాలు
మాట్లాడుకుంటున్నప్పుడుకూడా స్త్రీలుగాని, పురుషులుగాని ఏదో ఒక
పని తాళ్ళు పేనడం, బుట్టలు అల్లడం మొదలైన పనులు
చేస్తూనే వుంటారు. ఇది గమనించదగిన అంశం.
అల్లిక పనులు:
 అల్లిక పనులు అందరూ అంగీకరించినట్టివే. అయినా
దానివలన ఆదాయానికి బదులుగా ఎక్కువ ఖర్చు
అయిపోతున్నది. ఇందుకు కారణాన్ని మనం పరిశీలించవలసి వుంది.
 అల్లిక పనులు కోసం కొన్ని పనిముట్లు కావాలి ఈ
పనిముట్లు తక్కువ ఖరీదువి. ఎక్కువ ఖరీదువికూడా వున్నాయి.
ఎక్కువ ఖరీదువి, ఎక్కువ కాలం మన్నుతాయి అని కొందరి
ఉద్దేశ్యం అయితే ఇది కేవలం అపోహ.
 ఏ వస్తువు అయినా ఒకటే. మనం వాడుకోవటంపై
ఆధారపడివుంటుంది. మనం వాడకం సరిగా వుండనప్పుడు
ఎటువంటి వస్తువైనా యిట్టే పాడైపోతుంది.
 నవ వాగరికులం మేము అనుకుంటున్న యువతులు
కొందరు ఈ అల్లిక పనులు అంటే ఆసక్తి చూపుతున్నారు.
-37-
ఆసక్తి అయితే చూపవచ్చు. వారు చేసేది తక్కువ, ఆర్భాటం
ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ చేసినంత మాత్రాన లేక బాగా
చదువుకున్నందువలన లేక మంచి దుస్తులు ధరించినందువలన
అల్లిక పనులు బాగా వస్తాయి అని అనుకోవడం శుద్ధ తెలివి
తక్కువ.
 అటువంటివారి వలననే అల్లిక పనులు వలన ఖర్చు
ఎక్కువ అని అపవాదు పడింది.
 అయితే అసలు ఖర్చులేదని కాదు. ఖర్చు వున్నది
అది కూడా ఎక్కువ మాత్రంగాదు. కాని అందువలన లాభం
మాత్రం ఎక్కువ తీరిక సమయాలలో ఈ అల్లిక
పనులుచేసుకొని కొంత డబ్బును సంపాదించవచ్చు.
 అల్లిక పనులలో కొన్ని రకాలున్నాయి. కొన్ని
అందం కోసం, కొన్ని అలంకారం కోసం, కొన్ని ఆదాయం
కోసం.
 అందం కోసం తయారుచేసిన అల్లికలుకూడా బాగానే
అమ్ముడుపోతాయి. అందం, అలంకారం కోసం అంచులు,
చోళీలు మొదలైన అల్లిక పనులు వాడుకలో వున్నాయి.
 అల్లికల ద్వారా ఆదాయం చేసుకునే అవకాశంగల
కొన్ని పనులు వున్నాయి. అయితే ఇవి యంత్రాల ద్వారా
కూడా తయారవుతున్నాయి. యంత్రాల ద్వారా తయారైన
వాటికంటే చేతితో తయారుచేసిన వాటికి ఆదరణ ఎక్కువ
-38-
 అటువంటివి స్వెట్టర్లు, మేజోళ్ళు, తల టోపీలు,
మప్లర్లు మొదలైనవి.
చారుపొడి - ఊరగాయ:
 నిత్యం ఉపయోగించే వస్తువులలో చారుపొడి, సాంబారు
పొడి, కూరపొడి, ఊరగాయలు ముఖ్యమైనవి వీటినిగురించి
అధికంగా ఎవరికి ఎవరూ చెప్పనవసరం లేదు. ఇవి అందరికీ
తెలుసు, వీటి ఉపయోగమూ తెలుసు.
 ఈ వస్తువులు ప్రతి కుటుంబములోనూ వుంటాయి.
అయితే పట్నవాసాల్లో కొందరికి ఈ వస్తువులు ఎలాచేయాలో
తెలియదు.
 ఎందువల్ల? చదువుల కోసం తహతహలాడిపోతూ
వారి బాధ్యతలను మరిచిపోతున్నారు స్త్రీలు. అయితే స్త్రీలు
చైువుకోకూడదా? అని ఎవరూ అనరు, తప్పక చదువు
కోవాలి. ఆ చదువును సద్వినియోగ పర్చుకోవాలి. విజ్ఢానం
వెర్రి తలలు వేయకుండా చూసుకోవాలి.
 అది ఈనాడు తక్కువ. చదువుతున్నారుగాని
సంస్కారులు కాలేకపోతున్నారు. పిల్లల పెంపకం తెలియదు,
గృహాన్ని ఎలా వుంచుకోవాలో తెలియదు.
 చదువుకున్న వారికి ఈ మాత్రం చిన్న విషయాలు
తెలియకుండా వుంటాయా అంటారు కొందరు.
-39-
 అసలా ప్రశ్నకు యిచట తావులేదు. చదవు వేరు,
సంస్కారం వేరు. చదువు కష్టపడి చదువుకున్నందువలన
వస్తుంది. సంస్కారం అనేది పుట్టుకతో వస్తుంది.
 ఈ చదువుకున్న ఆడవాళ్ళకు యివి తెలియవు వారికి
ఏమీ తెలియవు. అందువలన ఇటువంటి గృహవసర
వస్తువులకు ఈనాడు విపరీతమైన ధర పలుకుతోంది.
 బీద కుటుంబాలవారు ఈ వస్తువులు
తయారుచేసుకోవచ్చు.
పొదుపు:
 అయితే ఈ విషయాలన్నీ మనం ఎందుకు
చెప్పుకుంటున్నట్లు మన ఖర్చులను మనం తగ్గించుకోవటానికిగల
మార్గాలను మనం తెలుసుకోవడానికి ఈ విషయ జ్ఞానం చాలా
అవసరం.
 అసలు పొదుపు అంటే ఏమిటి? మన ఖర్చులను మనం
తగ్గించుకోవడం, తగ్గించుకొన్న ఖర్చువలన మిగిలిన డబ్బును
దాచుకోవడం.
 పొదుపు వలన లాభాలు ఏమైనా వున్నవా అన్నది
మరొక ప్రశ్న.
 లేకేం చాలా వున్నాయి. ఈ రోజు మనంచేసే పొదుపు
రేపటి మన పిల్లలకు మడుపు!
-40-
 మన పొదుపు మనకు ధైర్యం!
 మనం చేసే పొదుపు మనకు బలం!!
 మన పొదుపు మనకు తృప్తి!!!
 పొదుపు మనమే చేసుకోవాలి. అయినా మన ప్రభుత్వం
వారు పొదుపు చేసుకోవడానికి కొన్ని అవకాశాలను
కల్పించారు. అవి వరుసగా తెలుసుకుందాం.
 పొదుపు పత్రాలు, ప్రైజుబాండ్లు, రక్షణనిధి పత్రాలు
మొదలైనవి.
 ఈ పైన చెప్పినవన్నీ ప్రతి తపాలా ఆఫీసులోనూ
దొరుకుతాయి.
 పొదుపు వలన అనేక లాభాలున్నాయి.
 పొదుపు మనకు బలం!
 మన దేశానికి బలం!!
 జై భారత్
X
              0 
</p></body></text></cesDoc>